ఫాసియోలా హిపాటికా
సాధారణ లివర్ ఫ్లూక్ | |
---|---|
ఫాసియోలా హిపాటికా - adult worm | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Subclass: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | ఫా. హిపాటికా
|
Binomial name | |
ఫాసియోలా హిపాటికా (లిన్నేయస్, 1758)
|
ఫాసియోలా హిపాటికా లేదా సాధారణ లివర్ ఫ్లూక్ (లాటిన్ Fasciola hepatica) ప్లాటీహెల్మింథిస్ ఫైలమ్ లోని ట్రిమటోడా (Trematoda) ఉపతరగతికి చెందిన పరాన్నజీవులు. ఇవి పలుచగా ఆకువలె బల్లపరుపుగా యుండును.
ఇవి మానవులతో సహా వివిధ క్షీరదాల కాలేయములో నివసిస్తాయి. వీటి వలన కలిగే వ్యాధిని ఫాసియోలియాసిస్ లేదా ఫాసియోలోసిస్ (fascioliasis లేదా fasciolosis). ఇవి ప్రపంచమంతా విస్తరించి పశువులలో, గొర్రెలలో లివర్ రాట్ అనే వ్యాధిని తద్వారా ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తాయి.
నిర్మాణము
[మార్చు]ఫాసియోలా శరీరము బల్లపరుపుగా పృష్టోదర తలములలో అణచబడి వుండును. ఆకువలె ద్విపార్శ్వ సౌష్టవమును చూపును. వీని జీర్ణమండలములోని పైత్యరసము వలన ముదురు ఎరుపు (మట్టి) రంగులో ఉండును.
ఫాసియోలా జీవులు పూర్వాంతములో వెడల్పుగాను, పరాంతములో కురచగాను ఉండును. పూర్వాంతమునందు శిరోలంబిక లేదా అగ్రలంబిక ఏర్పడియుండును. ఈ అగ్రలంబిక పూర్వభాగమున పూర్వ అంటుబిళ్ళ ఏర్పడి మధ్యన నోరును కలిగియుండును. అగ్రలంబికకు కొద్దిగా దిగువన ఉదరతలమునందు ఉదర లేదా పర అంటుబిళ్ళ యుండును. దీనినే అసిటాబులమ్ అని కూడా అంటారు. రెండు అంటుబిళ్ళల మధ్యన జనన రంధ్రము లేక గోనోపోర్ (Gonopore) ఉండును. ఈ రంధ్రము ద్వారా స్త్రీ పురుష వ్యవస్థలు బయటకు తెలుచుకొనును. అసిటాబులమ్ అనునది కండర నిర్మితమైన గ్రంథి నిర్మాణము. శరీర పరభాగములో విసర్జక రంద్రము ఉండును.
జీవితచరిత్ర
[మార్చు]ఫాసియోలా జీవితచక్రము చాలా క్లిష్టముగా యుండును. ఫలదీకరణము చెందిన గుడ్లు తేమగాయున్న నేలపైన పడినప్పుడు మాత్రమే అభివృద్ధిచెందును. అభివృద్ధి చెందుతున్న అండములకు గుళికయందున్న పీతకణముల నుండి ఆహారము లభించును. గర్భాశయములో వుండగానే ఫలదీకరణము చెందిన అండములు అభివృద్ధిచెందుట ప్రారంభమగును. మొదటి విదళనము వలన రెండు అసమాన కణములు ఏర్పడును. చిన్నకణము జననకణము (Propagative cell) అని, పెద్దకణమును దైహికకణము (Somatic cell) అంటారు. దైహికకణము దానినుండి ఏర్పడిన ఇతర కణములు ఢింబకము యొక్క బాహ్యత్వచమును ఏర్పరచును. తరువాత జననకణము రెండుగా విభజించబడి వానిలో పెద్దకణము ఢింబకమ్ యొక్క మధ్య, అంతస్త్వచములను ఏర్పరచును. రెండవ కణము జననకణముల సమూహము నేర్పరచును. ఈ విధమైన విభజన ప్రతి ఢింబకములోను కనిపించును.
మిరాసిడియం ఢింబకము
[మార్చు]ఫలదీకరణము చెందిన రెండు వారాలలో శైలికలతో కూడిన మిరాసిడియం (Miracidium) ఢింబకము అండము యొక్క ఉపరికులను తొలగించుకొని విడుదలగును. ఇది ఫాసియోలా జీవితచరిత్రలో మొదటి ఢింబకదశ. ఇవి ఆహారము తీసుకొనవు. కానీ నీటిలో స్వేచ్ఛగా ఈదుచూ జీవనము గడుపును. ఇవి 12-15 గంటలలో రెండవ అతిథేయి అయిన లిమ్నియా, బులినస్ లేదా ప్లనార్చిస్ జాతులకు చెందిన మంచినీటి నత్తని చేరవలెను. నత్తని చేరినపుడు అగ్రలంబిక సహాయంతో మిరాసిడియం నత్తయొక్క పుపుసకోశము చేరును. అచ్చటనుండి ప్రవేశక గ్రంథుల సహాయముతో నత్త కణజాలములను చేరును. అక్కడ మిరాసిడియం శైలికలను, జ్ఞానావయవములను కోల్పోయి స్పోరోసిస్టు (Sporocyst) గా మారును.
స్పోరోసిస్టు
[మార్చు]స్పోరోసిస్టు పొడవైన ఒక సంచివంటి నిర్మాణము. ఇవి నత్తలయొక్క తల, పాదము, ప్రావారములలో కనిపించును. వీని వెలుపలి వైపు పలుచని అవభాసిని పొర, దానికి దిగువన కండర పొర, తరువాత మీసెంకైమ్ పొరలుండును. ఒక జత జ్వాలా కణములు రెండు వైపులా ఏర్పడియుండును. దీనిలోని జననకణముల సమూహములు తరువాత ఢింబకదశలను ఏర్పరచును. ప్రతి స్పోరోసిస్టు నుండి 5-8 రీడియా దశలు ఏర్పడును.
రీడియా
[మార్చు]రీడియా ఢింబకములు నత్తయొక్క కణజలములోనికి, అక్కడ నుండి కాలేయములోనికి ప్రవేశించును. ఇవి పొడవైన శరీరము కలిగి కుడ్యములో అవభాసిని, కండరముల పొర, మీసెంకైమ్ పొరలుండును. పూర్వాంతంలో నోరు, గ్రసని, ఆహారవాహిక, సంచివంటి పేగువుండును. ఇరుప్రక్కల జతలుగ ఉన్న అనేక జ్వాలా కణములుండును. వీనిలోని జననకణముల నుండి వేసవికాలంలో రెండవ దశ రీడియాలు లేదా శీతాకాలంలో సర్కేరియా ఢింబకములు ఏర్పడును. ఇవి రీడియో ఒక్క జననరంధ్రము నుండి నత్త కణజాలములోనికి విడుదలయగును. ఒక్కొక్క రీడియా నుండి 14-20 సర్కేరియా ఢింబకములు తయారగును.
సర్కేరియా
[మార్చు]సర్కేరియా హృదయాకారంలో నుండి తోకను కలిగియుండును. ఇవి రీడియా జననరంద్రము నుండి బయటకు వచ్చి నత్త యొక్క పుపుసకోశమును చేరును. అక్కడనుండి నీటిలోనికి విడుదలయగును. శరీరము ముళ్ళతో కూడిన అవభాసిని, కండరముల పొర, మిసెంకైమ్ పొరలతో ఏర్పడును.
మూలాలు
[మార్చు]- ఫాసియోలా హిపాటికా (లివర్ ఫ్లూక్), జంతు శాస్త్రము, సి.గోపాల్, శ్రీ వికాస్ పబ్లికేషన్స్, గుంటూరు.