బుర్రా విజయదుర్గ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుర్రా విజయదుర్గ
జననం (1962-03-04) 1962 మార్చి 4 (వయసు 62)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి

బుర్రా విజయదుర్గ ప్రముఖ రంగస్థల నటీమణి. ఈవిడ మూడువేలకు పైగా పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటక ప్రదర్శనలు ఇచ్చారు. వీరు చింతామణి, చంద్రమతి, బాలనాగమ్మ, లక్ష్మీ, పద్మావతి పాత్రలలో ప్రసిద్ధులు.[1]

జననం[మార్చు]

బుర్రా విజయదుర్గ మార్చి 4, 1962లో విజయవాడలో జన్మించారు. ఈవిడ తండ్రి ములుగు వీరభధ్రరావు కూడా రంగస్థల కళాకారుడే.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

విజయదుర్గ 11 సంవత్సరాల వయసులోనే నాటకాలలో నటించడం ప్రారంభించారు. 1977లో గాలివాన అనే సాంఘిక నాటకంలో మొదటిసారిగా నటించారు. మోతుకూరి జాక్సన్ రచించిన దేవాలయం, నటనాలయం నాటకాలు, మండువా లోగిలి వంటి నాటకాలలో నటించారు. షణ్ముఖ నాట్యమండలి, శ్రీ సాయిబాబా నాట్యమండలి, శ్రీ కనకదుర్గ విజయసాయి నాట్యమండలి వారి సంస్థల నాటక ప్రదర్శనలలో నటించారు. రేడియో, దూరదర్శన్ లలో కూడా చేశారు. వీరి కుమార్తె అమృతవర్షిణి కూడా రంగస్థలంపై నటిగా రాణిస్తున్నారు.


నటించిన నాటకాలు[మార్చు]

పౌరాణికం[మార్చు]

  1. శ్రీకృష్ణ తులాభారం
  2. శ్రీకృష్ణాంజనేయ యుద్ధం
  3. శ్రీకృష్ణ లీలలు
  4. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి కథ
  5. ఊర్వశీ శాపవిమోచనము
  6. శ్రీ తిరుపతమ్మ కథ
  7. సతీ సక్కుబాయి
  8. స్వామి అయ్యప్ప
  9. దత్తాత్రేయ మహాత్యం
  10. కళ్యాణ రామ
  11. మైరావణ
  12. భూకైలాస్
  13. మాయబజార్
  14. సీతా కళ్యాణం
  15. లవకుశ
  16. శ్రీరామాంజనేయ యుద్ధం
  17. హరిశ్చంద్ర
  18. చింతామణి
  19. బాలనాగమ్మ
  20. తారాశశాంకం
  21. పల్నాటి యుద్ధం
  22. నర్తనశాల
  23. మోహినీ భస్మాసుర
  24. వేంకటేశ్వర మహాత్యం
  25. కాళహస్తీ మహాత్యం
  26. అల్లూరి సీతారామరాజు
  27. పృధ్వీ సంయుక్త
  28. శ్రీకృష్ణ చైతన్య లీలలు
  29. సతీ తులసి
  30. రామరావణయుద్ధం
  31. నలదమయంతి
  32. అనార్కలి
  33. గయోపాఖ్యనం
  34. జరాసంధ
  35. శ్రీకక్ష్మిష్ణ రాయభారం
  36. బలరామకృష్ణ

క్రిస్టియన్ నాటకాలు[మార్చు]

  1. ఏసు మగ్ధలీన
  2. శిలువధారి
  3. దేవుడు విజయము
  4. లాజర్ ధనవంతుడు
  5. యోహన్ శిరశ్ఛేదం
  6. బెత్లెహం శిశువు
  7. తప్పిపోయిన కుమారుడు
  8. బైబిల్ దొంగలు

సాంఘీక నాటకాలు[మార్చు]

  1. పల్లెపడుచు
  2. గాలివాన
  3. దేవాలయం
  4. నటనాలయం
  5. ఆరని కన్నీరు
  6. కన్నీటి కాపురం
  7. వలయం
  8. లావాలో ఎర్రగులాబి
  9. టెలిఫోన్
  10. తులసీతీర్థం
  11. పుటుక్కు జరజర డుబుక్కుమే
  12. రక్తకన్నీరు
  13. తిరసృతి
  14. దేవుడులేని దేవాలయం
  15. నవయుగం
  16. భ్రష్ట
  17. సమాజం మారాలి
  18. మండువా లోగిలి
  19. అతిథి దేవుల్లోస్తున్నారు జాగ్రత్తా
  20. ప్రేమకు సంకెళ్లు
  21. దేవదాసు
  22. రావణకాష్టం
  23. ప్రాణంఖరీదు
  24. ఈ బ్రతుకు మాకొద్దు
  25. రంగూన్ రౌడి
  26. రంగూన్ రంగడు
  27. రాముడు రంగడు
  28. పూల రంగడు
  29. నిప్పురవ్వలు
  30. మోసగాళ్లకు మోసగాడు
  31. చిల్లరకొట్టు చిట్టెమ్మ

మూలాలు[మార్చు]

  1. నవతెలంగాణ, మానవి (4 March 2018). "మూడువేలకు పైగా నాటక ప్రదర్శనల్లో..!". Archived from the original on 7 మార్చి 2018. Retrieved 5 July 2018.