భారజలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారజలం - అణు నిర్మాణం

సాధారణ నీటి అణువులో హైడ్రోజన్ పరమాణువుల స్థానంలో డ్యుటీరియం పరమాణువులను ఉంచితే భారజలం అణువు అవుతుంది. రసాయనికంగా దీనిని డ్యుటీరియం ఆక్సైడ్ అని పిలుస్తారు. సాధారణ నీటిలో ప్రతి 6000 భాగాలలో 1 భాగం భారజలం ఉంటుంది.

భౌతిక ధర్మాలు (సాధారణ జలంతో పోలిక)

[మార్చు]
లక్షణం D2O (భారజలం) H2O (సాధారణ జలం)
ఘనీభవన స్థానం (°C) 3.82 0.0
భాష్పీభవన స్థానం (°C) 101.4 100.0
సాంద్రత (at 20°C, g/mL) 1.1056 0.9982
అత్యధిక సాంద్రత ఉండే ఉష్ణోగ్రత (°C) 11.6 4.0
Viscosity (at 20°C, mPa·s) 1.25 1.005
Surface tension (at 25°C, μJ) 7.193 7.197
Heat of fusion (cal/mol) 1,515 1,436
Heat of vaporisation (cal/mol) 10,864 10,515
pH (at 25°C) 7.41 (sometimes "pD") 7.00

ఉపయోగాలు

[మార్చు]
  • న్యూక్లియర్ రియాక్టర్ లలో భారజలాన్ని సాధారణంగా న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి మితకారి (moderator) గా వాడతారు. యురేనియం పరమాణువుల విచ్ఛిత్తికి తక్కువ వేగంగల న్యూట్రాన్లు అవసరం. న్యూట్రాన్ లను భారజలం ద్వారా పంపి వాటి వేగాన్ని తగ్గిస్తారు.
  • సాధారణంగా భారజలాన్ని రసాయన సమ్మేళనాల చర్యా విధానాలను అధ్యయనం చేయడానికి ట్రేసర్ గా వాడతారు. ఉదా: ఏరోమాటిక్ ఎలక్ట్రోలిక్ ప్రతిక్షేపణ చర్యా విధానాలు, శరీరంలో జరిగే జీవరసాయన చర్యల అధ్యయనం మొదలైనవి.
  • భారజలం వినిమయ చర్యలలో పాల్గొనే లక్షణాన్ని కొన్ని ఫాస్ఫరస్ ఆక్సీ ఆమ్లాల నిర్మాణాలను తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=భారజలం&oldid=3687709" నుండి వెలికితీశారు