బాద్‌షాహీ అషుర్‌ఖానా
బాద్‌షాహీ అషుర్‌ఖానా | |
---|---|
Native name అషుర్‌ఖానా | |
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
నిర్మించినది | 1594 |
బాద్‌షాహీ అషుర్‌ఖానా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని చార్మినార్ సమీపంలోఉన్న షియా ముస్లిం సంతాప ప్రదేశం. ఇమామ్ హుస్సేన్ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించబడిన ఈ ప్రదేశాన్ని మొహర్రం పండుగ సందర్భంగా ఉపయోగిస్తారు.[1][2][3]
చరిత్ర
[మార్చు]ముహమ్మద్ కులీ కుతుబ్ షా ఆధ్వర్యంతో 1594లో దీని నిర్మాణం ప్రారంభం కాగా, చార్మినార్ నిర్మించిన మూడు సంవత్సరాల తరువాత 1611లో నిర్మాణం పూర్తయింది.[4] 1611లో అబ్దుల్లా కుతుబ్ షా ఆధ్వర్యంలో అద్భుతమైన రంగు టైల్-మొజాయిక్ అలంకరణ పూర్తయింది. 1764లో నిజాం రాజు నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II కాలంలో చెక్క కొలొనేడ్లు, బయటి గదులు, ప్రవేశ ద్వారం నిర్మించబడ్డాయి.[5]
స్మారక చిహ్నం
[మార్చు]అషుర్‌ఖానాలో నియాజ్ ఖానా (సమర్పణ స్థలం), నకార్ ఖానా (డ్రమ్స్ ప్లేస్), సారై ఖానా (భక్తుల కోసం), అబ్దర్ ఖానా (తాగునీటి ప్రదేశం), లంగర్ ఖానా (ఆహార వడ్డించే ప్రదేశం), మకాన్-ఎ-ముజావర్ (ముజావర్ నివాసం), దఫ్తార్-ఎ-ముజావర్ (ముజావర్ కార్యాలయం), అలవా చాబుత్రా, భద్రత గది మొదలైనవి ఉన్నాయి.[6]
ఇతర వివరాలు
[మార్చు]- ఇది ఇప్పుడు వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడింది.
- పూర్వీకుల వంశపారంపర్యంగా ముతవల్లి ముజావర్ మీర్ నవాజిష్ అలీ మూస్వి 11వ తరం సంరక్షకుడితోపాటు రాష్ట్ర పురావస్తు శాఖ, మ్యూజియం దీనిని చూసుకుంటుంది.[7]
మూలాలు
[మార్చు]- ↑ "INTACH awards presented". The Hindu. Archived from the original on 13 డిసెంబరు 2006. Retrieved 19 June 2020.
- ↑ "Rediscovering the heritage of the city". The Hindu. Archived from the original on 8 November 2011. Retrieved 19 June 2020.
- ↑ Bilgrami, Syed Ali Asgar (1992). Landmarks of the Deccan: A Comprehensive Guide to the Archaeological Remains of the City and Suburbs of Hyderabad (in ఇంగ్లీష్). Asian Educational Services. ISBN 9788120605435.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (9 October 2016). "భాగ్యనగరాన్ని నాశనం చేసిన ఔరంగజేబు..చార్మినార్‌ను మాత్రం వదిలేశాడెందుకు". Archived from the original on 19 June 2020. Retrieved 19 June 2020.
- ↑ "Heritage Walk in Hyderabad – Badshahi Ashurkhana".
- ↑ "Remove encroachments at Ashoor Khana: HC". Times of India. Archived from the original on 2014-02-02. Retrieved 19 June 2020.
- ↑ "Logo for state archaeology after 90 years". Times of India. Archived from the original on 2012-10-22. Retrieved 19 June 2020.