మధుర తంజావూరు నాయక రాజులనాటి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర
మధుర, తంజావూరు నాయక రాజులు తమిళనాడులోని మధురై, తంజావూరు ప్రాంతాలను పరిపాలించిన సమకాలిక రాజులు. విజయనగర సామ్రాజ్య పతనం అనంతరం తెలుగు సాహిత్యాన్ని పోషించి, తెలుగు సాహిత్యంలో తమకంటూ స్థానం సంపాదించుకున్నవారు ఈ నాయక రాజులు. కానీ వస్తువు విషయంలో విలువలను విడిచిపెట్టి పచ్చి శృంగార వర్ణనలను చేశారన్న కారణంతో బ్రిటీష్-ఇండియా పాలన కాలం నాటి పలువురు సాహిత్యవేత్తలు ఈ యుగాన్ని క్షీణ యుగమని వ్యవహరించారు. ఈ అభిప్రాయం వలసవాద ప్రభావితులైన వారి ధోరణి వల్ల వ్యాపించిందని నేటి సాహిత్య విమర్శల్లో ఇప్పటి పండితులు అబిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మధుర, తంజావూరు నాయక రాజుల యుగంలోని సాహిత్యం తెలుగు సాహిత్య చరిత్రలో చెదరని స్థానం కల్పించుకుంది. ఈ యుగానికి చెందిన ప్రముఖ కవుల్లో త్యాగరాజు, కంకంటి పాపరాజు, కనుపర్తి అబ్బయామాత్యుడు, కూచిమంచి తిమ్మకవి, కూచిమంచి జగ్గకవి, వక్కలంక వీరభద్రకని, అడిదము సూరకవి, ధరణిదేవుల రామయమంత్రి, దిట్టకవి నారాయణకవి, చిత్రకవి సింగనార్యుడు, కృష్ణదాసు, వేమనారాధ్యుల సంగమేశ్వరకవి, అయ్యలరాజు నారాయణకవి తదితరులు ఉన్నారు. త్యాగరాజు కీర్తనలు, ఉత్తర రామాయణము మొదలైనవి ఆనాటి ప్రముఖ కృతులు.
తెలుగువారి చరిత్ర పరిశోధనలో సాలప్రాంశువుల్లో ఒకరైన నేలటూరి వెంకటరమణయ్య ఆ యుగంలోని తెలుగు వాఙ్మయ చరిత్రను రచించారు. ఈ గ్రంథాన్ని ఆంధ్రుల చరిత్రలో కొన్ని మరుగుపడిన అధ్యాయాలు వెలికితెచ్చి శతాబ్దాల కాలం చరిత్రలను సుసంపన్నం చేసిన మల్లంపల్లి సోమశేఖర శర్మకు అంకితమిచ్చారు. దీనిని హైదరాబాదులో అ. పంపమ్మ ప్రచురించారు.
విషయసూచిక
[మార్చు]- దక్షిణాత్యాంధ్ర సాహిత్యము
- ప్రకరణము 1 : నాయక రాజ్యోత్పత్తి
- ప్రకరణము 2 : సారస్వత పీఠములు
- ప్రకరణము 3 : నాయకయుగాంధ్ర సాహిత్యము - గుణవిశేషములు
- ప్రకరణము 4 : కావ్యము
- ప్రకరణము 5 : యక్షగానము
- ప్రకరణము 6 : గీతము