Jump to content

మానవ వనరులు

వికీపీడియా నుండి

మానవ వనరులు (ఆంగ్లం:human resources) పాశ్చాత్య దేశాలలో 1960వ సంవత్సరంలో నూతనంగా, సాపేక్షంగా, కనుగొనబడిన నిర్వహణకు సంబంధించిన ఆధునిక పదం అయినప్పటికీ, మానవ వనరుల నిర్వహణ ప్రాముఖ్యతను వేద యుగాలు నుండే భారతదేశంలో గుర్తించవచ్చును. భగవద్గీతలో, కృష్ణుడు అర్జునుడికి ఆధ్యాత్మికంగా ఉపదేశాలు చేశాడు. అయితే ఈ ఉపదేశాల ద్వారా అప్పటిలోనే ఇప్పటి నిర్వహణలో బోధనాంశాలైన స్వీయ నిర్వహణ (self management), ఆగ్రహ నిర్వహణ (anger management), ఒత్తిడి నిర్వహణ (stress management), సంఘర్షణ నిర్వహణ (friction management), నాయకుని మార్పిడి (change of leadership), ప్రేరణ (motivation), లక్ష్యం నిర్దేశ్యం (goals and objectives) మొదలగు వంటి వాటి గురించి ప్రస్తావించబడింది.

నిజానికి, నేడు అనేక బి-స్కూళ్ళు (నిర్వహణా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు) భగవద్గీత ఆధునిక నిర్వహణలో అలా అవసరం అని, అభివృద్ధి వ్యూహాలకు భగవద్గీత ఒక మార్గదర్శి అని భావిస్తారు. అయితే, మానవ వనరుల నిర్వహణ భౌతిక, బాహ్య ప్రపంచంపై దృష్టి పెట్టగా, పాశ్చాత్య విధానానికి భిన్నంగా, భగవద్గీత ఒక మనిషిలోని అంతర్గత అన్వేషణ పై, స్వీయ అవగాహనపై దృష్టి పెడుతుంది.

మానవ వనరుల నిర్వహణ అంటే ఏమిటి?

[మార్చు]

మైఖేల్ ఆర్మ్స్ట్రాంగ్, తను రచించిన మానవ వనరుల నిర్వహణ ఆచరణ (human resources management practice) అనే ఒక పుస్తకంలో, మానవ వనరుల నిర్వహణను "వ్యక్తిగతంగా, సమిష్టిగా ఒక సంస్థ యొక్క వ్యాపార లక్ష్యాలను సాధించే, విజయానికి దోహదపడే ఉద్యోగులను, అత్యంత విలువైన ఆస్తులుగా పరిగణించి వారిని నిర్వహించటంలో అవలంబించే వ్యూహాత్మక, పొందికైన విధానం"గా నిర్వచిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా గల దేశాలలో భారతదేశం ఒకటి కావటం, దేశవ్యాప్తంగా పెరుగుతోన్న అక్షరాస్యతా శాతం వలన అర్హత గల మానవ వనరుల సంఖ్య దేశంలో పెరగటం, గ్లోబలీకరణ, సరళీకరణల వలన 1995 తర్వాత బహుళ జాతీయ సంస్థలు దేశంలో వ్యాపారం చేయటానికి ముందుకు రావటం, ఇక్కడ తగినన్ని మానవ వనరులు లభ్యమవటం వలన దేశంలో మానవ వనరుల నిర్వహణ యొక్క ప్రాముఖ్యత రానురాను విస్తరిస్తోన్నది.

భారతదేశంలో మారుతున్న మానవ వనరుల నిర్వహణ

[మార్చు]

భారతదేశంలో మానవ వనరుల నిర్వహణ యొక్క దృక్పథము గత రెండు దశాబ్దలలో కీలక మార్పులకు లోనయినది. 1991లో జరిగిన ఆర్థిక సరళీకరణ అత్యంత పోటీ వాతావరణాన్ని సృష్టించింది. దీనితో అంతర్జాతీయ సంస్థలు వారి వారి వినూత్న, శక్తివంతమైన పోటీతత్వంతో భారత విపణులలో ప్రవేశించగా, సాంప్రదాయిక సంస్థలు తమ పురాతన పద్ధతులను సమూలంగా మార్చివేసి, క్రొత్త పంథాలో పయనించటం మొదలుపెట్టాయి. ఈ పోటీతత్వ విపణిలో నిపుణుల కోసం పెరిగిన డిమాండు ఉద్యోగులను సంస్థల వైపు ఎలా ఆకర్షించాలి, వారు తమ సంస్థను వీడి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే వాటి పై దృష్టి సారించాయి. దీనితో సంస్థలలో ఉద్యోగులు ఏం కోరుకొంటారు అనే ప్రశ్న బయలుదేరినది.

ఉద్యోగులు ఏం కోరుకొంటారు?

[మార్చు]

వ్యాపార నిర్వహణలో నైతికపరంగా లక్ష్యాలను సాధించటానికి ఉద్యోగులు అత్యుత్తమమైన

కోరుకొంటారు.

గత కొన్ని సంవత్సరాలుగా, మానవ వనరుల వ్యూహాత్మక ప్రణాళిక కీలకాంశంగా మారినది. ఇది

లలో తేవలసిన మార్పులు చాలా ఉన్నవని తెలుపుతోంది.

మనవ వనరుల నిర్వహణ లో సవాళ్లు

[మార్చు]

మానవ వనరుల నిర్వాహకుల ముందు ప్రాథమికంగా రెండు సవాళ్ళు ఉన్నాయి.

  • యాజమాన్యానికి, ఉద్యోగులకు మధ్య నెలకొనే ఘర్షణలను తగ్గుముఖం పట్టించటం
  • శిక్షణ, అభివృద్ధి ద్వారా నైపుణ్యాలను పెంచటం

భారతీయ సంస్థలు ఉద్యోగుల నైపుణ్యాలు, సామర్థ్యాలు అభివృద్ధిపరచటానికి, వృత్తి సంబంధిత అభివృద్ధిని విస్తరించటానికి వారి బాధ్యతలను గుర్తించటం వంటివి చేస్తున్నాయి.

మహిళా ఉద్యోగుల పట్ల మారుతోన్న దృక్పథం

[మార్చు]

మహిళా ఉద్యోగులపై ఉన్న వివక్ష రూపు మాపటానికి భారతదేశంలో సంస్థలన్నీ సమాన ఉపాధికి కట్టుబడి ఉన్నాయి. మహిళలకు శిక్షణనిచ్చి మరీ నిర్వాహక స్థాయిలో పదవులనిస్తున్నాయి. వివిధ దశలలో మహిళల పరిమితులను గుర్తించి దీర్ఘకాలిక సెలవు, తగు సమయం వరకు ప్రసూతి సెలవు వంటి సదుపాయాలు అన్ని సంస్థలు అందిస్తున్నాయి.

ఉద్యోగులు వ్యవస్థాపకత

[మార్చు]

సంస్థలన్నీ ఉద్యోగులలో అంతర్గత వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తున్నాయి. సంస్థ ప్రచార చర్యలలో ఉద్యోగులను భాగస్వాములు చేస్తోన్నవి. సామాజిక బాధ్యత, చొరవలను తమ ఉద్యోగులలో పెంపొందిస్తోన్నవి. దీనిలో భాగంగా నిరుపేద విద్యార్థులకు/వికాలాంగ విద్యార్థులకు విద్యాభ్యాసం, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అల్పాహార/భోజన సదుపాయాలు వంటివి కలిగించటం చేస్తోన్నవి. పచ్చదనం కోసం, కాలుష్య రహిత నగరాల కోసం పరుగులను నిర్వహించటం వంటివి చేస్తోన్నవి.