బాబ్ ఫోస్సే
బాబ్ ఫోస్సే | |
---|---|
జననం | రాబర్ట్ లూయిస్ ఫోస్సే 1927 జూన్ 23 చికాగో, ఇల్లినాయిస్, యుఎస్ |
మరణం | 1987 సెప్టెంబరు 23 వాషింగ్టన్, డి.సి., యుఎస్ | (వయసు 60)
వృత్తి | |
క్రియాశీల సంవత్సరాలు | 1947–1987 |
జీవిత భాగస్వామి |
|
భాగస్వామి | ఆన్ రీంకింగ్ (1972–1978) |
పిల్లలు | నికోల్ ఫోస్సే |
రాబర్ట్ లూయిస్ ఫోస్సే (1927, జూన్ 23 – 1987, సెప్టెంబరు 23) అమెరికన్ సినిమా-నాటకరంగ దర్శకుడు, నటుడు, నృత్యదర్శకుడు.[1] ది పైజామా గేమ్ (1954), డామ్ యాన్కీస్ (1955), హౌ టు సక్సీడ్ ఇన్ బిజినెస్ వితౌట్ రియల్లీ ట్రైయింగ్ (1961), స్వీట్ ఛారిటీ (1966), పిప్పిన్ (1972), చికాగో (1975), స్వీట్ ఛారిటీ (1969), క్యాబరేట్ (1972), లెన్ని (1975), ఆల్ దట్ జాజ్ (1979), స్టార్ 80 (1983) మొదలైన సినిమాలకు దర్శకత్వం వహించాడు.
1973లో ఒకే సంవత్సరంలో ఆస్కార్, ఎమ్మీ, టోనీ అవార్డులను గెలుచుకున్న ఏకైక వ్యక్తి ఫోస్సే. నాలుగు అకాడమీ అవార్డులకు నామినేట్ అవ్వడంతోపాటు క్యాబరే సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డును గెలుపొందాడు. 1980లో ఆల్ దట్ జాజ్ సినిమాకు పామ్ డి'ఓర్ అవార్డును గెలుచుకున్నాడు. తన కొరియోగ్రఫీకి రికార్డుస్థాయిలో ఎనిమిది టోనీ అవార్డులను గెలుచుకున్నాడు.
జననం
[మార్చు]ఫోస్సే 1927, జూన్ 23న సిరిల్ కింగ్స్లీ ఫోస్సే - సారా ఆలిస్ "సాడీ" దంపతులకు ఇల్లినాయిస్‌లోని చికాగో నగరంలో జన్మించాడు.[2] ఆరుగురు పిల్లలలో ఇతడు ఐదవవాడు.[1][3][4]
మరణం
[మార్చు]ఫోస్సే 1987 సెప్టెంబరు 23న గుండెపోటుతో జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయ హాస్పిటల్‌లో మరణించాడు. నేషనల్ థియేటర్ సమీపంలో స్వీట్ ఛారిటీ పునరుద్ధరణ ప్రారంభించే[1] సమయంలో విల్లార్డ్ హోటల్ సమీపంలో వెర్డాన్ చేతుల్లో కుప్పకూలిపోయాడు.[5]
ఫోస్సే కోరినట్లుగా లాంగ్ ఐలాండ్‌లోని అట్లాంటిక్ మహాసముద్రంలో ఇతని చితాభస్మం కలుపబడింది.[6]
నాటకరంగం
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | వేదిక | మూలాలు |
---|---|---|---|---|
1947 | కాల్ మీ మిస్టర్ | ప్రదర్శకుడు - కోరస్ | జాతీయ పర్యటన | |
1948 | మేక్ మైన్ మాన్హాటన్ | ప్రదర్శకుడు | జాతీయ పర్యటన | |
1950 | డాన్స్ మీ ఏ సాంగ్ | ప్రదర్శకుడు - నర్తకుడు | రాయల్ థియేటర్, బ్రాడ్‌వే | [7] |
1951 | బిలియన్ డాలర్ బేబీ | నటుడు - చాంప్ వాట్సన్ | ఆల్విన్ థియేటర్, బ్రాడ్‌వే | [8] |
1952 | పాల్ జోయ్ | నటుడు - జోయ్ ఎవాన్స్ (అండర్ స్టడీ) | బ్రాడ్‌హర్స్ట్ థియేటర్, బ్రాడ్‌వే | |
1954 | పైజామా గేమ్ | నృత్య దర్శకుడు | ||
1955 | డామన్ యాన్కీస్ | నృత్య దర్శకుడు | అడెల్ఫీ థియేటర్, బ్రాడ్‌వే | |
1956 | బెల్స్ ఆర్ రింగింగ్ | కో-కొరియోగ్రాఫర్ | ఆల్విన్ థియేటర్, బ్రాడ్‌వే | |
1958 | న్యూ గర్ల్ ఇన్ టౌన్ | నృత్య దర్శకుడు | 46వ వీధి థియేటర్, బ్రాడ్‌వే | |
1959 | రెడ్ హెడ్ | దర్శకుడు, కొరియోగ్రాఫర్ | ||
1961 | ది కంక్వేరింగ్ హీరో | కొరియోగ్రాఫర్ (అన్‌క్రెడిటెడ్) | ఎఎన్టిఏ థియేటర్, బ్రాడ్‌వే | |
1961 | హౌ టు సక్సీడ్ ఇన్ బిజినెస్ వితౌట్ రియల్లీ ట్రైయింగ్ | నృత్య దర్శకుడు | 46వ వీధి థియేటర్, బ్రాడ్‌వే | |
1962 | లిటిల్ మీ | కో-డైరెక్టర్, కో-కొరియోగ్రాఫర్ | లంట్-ఫోంటానే థియేటర్, బ్రాడ్‌వే | |
1963 | పాల్ జోయ్ | జోయ్ ఎవాన్స్ | న్యూయార్క్ సిటీ సెంటర్, బ్రాడ్‌వే | |
1965 | ప్లెజర్స్ ఆండ్ ప్యాలసెస్ | దర్శకుడు, కొరియోగ్రాఫర్ | ఫిషర్ థియేటర్, డెట్రాయిట్ | [9] |
1966 | స్వీట్ ఛారిటీ | దర్శకుడు, కొరియోగ్రాఫర్ | ప్యాలెస్ థియేటర్, బ్రాడ్‌వే | |
1972 | పిప్పిన్ | పుస్తకం (అన్‌క్రెడిటెడ్), డైరెక్టర్, కొరియోగ్రాఫర్ | ఇంపీరియల్ థియేటర్, బ్రాడ్‌వే | |
1972 | లిజా | దర్శకుడు, కొరియోగ్రాఫర్ | వింటర్ గార్డెన్ థియేటర్, బ్రాడ్‌వే | [10] |
1975 | చికాగో | పుస్తకం; దర్శకుడు, కొరియోగ్రాఫర్ | 46వ వీధి థియేటర్, బ్రాడ్‌వే | |
1978 | డ్యాన్స్ | దర్శకుడు, కొరియోగ్రాఫర్ | అంబాసిడర్ థియేటర్, బ్రాడ్‌వే | |
1986 | బిగ్ డీల్ | దర్శకుడు, కొరియోగ్రాఫర్ | బ్రాడ్‌వే థియేటర్, బ్రాడ్‌వే |
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | దర్శకుడు | రచయిత | నృత్య దర్శకుడు | నటుడు | పాత్ర | మూలాలు |
---|---|---|---|---|---|---|---|
1953 | ది అఫైర్స్ ఆఫ్ డోబీ గిల్లిస్ | Yes | చార్లీ ట్రాస్క్ | ||||
1953 | కిస్ మి కేట్ | Yes | హార్టెన్సియో | ||||
1953 | గీవ్ ఏ గర్ల్ ఏ బ్రేక్ | Yes | బాబ్ డౌడీ | ||||
1955 | మై సిస్టర్ఎలీన్ | Yes | Yes | ఫ్రాంక్ | |||
1957 | పైజామా గేమ్ | Yes | |||||
1958 | డామన్ యాన్కీస్ | Yes | Yes | మంబో డాన్సర్ (అన్‌క్రెడిటెడ్) | |||
1969 | స్వీట్ ఛారిటీ | Yes | Yes | ||||
1972 | క్యాబరే | Yes | Yes | ||||
1974 | లిటిల్ ప్రిన్స్ | Yes | Yes | నటుడు - ది స్నేక్ | |||
1974 | లెన్ని | Yes | Yes | ఇంటర్వ్యూయర్ (వాయిస్, గుర్తింపు లేనిది) | |||
1977 | థీవ్స్ | Yes | మిస్టర్ డే | ||||
1979 | ఆల్ దట్ జాజ్ | Yes | Yes | Yes | |||
1983 | స్టార్ 80 | Yes | Yes |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఇతర వివరాలు | మూలాలు |
---|---|---|---|---|
1950 | ది జార్జ్ బర్న్స్ అండ్ గ్రేసీ అలెన్ షో | భార్య మేరీ ఆన్ నైల్స్‌తో కలిసి డ్యాన్స్ రొటీన్ | ఎపిసోడ్: గ్రేసీ ది ఆర్టిస్ట్ | |
1959 | స్టార్ట్ టైం | దర్శకుడు | ఎపిసోడ్: ది వండర్‌ఫుల్ వరల్డ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ | |
1972 | లిజా విత్ ఏ జెడ్ | దర్శకుడు | టెలివిజన్ |
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డు | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|---|
1972 | అకాడమి పురస్కారం | ఉత్తమ దర్శకుడు | క్యాబరే | విజేత |
1974 | లెన్ని | నామినేట్ | ||
1979 | ఆల్ దట్ జాజ్ | నామినేట్ | ||
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే | నామినేట్ | |||
1955 | టోనీ అవార్డు | ఉత్తమ కొరియోగ్రఫీ | పైజామా గేమ్ | విజేత |
1956 | డామన్ యాన్కీస్ | విజేత | ||
1957 | బెల్స్ ఆర్ రింగింగ్ | నామినేట్ | ||
1958 | న్యూ గర్ల్ ఇన్ టౌన్ | నామినేట్ | ||
1959 | రెడ్ హెడ్ | విజేత | ||
1963 | సంగీతానికి ఉత్తమ దర్శకత్వం | లిటిల్ మీ | నామినేట్ | |
ఉత్తమ కొరియోగ్రఫీ | విజేత | |||
1964 | ఉత్తమ సంగీత దర్శకత్వం | పాల్ జోయ్ | నామినేట్ | |
1966 | సంగీతానికి ఉత్తమ దర్శకత్వం | స్వీట్ ఛారిటీ | నామినేట్ | |
ఉత్తమ కొరియోగ్రఫీ | విజేత | |||
1973 | సంగీతానికి ఉత్తమ దర్శకత్వం | పిప్పిన్ | విజేత | |
ఉత్తమ కొరియోగ్రఫీ | విజేత | |||
1976 | సంగీతానికి సంబంధించిన ఉత్తమ పుస్తకం | చికాగో | నామినేట్ | |
సంగీతానికి ఉత్తమ దర్శకత్వం | నామినేట్ | |||
ఉత్తమ కొరియోగ్రఫీ | నామినేట్ | |||
1978 | సంగీతానికి ఉత్తమ దర్శకత్వం | డ్యాన్స్ | నామినేట్ | |
ఉత్తమ కొరియోగ్రఫీ | విజేత | |||
1986 | సంగీతానికి సంబంధించిన ఉత్తమ పుస్తకం | బిగ్ డీల్ | నామినేట్ | |
సంగీతానికి ఉత్తమ దర్శకత్వం | నామినేట్ | |||
ఉత్తమ కొరియోగ్రఫీ | విజేత | |||
1973 | ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డు | అత్యుత్తమ వెరైటీ, సంగీతం లేదా హాస్యం | లిజా విత్ ఏ జెడ్ | విజేత |
కామెడీ, వెరైటీ లేదా సంగీతంలో అత్యుత్తమ దర్శకత్వం | విజేత | |||
అత్యుత్తమ కొరియోగ్రఫీ | విజేత |
1973 అకాడమీ అవార్డులలో క్యాబరే సినిమాకు ఉత్తమ దర్శకుడిగా అకాడమీ అవార్డును గెలుచుకున్నాడు. 1973లో పిప్పిన్ సినిమాకు దర్శకత్వం, కొరియోగ్రఫీ విభాగంలో టోనీ అవార్డులను గెలుచుకున్నాడు. లిజా విత్ ఎ జెడ్ అనే టెలివిజన్ ప్రత్యేక కార్యక్రమానికి నిర్మాణం, కొరియోగ్రఫీ, దర్శకత్వం విభాగంలో ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డులను గెలుచుకున్నాడు. ఒకే సంవత్సరంలో మూడు ప్రధాన సినీ అవార్డులను గెలుచుకున్న ఏకైక వ్యక్తి ఫోస్సే.
2007 ఏప్రిల్ 27న న్యూయార్క్ నగరం, సరాటోగా స్ప్రింగ్స్‌లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ డ్యాన్స్‌లో చేర్చబడ్డాడు. 1994లో స్థాపించబడిన లాస్ ఏంజిల్స్ డ్యాన్స్ అవార్డ్స్‌ను "ఫోస్సే అవార్డ్స్" అని పిలిచేవారు. ప్రస్తుతం దీనిని అమెరికన్ కొరియోగ్రఫీ అవార్డ్స్ అని పిలుస్తున్నారు. బాబ్ ఫోస్సే-గ్వెన్ వెర్డాన్ ఫెలోషిప్‌ను ఇతని కుమార్తె నికోల్ ఫోస్సే 2003లో ఆల్విన్ ఐలీ అమెరికన్ డ్యాన్స్ థియేటర్‌లో స్థాపించారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 McQuiston, John T. (September 24, 1987). "Bob Fosse, Director and Choreographer, Dies". The New York Times.
Robert Louis Fosse was born in Chicago on June 23, 1927, the son of a vaudeville entertainer. He began performing on the vaudeville circuit as a child, and by the age of 13 he was a seasoned veteran of many burlesque shows. ...
- ↑ Gottfried 2003, p. 11.
- ↑ "Hardcover in Brief". The Washington Post. November 18, 1990. Archived from the original on November 2, 2012. Retrieved 2023-06-02.
- ↑ Garraty, John Arthur; Carnes, Mark C. (1999). American National Biography. ISBN 9780195127874.
- ↑ Hall, Charles and Stevenson, Douglas. "Bob Fosse Dies After Collapsing on D.C. Street" The Washington Post, September 24, 1987
- ↑ Gottfried 2003, pp. 449–50.
- ↑ "Dance Me a Song – Broadway Musical – Original | IBDB".
- ↑ IBDb profile: Max Goberman; accessed 2023-06-02.
- ↑ Suskin, Steven. "Frank Loesser" Show Tunes : The Songs, Shows, and Careers of Broadway's Major Composers (2010), (books.google.com), Oxford University Press, ISBN 0-19-988615-6, p.242
- ↑ "Liza with a 'Z". The Internet Movie Database. 2008. Retrieved 2023-06-02.