బేసి సంఖ్యలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్యూసినేయర్ కడ్డీలు: 5 (పసుపు) సమానమైన 2 (ఎరుపు) భాగాలుగా విభజించలేము. కనుక 5 బేసి సంఖ్య. 6 (ముదురు ఆకుపచ్చ) సమానమైన 2 భాగాలుగా విభజించగలం. కనుక 6 బేసి సంఖ్య

2 చే భాగించినపుడు శేషం ఒకటి వచ్చే సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు[1]. ఈ సంఖ్యలను 'O' తో సూచిస్తారు. బేసి సంఖ్యలు ఋణాత్మకంగా కూడా ఉండవచ్చు. ఉదాహరణకు −5, 3, 29, 73.

k ఒక పూర్ణ సంఖ్య అయిన బేసిసంఖ్య n = 2k + 1 (లేదా 2k - 1) రూపంలో ఉంటుంది[2].

బేసి సంఖ్యా సమితిని ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు[3].

బేసి సంఖ్యలు 

దశాంశ మానంలో ఒక సంఖ్య ఒకట్ల స్థానంలో 1,3,5,7,9 ఉంటే అది బేసి సంఖ్య అవుతుంది.

లక్షణాలు

[మార్చు]
  • ఏ రెండు వరుస బేసి సంఖ్యల మొత్తమైనా ఒక సరిసంఖ్య[4].
  • ఏ రెండు వరుస బేస సంఖ్యల భేదమైనా రెండు.
  • ఏ రెండు బేసి సంఖ్యల భేదమైనా ఒక సరిసంఖ్య.
  • రెండు బేసి సంఖ్యల లబ్ధం ఒక బేసి సంఖ్య.
  • ఒక సరిసంఖ్య, ఒక బేసి సంఖ్య ల మొత్తమైనా ఒక బేసి సంఖ్య.
  • ఒక సరి సంఖ్య, ఒక బేసి సంఖ్య ల లబ్ధమైనా ఒక సరిసంఖ్య.
  • 'n' వరుస బేసి సంఖ్యల మొత్తం = n2
  • బేసి సంఖ్య యొక్క సాధారణ రూపం = 2n-1, ఇందులో n అనునది సహజ సంఖ్య.

మూలాలు

[మార్చు]
  1. Bóna, Miklós (2011), A Walk Through Combinatorics: An Introduction to Enumeration and Graph Theory, World Scientific, p. 178, ISBN 9789814335232.
  2. Bassarear, Tom (2010), Mathematics for Elementary School Teachers, Cengage Learning, p. 198, ISBN 9780840054630.
  3. Sidebotham, Thomas H. (2003), The A to Z of Mathematics: A Basic Guide, John Wiley & Sons, p. 181, ISBN 9780471461630.
  4. Vijaya, A.V.; Rodriguez, Dora, Figuring Out Mathematics, Pearson Education India, pp. 20–21, ISBN 9788131703571.

యివి కూడా చూడండి

[మార్చు]