అమృతవర్షిణి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
అమృతవర్షిణి
AmruthavArshini.jpg
జననం (1988-10-08) 8 అక్టోబరు 1988 (వయస్సు: 29  సంవత్సరాలు)
విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాసం గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయురాలు
జాతి తెలుగు
వృత్తి నటి
తల్లిదండ్రులు బుర్రా విజయదుర్గ

అమృత వర్షిణి, ప్రముఖ రంగస్థల నటీమణి. 2016 నంది నాటకోత్సవం లో యాది నాటికలోని నటనకుగానూ ఉత్తమ నటిగా నంది బహుమతిని అందుకున్నది.[1]

యాది నాటికకు ఉత్తమ నటిగా నంది పురస్కారం అందుకుంటున్న అమృతవర్షిణి

జననం - విద్యాభ్యాసం[మార్చు]

అమృత వర్షిణి 1988, అక్టోబరు 8న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా లోని విజయవాడలో జన్మించింది. ఈవిడ ప్రముఖ రంగస్థల నటి బుర్రా విజయదుర్గ కూతురు. అర్థశాస్త్రంలో ఎం.ఎ. చదివిన అమృత, మానవ వనరుల శాస్త్రంలో ఎంబిఏ పూర్తి చేసింది.[1]

అమృతవర్షిణి గురించి ఈనాడులో వచ్చిన వార్త

రంగస్థల ప్రస్థానం[మార్చు]

2014 ఆగస్టులో 'కలహాల కాపురం' నాటికతో రంగస్థలంపై అడుగు పెట్టింది. ఇప్పటివరకు 700 నాటక, నాటికల ప్రదర్శనలలో పాల్గొన్నది. అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా బహుమతులు, సత్కారాలు అందుకుంది. విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో బి గ్రేడ్ కళాకారిణిగా గుర్తింపు పొందింది.[1]

నటించినవి[మార్చు]

 • నాటకాలు: బ్రతకనివ్వడండి, మదర్ థెరీసా, బృందావనం, ఇంటింటి కథ, లావాలో ఎర్రగులాబి, నేటిగాంధి, మనోనయనం, కలిసుంటాం అంతే మొదలైన సాంఘీక నాటకాలు... భక్త కన్నప్ప, పాండవుద్యోగం, సత్యహరిశ్చంద్ర, ఝాన్సీ లక్ష్మీబాయి, బాల నాగమ్మ, చింతామణి మొదలైన పౌరాణిక నాటకాలు
 • నాటికలు: యాది, గోవు మాలచ్చిమి, అక్షయ, మరో దేవాలయం, సౌందర్య భారతం,[2] నిశబ్ద సంకేతం. శిక్ష, బంగారం, భలే వాళ్లే వీళ్లు, అమృతవర్షిణి, యయాతి, కలహాల కాపురం, పెళ్ళి చేసి చూడు, ఆఖరి ఉత్తరం,[3] ఆశ్రయం, నేటి న్యాయం, పల్లె పడుచు, పంజరంలో పక్షులు, ఒక్కమాటేచాలు, సముద్రమంత సంతోషం, అక్క అలుగుడు..చెల్లి సణుగుడు, వామ్మో గుత్తొంకాయ్‌ మొదలైన నాటికలు

బహుమతులు[మార్చు]

* నంది బహుమతులు:
ఉత్తమ నటి - యాది, నంది నాటక పరిషత్తు - 2016 [4]

* గరుడ బహుమతులు:

 • ఉత్తమ నటి - సౌందర్య భారతం, 2015
 • ఉత్తమ నటి - యాది, 2016
 • ఉత్తమ ద్వితీయ నటి - యయాతి (పౌరాణికం), 2016

* ఇతర బహుమతులు:

 1. ఉత్తమనటి - అక్షయ (నాటిక), 2015 (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2015)
 2. ఉత్తమనటి - మరోదేవాలయం (2015), యాది (2016), గోవు మాలచ్చి (2017) (అప్పాజోశ్యుల విష్ణుంభోట్ల కుందాళం కళాపరిషత్తు, చిలకలూరిపేట)
 3. ఉత్తమనటి - యాది (నాటిక), 2016 (అక్కినేని నాగేశ్వర రావు నాటక కళాపరిషత్ - 2016, హైదరాబాద్)[5]
 4. ఉత్తమనటి - యాది (నాటిక), 9-11 ఏప్రిల్ 2016 (అభినయ నాటక పరిషత్, పొనుగుపాడు)
 5. ఉత్తమనటి - యాది (నాటిక), 2016 (ప్రగతి కళామండలి, సత్తెనపల్లి)[6]
 6. ఉత్తమనటి - యాది (నాటిక), 2016 (శార్వాణి, చైతన్య యువజన సంఘం, బి.గొనపపుట్టుగ, శ్రీకాకుళం జిల్లా)[7]
 7. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (రంగస్థలి, నరసరావుపేట, గుంటూరు జిల్లా)[8]
 8. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (తాడేపల్లిగూడెం ఉగాది నాటక పోటీలు)
 9. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (పొన్నూరు కళాపరిషత్, పొన్నూరు. 18వ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు)
 10. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్, కాకినాడ. 19వ ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు, జూలై 4-6, 2017)

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 ఈనాడు, తెనాలి (8 March 2017). "విజేతలు". 
 2. ప్రజాశక్తి. "సామాజిక స్పృహతో 'మరో దేవాలయం'". Retrieved 27 March 2017. 
 3. ఆంధ్రజ్యోతి. "గుంటూరులో అలరించిన ‘ఆఖరి ఉత్తరం’ నాటకం". Retrieved 11 June 2017. 
 4. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ మరియు నాటకరంగ అభివృద్ధి సంస్థ. "నంది పురస్కారం 2016". www.apsftvtdc.in. Retrieved 20 July 2017. 
 5. సినీవినోదం. "నారాయణమూర్తి కి అక్కినేని పురస్కారం". www.cinevinodam.com. Retrieved 7 October 2016. 
 6. ఈనాడు, సత్తెనపల్లి, May 3, 2016
 7. డైలీ హంట్. "సమాజానికి జీవనాడి నాటకరంగం". dailyhunt.in. Retrieved 7 October 2016. 
 8. ఆంధ్రజ్యోతి, హోమ్, సాహిత్య వార్తలు. "ముగిసిన రంగస్థలి నాటిక పోటీలు". Retrieved 27 March 2017.