Coordinates: 27°31′N 88°32′E / 27.52°N 88.53°E / 27.52; 88.53

మంగన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగన్
మంగన్ is located in Sikkim
మంగన్
మంగన్
సిక్కింలోని ప్రాంతం ఉనికి
మంగన్ is located in India
మంగన్
మంగన్
మంగన్ (India)
Coordinates: 27°31′N 88°32′E / 27.52°N 88.53°E / 27.52; 88.53
దేశం భారతదేశం
రాష్ట్రంసిక్కిం
జిల్లాఉత్తర సిక్కిం
Government
 • Typeనగర పంచాయితీ
Elevation
956 మీ (3,136 అ.)
Population
 (2011)
 • Total4,644
భాషలు
 • అధికారికనేపాలీ, నేపాలీ, భూటియా, లెప్చా, లింబు, నెవారి, రాయ్, గురుంగ్, మంగర్, షెర్పా, తమంగ్, సున్వర్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎస్ కె-03

మంగన్, సిక్కిం రాష్ట్రంలోని ఉత్తర సిక్కిం జిల్లా ముఖ్య పట్టణం. సిక్కిం రాజధాని గాంగ్‌టక్ నగరానికి 65 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం రహదారి మార్గం ద్వారా కలుపబడి ఉంది. విస్తీర్ణం ప్రకారం సిక్కిం రాష్ట్రంలో ఇది అతిపెద్ద జిల్లా. జిల్లాగా మారిన తరువాత, సేంద్రీయ వ్యవసాయం కారణంగా మంగన్ పట్టణం ఆర్ధికవ్యవస్థలో పురోగతి సాధించింది. ఈ పట్టణం ఉత్తరాన ఉన్న లాచుంగ్, చుంగ్తాంగ్, లాచెన్ పట్టణాలకు కూడా సేవలు అందిస్తోంది. ఎత్తులో ఉన్న ఈ పట్టణం సమశీతోష్ణ వాతావరణాన్ని కలిగి ఉంటుంది.

భౌగోళికం[మార్చు]

మంగన్ పట్టణం 27°31′N 88°32′E / 27.52°N 88.53°E / 27.52; 88.53 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1] సముద్రమట్టానికి 956 మీటర్ల (3,136 అడుగుల) ఎత్తులో ఉంది.

జనాభా[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] మంగన్ పట్టణంలో 4,644 జనాభా ఉంది. ఈ జనాభాలో 55% మంది పురుషులు, 45% మంది స్త్రీలు ఉన్నారు. మంగన్ సగటు అక్షరాస్యత రేటు 83.81% కాగా, రాష్ట్ర సగటు 81.42% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 87.80% కాగా, స్త్రీ అక్షరాస్యత 79.34% గా ఉంది.

పర్యాటక వివరాలు[మార్చు]

ఇక్కడ అనేక సాంస్కృతిక ఆకర్షణలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వాటిల్లో లాబ్రాంగ్ మొనాస్టరీ, ఫోడాంగ్ గొంప, రోంగ్ లుంగ్టెన్ లీ మ్యూజియం ముఖ్యమైనవి. దట్టమైన అడవి మధ్యలో జొంగ్ మౌంట్ ప్రాంతం ఉంటుంది. ప్రతిఏటా డిసెంబరు నెలలో మూడు రోజులపాటు సంగీత ఉత్సవం నిర్వహించబడుతోంది. సిక్కింలోనే పేరొందిన సంగీత బృందాలు వచ్చి ఇక్కడి వేదికపై ప్రదర్శన ఇస్తాయి. ఈ వేడుకలో స్థానిక హస్తకళల ప్రదర్శన, ఫుడ్ ఫెస్టివల్, సాంప్రదాయ సాంస్కృతిక సంగీతం, నృత్య ప్రదర్శన వంటి కార్యక్రమాలు ఉంటాయి.[3]

పర్యాటక ప్రాంతాలు[మార్చు]

  1. సింగిక్
  2. లాబ్రాంగ్ మొనాస్టరీ
  3. సిరిజోంగా యుమా మంగీమ్
  4. రోంగ్ లుంగ్టెన్ లీ

ఇతర వివరాలు[మార్చు]

దీనిని భారతదేశం యొక్క ఏలకులు రాజధాని అని కూడా పిలుస్తారు.[4]

మూలాలు[మార్చు]

  1. Falling Rain Genomics, Inc - Mangan
  2. "Census of India 2011: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2020-12-25.
  3. "Mangan Tourism & Travel Guide | Mangan Tours & Holidays, Sikkim". www.tourmyindia.com. Retrieved 2020-12-25.
  4. "Web Portal of Sikkim Tourism Development Corporation". www.sikkimstdc.com. Retrieved 2020-12-25.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మంగన్&oldid=3952212" నుండి వెలికితీశారు