బులుసు వెంకట రమణయ్య
Appearance
బులుసు వెంకట రమణయ్య (డిసెంబరు 24, 1907 - మే 25, 1989) జననం విశాఖజిల్లా విజయనగరందగ్గర రామతీర్థంలో. జన్మదినం డిసెంబరు 24, 1907. విజయనగరం సంస్కృత కళాశాలలో చదువుకున్నారు. కాశీ విశ్వ విద్యాలయంలో అలంకారశాస్త్రంలో 1930-32లో పరిశోధన చేసేరు.మద్రాసులో కెల్లెట్ హైస్కూలులో ప్రధానాంధ్ర అధ్యాపకులుగా పని చేసేరు. “రావు” అన్న కలంపేరుతో ప్రసిద్ధపత్రికలలో కథలు ప్రచురించేరు.
పట్టాలు
[మార్చు]- సాహిత్యవిద్యా ప్రవీణ,
- ఉభయభాషాప్రవీణ,
- P.O.L.
రచనలు
[మార్చు]- విజయవిలాసము
- పాండురంగ మాహాత్మ్యము
- శ్రీ కాళహస్తి మాహాత్మ్యము
- సారంగధర
- బాలవ్యాకరణము
- ప్రౌఢ వ్యాకరణాలకు టీకలు
అనువాదములు
[మార్చు]- రసార్ణవ సుధాకరము
- కువలయానందము
నాటకములు
[మార్చు]- అభిషేకము నాటకము
కథలు, నవలలు
[మార్చు]- పంచతంత్రము
- అప్పటి ముచ్చటలు
- చిత్తూరు దుర్గము
- దీపకళికలు
- పదహారు రాత్రులు
- ఇందిరాదేవి
- గజపతిరాజుల తెలుగు సాహిత్య పోషణము (1964)[1]
- గజపతులనాటి గాథలు (1955)[2]
పదహారు రాత్రులు
[మార్చు]పదహారు రాత్రులు వేంకటరమణయ్య రచించిన కథాసంకలనం. ఇందులోని కథలు: చార్వాక - గణపతుల కథ, బాలరాజు కథ, బింబ - ప్రతిబింబముల కథ, సువర్ణమాల కథ, ముగ్గురు రాణుల కథ, కపట సన్యాసి కథ, మనసులేని మనువు కథ, పరకాయ ప్రవేశము కథ, ఎండమావులు నమ్మిన వర్తకుని కథ, ఎర్రపెదవుల రాక్షసి కథ, నాగరాజు పగబట్టిన కథ, పండ్లుతిన్న ఫలితము కథ, యమ - మన్మథుల కథ, కృతాకృతుని కథ, తేనెటీగ - ఎర్రతామర కథ, వలపు - గెలుపు