Coordinates: 27°10′N 88°21′E / 27.17°N 88.35°E / 27.17; 88.35

నాంచి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాంచి
పట్టణం
నాంచి మొనాస్టరీ
నాంచి మొనాస్టరీ
నాంచి is located in Sikkim
నాంచి
నాంచి
సిక్కింలోని ప్రాంతం ఉనికి
నాంచి is located in India
నాంచి
నాంచి
నాంచి (India)
Coordinates: 27°10′N 88°21′E / 27.17°N 88.35°E / 27.17; 88.35
దేశం భారతదేశం
రాష్ట్రంసిక్కిం
జిల్లాదక్షిణ సిక్కిం
Government
 • Typeనగర పంచాయితీ
Elevation
1,315 మీ (4,314 అ.)
Population
 (2001)
 • Total12,194
భాషలు
 • అధికారికనేపాలీ, నేపాలీ, భూటియా, లెప్చా, లింబు, నెవారి, రాయ్, గురుంగ్, మంగర్, షెర్పా, తమంగ్, సున్వర్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
737 126
టెలిఫోన్ కోడ్03595
Vehicle registrationఎస్ కె-05

నాంచి, సిక్కిం రాష్ట్రంలోని దక్షిణ సిక్కిం జిల్లా ముఖ్య పట్టణం.[1]

భౌగోళికం

[మార్చు]

నాంచి పట్టణం 27°10′N 88°21′E / 27.17°N 88.35°E / 27.17; 88.35 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[2] సముద్రమట్టానికి 1,315 మీ.ల (4,314 అ.) ఎత్తులో ఉంది.

ఈ పట్టణం రాష్ట్ర రాజధాని గాంగ్‌టాక్ నుండి 78 కి.మీ. (48 మై.) దూరంలో, సిలిగురి పట్టణం నుండి 100 కి.మీ. (62 మై.) దూరంలో ఉంది.[1] ఈ పట్టణం పశ్చిమ బెంగాల్ లోని ఇతర పట్టణాలకు కలుపబడి ఉంది. నాంచి నుండి గాంగ్‌టాక్, పెల్లింగ్, జోరేతాంగ్, కాలింపాంగ్, సిలిగురి పట్టణాల మధ్య జీపులు, బస్సులు ద్వారా రవాణా సౌకర్యం ఉంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[3] ఈ పట్టణంలో 12,194 జనాభా ఉంది. ఈ జనాభాలో 52% మంది పురుషులు, 48% మంది స్త్రీలు ఉన్నారు. నాంచి సగటు అక్షరాస్యత రేటు 78% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 81% కాగా, స్త్రీ అక్షరాస్యత 73% గా ఉంది. మొత్తం జనాభాలో 9% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.

నాంచి ప్రజలలో ఎక్కువమంది హిందువులు, బౌద్ధులు ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా నేపాలీ భాష మాట్లాడుతారు.

పర్యాటకం

[మార్చు]

నాంచి పట్టణం పర్యాటక ప్రదేశంగా, తీర్థయాత్ర కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. నాంచి మొనాస్టరీ, రాలాంగ్ మొనాస్టరీ, టెండాంగ్ హిల్ మొదలైనవి స్థానికంగా ఉన్న బౌద్ధ తీర్థయాత్ర కేంద్రాలు. నాంచికి ఎదురుగా ఉన్న సామ్‌డ్రప్ట్ కొండపై (ది విష్ ఫల్ఫిల్లింగ్ హిల్) సిక్కిం సెయింట్ గురు రిన్‌పోచే అని పిలువబడే బౌద్ధ పద్మసంభవుడి అతిపెద్ద విగ్రహం (118 అడుగుల వద్ద) ఉంది. దీని నిర్మాణం 2004, ఫిబ్రవరిలో పూర్తయింది. సామ్‌డ్రప్ట్ కొండను అగ్నిపర్వతం అని కూడా అంటారు. బౌద్ధ సన్యాసులు ఆ కొండపైకి వెళ్లి అగ్నిపర్వతం ప్రశాంతంగా ఉండటానికి ప్రార్థనలు చేస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. సామ్‌డ్రప్ట్‌కు వెళ్ళే మార్గంలో పట్టణం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో రాక్ గార్డెన్ కూడా ఉంది.

2011, నవంబరులో ప్రారంభించిన సిద్ధేశ్వర ధామం అనేది సిక్కిం ప్రభుత్వ తీర్థయాత్ర-పర్యాటక సంస్థ "పిల్గ్రిమ్ కమ్ కల్చరల్ సెంటర్" గా అభివృద్ధి చేయబడింది. ఇక్కడ 87 అడుగుల శివుడి విగ్రహం ఉంది. నాంచిలోని సోలోఫోక్ కొండపై ఉన్న ఈ ధామంలో భక్తులకు, పర్యాటకులకు ఆకర్షించే విధంగా ఈ అద్భుత సముదాయంలో హిందువులు అత్యంత భక్తి కనబరిచే చార్‌ ధామ్‌ ఏర్పాటు చేయబడ్డాయి. ధామం పవిత్రత కోసం శ్రీ జగద్గురు శంకర్యాచార్య, స్వామి స్వరూపానంద సరస్వతి, ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్, అతని భార్య టికా మాయ చామ్లింగ్ సమక్షంలో ధామం "ప్రాణ ప్రతిష్ఠ" జరిగింది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "South Skikkim". National Informatics Centre. Archived from the original on 21 సెప్టెంబరు 2019. Retrieved 25 December 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "NIC" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. Falling Rain Genomics, Inc - Namchi
  3. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 25 December 2020.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నాంచి&oldid=3952234" నుండి వెలికితీశారు