ప్రొటెస్టంటు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్పైయర్‌లోని మెమోరియల్ చర్చి (1904 లో పూర్తయింది, పవిత్రం చేయబడింది) ప్రొటెస్టెంటును జ్ఞాపకం చేస్తుంది.
ది ప్రొటెస్టింగ్ స్పైయర్ , వార్మ్స్ లోని లూథర్ మాన్యుమెంట్‌లో భాగం

ఆది నుండి దేవుడు మానవునిని కొంత మంది నాయకుల సమక్షంలో నడుపుట మనం గమనించవచ్చు. మోషే, సమూయేలు, దావీదు వంటి వారి ద్వారా ప్రజలను ఏక త్రాటిపై నడిపించే ప్రయత్నం చేశాడు. ఇదే విధంగా నూతన వేదంలోనూ తన తరపున ప్రజలను నడిపించటానికి ఒక నాయకుడు అవసరమని క్రీస్తు గుర్తించాడు. అందుకోసం నాడు పేతురును నాయకునిగా ఎన్నుకొని శ్రీసభ (సంఘ) బాధ్యతలను అతనికి అప్పగించాడు[1]. కాలం గడిచే కొలదీ ఈ నాయకుడినే పోప్ (ఆద్యాత్మిక తండ్రి) అని పిలవడం ప్రారంభించారు. నాటి మొదటి తరం విశ్వాసులు, నాయకులు సైతం యేసు ఎన్నుకొనిన పేతురుతో చర్చించి ఏమైనా నిర్ణయాలు తీసికొనే వారు[2]. ఇలా యేసు ఎన్నుకొనిన ఆయన శిష్యుని ద్వారా, ఆయనతో కలసి పని చేసే వారు. ఇది సుమారుగా 1500 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగింది. అటుపిమ్మట కథోలిక శ్రీసభలోనే ఒక గురువుగా ఉన్న మార్టిన్ లూథర్ ఆయనకు నచ్చని విషయాలను ప్రధానాస్త్రంగా చేసుకొని యేసు స్థాపించిన ఏక నిత్య సత్య సభను కాదని స్వంత సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు స్థాపించిన సంఘానికి పోటీగా మానవుడు స్థాపించిన సంఘం ఏర్పడటం ఎంత దారుణమో చూడండి. ఉన్న శ్రీసభను కాదని ఎదురు తిరిగి స్థాపించాడు కనుకనే దానికి ప్రొటెస్టెంటు సంఘం అని పేరు వచ్చింది. ఆంగ్లంలో "ప్రొటెస్ట్" అనగా ఎదురు తిరగడం. అప్పటికే సంపూర్ణంగా ఉన్న బైబులును కాదని ఈయన 66 పుస్తకముల బైబులును వాడుక లోనికి తెచ్చాడు. నేడు ప్రొటెస్టెంటు సోదరులు వినియోగిస్తున్న బైబులు కేవలం 500 ల సంవత్సరాల నుండే అందుబాటులో ఉంది.కానీ శ్రీసభ ఉపయోగిస్తున్న 73 పుస్తకముల బైబులు క్రీస్తు కాలం నుండి అనగా 2000 సంవత్సరాల నుండి వాడుకలో ఉంది.

1. తోబితు
2. యూదితు
3. మక్కబీయులు1
4. మక్కబీయులు2
5. సొలోమోను జ్ఞానగ్రంధము
6. సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము
7. బారూకు

అను పుస్తకములను బైబుల నుండి మార్టిన్ లూథర్ గారు తీసివేశారు. పాపసంకీర్తన అనునది అప్పటికే బైబులు బోధించు సిద్దాంతమే అయినప్పటికీ[3] తన మంద పెరగడం కోసం శ్రీసభ మీదనే దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. కథోలిక శ్రీసభ మరియ తల్లిని గౌరవిస్తుంటే, పూజిస్తున్నారు అని అపనింద తోసి అందులో విజయవంతం అయ్యాడు. అయితే నాడు (15వ శతాబ్దంలో) ప్రపంచంlo ఎక్కువగా చదువుకున్న వారు లేకపోకవడంతో ఈయన మాటలను అనేక మంది గ్రుడ్డిగా విశ్వసించారు. కానీ నేడు ప్రజలు సత్యం తెలుసుకుంటున్నారు.

కనుక మనం దేవునికి విధేయులుగా ఉండవలెనో లేక తిరుగుబాటు చేసే వారీగా ఉండవలెనో మన చేతులలోనే ఉంది. పేతురు మీద క్రీస్తు ద్వారా స్థాపించబడిన శ్రీసభ అందరినీ ఆహ్వానిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. మత్తయి 16:18
  2. అపో. చ 15వ అధ్యాయం
  3. యోహాను 20:22-23