త్యాగరాజు కీర్తనలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Tyagaraja.jpg
శ్రీత్యాగరాజస్వామి

త్యాగయ్య, త్యాగ బ్రహ్మ, త్యాగ రాజుగా ప్రసిద్ధి కెక్కిన ఈయన ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి లతో పాటు కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులలో ఒకరు. 16 వ శతాబ్దాంతమున విజయ నగర సామ్రాజ్య పతనానంతరం జన జీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పుల వలన ఎంతో మంది తెలుగు వాళ్ళు తమిళనాడుకు వలస పోయారు, ఆ విధంగా వలస పోయిన కుటుంబాలకు చెందిన వాడే త్యాగయ్య కూడా. ప్రకాశం జిల్లాకు చెందిన కాకర్ల గ్రామమునకు చెందినవాడని చెప్పుకున్నాడు త్యాగయ్య. 1767లో కాకర్ల రామబ్రహ్మం,సీతమ్మలకు తిరువారూర్ గ్రామంలో జన్మించాడు త్యాగయ్య. తరువాత కావేరీ నదీ తీరాన ఉన్న తిరువయ్యారుకు మారాడు కాకర్ల రామబ్రహ్మం. ఇప్పటికీ తిరువయ్యారు లోత్యాగరాజ వంశస్థులు ఆయన ఇంటిని పరిరక్షిస్తూనే ఉన్నారు.

ఈయన పంచరత్న కీర్తనలు, సంగీతం మీద త్యాగయ్య పట్టును వెల్లడిచేస్తాయి. వీటితో పాటు ఈయన ఎన్నో ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్య నామ సంకీర్తనలు కూర్చాడు.

కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడయిన త్యాగరాజులవారి కీర్తనలు

పంచరత్న కీర్తనలు

[మార్చు]

త్యాగరాజ స్వామి వారి కీర్తనలలో ఉత్తమమైనవిగా విద్వాంసుల చేత నిర్ణయించబడినవి పంచరత్న కీర్తనలు[1]: అవి.

కీర్తనలు

[మార్చు]

మచ్చుకు ఈ కీర్తనను చూడండి:

బిళహరి రాగము - ఆది తాళము

దొరకునా ఇటువంటి సేవ ॥దొరకునా॥ దొరకునా తప మొనరించిన భూ సురవరులకైన సురలకైన ॥దొరకునా॥

తుంబుర నారదులు సుగుణకీర్త

నంబుల నాలాపము సేయగా

అంబరీష ముఖ్యులు నామము సే

యగ జాజులపై చల్లగా

బింబాధరులగు సురవారయళి

వేణులు నాట్యములాడగా

అంబుజభవ పాకారు లిరుగడల

నన్వయ బిరుదావళిని బొగడగా

అంబరవాస సతులు కరకంక

ణంబులు ఘల్లని విసరగ మణిహా

రంబులు ఘల్లని విసరగ మణిహా

రంబులు గదలగ సూచే ఫణి త

ల్పంబున నెలకొన్న హరిని గనుగొన ॥దొరకునా॥

మరకతమణిసన్నిభ దేహంబున

మెఱుగు గనకచేలము శోభిల్ల

చరణయుగ నభావళికాంతులు

జందురు పిల్లలను గేర

వరనూపురము వెలుగంగ గతయుగమున

వజ్రపు భూషణములు మెఱయ

ఉరమున ముక్తాహారములు మఱియు

ఉచితమైన మకరకుండలంబులు

చిఱునవ్వులుగల వదనంబున ముం

గురు లద్దంపుగపోలము ముద్దు

గురియు దివ్యఫాలంబున దిలకము

మెఱసే భువిలావణ్యనిధిని గన

తామసగుణరహిత మునులకు బొగడ

దరముగాకనే భమసి నిల్వగ

శ్రీమత్కనకపు దొట్లపైని చెలు

వందగ గొలువుండగ

కామితఫలదాయకియౌ సీత

కాంతునిగని యుప్పొంగగ

రామబ్రహ్మ తనయుడౌ త్యాగ

రాజు తా బాడుచు నూచగ

రాముని జగదుద్ధారుని సురరిపు

భీముని త్రిగుణాతీతుని బూర్ణ

కాముని చిన్మయరూపుని సద్గుణ

ధాముని కనులార మదిని కనుగొన ॥దొరకునా॥

నగుమోము కనవా!

[మార్చు]

పల్లవి:నగుమోము గలవాని నామనోహరుని
జగమేలు శూరుని జానకీ వరుని

చరణం1:దేవాదిదేవుని దివ్యసుందరుని
శ్రీవాసుదేవుని సీతా రాఘవుని

చరణం2:నిర్మాలాకారుని నిఖిల లోచనుని
ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని

చరణం3:సుజ్ఞాన నిధిని సోమసూర్యలోచనుని
అజ్ఞాన తమమును అణచు భాస్కరుని

చరణం4:భోధతో పలుమారు పూజించి నేను
ఆరాధింతు శ్రీత్యాగరాజా సన్నుతుని

కోదండ రామ

[మార్చు]

రామ కోదండ రామ
రామ కల్యాణ రామ
రామ పట్టాభి రామ
రామ పావన రామ

రామ సీతాపతి
రామ నేవేగతి
రామ నీకుమ్రొక్కితి
రామ నీచేజిక్కితి

రామ నేనందయినను
రామ నిను వేడగలేను
రామ ఎన్నడైనను
రామ బాయగలేను

రామ నీకొక్క మాట
రామ నాకొక్క మూట
రామ నీమాటే మాట
రామ నీపాటే పాట

రామ నామమే మేలు
రామ చింతనే చాలు
రామ నేవు నన్నేలు
రామ రాయడే చాలు

రామ నీకెవ్వరు జోడు
రామ క్రీకంట జూడు
రామ నేను నీవాడు
రామ నాతో మాటాడు

రామాభి రాజ రాజ
రామ ముగజీతరాజ
రామ భక్త సమాజ
రక్షిత త్యాగరాజ

గంధము పూయరుగా...

[మార్చు]

గంధము పూయరుగా
పన్నీరు గంధము పూయరుగా
అందమైన యదునందుని పైని
కుందరదనవర వందగ పరిమళ "గంధము"

తిలకము దిద్దరుగా
కస్తూరి తిలకము దిద్దరుగా
కళకళమని ముఖకళగని సొక్కుచు
పలుకుల నమృతము నొలెకిడి స్వామికి "తిలకము"

చేలము గట్టరుగా
బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాల బాలులతో
నాల మేపిన విశాల నయనునికి "చేలము"

ఆరతులెత్తరుగా
ముత్యాల ఆరతులెత్తరుగా
నారీమణులకు వారము యవ్వన
వారక యొసగెడి వారిజాక్షునికి "హారతులు"

పూజలు చేయరుగా
మనసారా పూజలు చేయరుగా
జాజులు మరివిర జాజుల దవనము
రాజిత త్యాగరాజ వినుతునికి "పూజలు"

"గంధము" "తిలకము" "చేలము" "హారతులు" పూజలు"

కొన్ని కీర్తనలు, రాగాలు

[మార్చు]
  1. ఆ దయ శ్రీ - ఆహిరి
  2. ఆడమోడి గలదే - చారుకేషి
  3. ఆడవారమెల్ల గూడి - యదుకుల కాంభోజి
  4. ఆనంద సాగర - గరుడధ్వని
  5. ఆనందమానందమాయెను - భైరవి
  6. ఆరగింపవే - తోడి
  7. అభీష్హ్ట వరద - హంసద్వని
  8. అభిమానమెన్నడు గల్గుర - వివర్ధని, కుంజరి
  9. అభిమానము లేదిమి - అంధలి
  10. అది కాదు భజన - యదుకుల కాంభోజి
  11. అడిగి సుఖము - మద్యమావతి
  12. అడుగు వరముల - ఆరబి
  13. అలకలల్ల - మద్యమావతి
  14. అల్లకల్లోల - సౌరాష్ట్రం
  15. అంబ నిన్ను నమ్మితి - ఆరబి
  16. అమ్మ ధర్మ సంవర్ధని - అఠాణా
  17. అమ్మ రావమ్మ - కల్యాణి
  18. అనాతుడను గాను - జింగల
  19. అందుణ్డక నే వేగ - కామవర్ధని
  20. అనుపమ గుణాంబుధి - అఠాణా
  21. అనురాగములే - స్వరస్వతి
  22. అన్యాయము సేయకుర - కాపి
  23. అపరాధముల నోర్వ - రసాళి
  24. అపరాధములమాంపి - దర్బార్
  25. అప్ప రామ భక్తి - కామవర్ధని
  26. అతడే ధన్యుదురా - కాపి
  27. అట్ట బలుకుదు - అఠాణా
  28. అటు కారాదని - మనోరంజని
  29. బాగాయనయ్య - చంద్రజ్యోతి
  30. బాల కనకమయ - అఠాణా
  31. బాలె బాలేందు - రీతి గౌళ
  32. బడలిక దీర - రీతి గౌళ
  33. బలము కులము - సావేరి
  34. బంటు రీతి కోలు - హంసనాదం
  35. భజ రామం సతతం - హుసేని
  36. భజ రే రఘువీరం - కల్యాణి
  37. భజన పరుల - షురుట్టి
  38. భజన సేయ రాదా - అఠాణా
  39. భజన సేయవే - కల్యాణి
  40. భజన సేయు మర్గమును - నారాయణి
  41. భజరే భజ మానస - కన్నడ
  42. భక్తి బిచ్చమియ్యవే - శంకరాభరణం
  43. భక్తుని చారిత్రము - బేగడ
  44. భవనుత న - మోహనం
  45. భవసన్నుత - వరాళి
  46. భువిని దాసుడనే - శ్రీ రంజని
  47. బ్రిందావన లోల - తోడి
  48. బ్రోచేవారెవరే - శ్రీ రంజని
  49. బ్రోవ భారమా - బహుదారి
  50. బుద్ధి రాదు - శంకరాభరణం
  51. చాల కల్లలాడు - ఆరబి
  52. చాలు చాలు - సావేరి
  53. చక్కని రాజ - ఖరహరప్రియా
  54. చలమేలరా - మార్గహిందోళం
  55. చల్లగ నాతో - వేగవాహిని
  56. చల్లరే రామచంద్రు - ఆహిరి
  57. చని తోడి తేవే - హరికాంభోజి
  58. చేడే బుద్ధి మానురా - అఠాణా
  59. చెలిమిని జలజాక్ష్హు - యదుకుల కాంభోజి
  60. చెంతనే సదా - కుంతల వరాళి
  61. చేర రావదేమిరా - రీతి గౌళ
  62. చేసినదెల్ల - తోడి
  63. చేతులార ష్రంగారము - ఖరహరప్రియా
  64. చిన్న నాడే - కలానిధి
  65. చింతిస్తున్నాడే - ముఖారి
  66. చూడరే చెలులార - కామవర్ధని
  67. చూతము రారే - ఆరబి
  68. దాచుకో వలెనా - తోడి
  69. దాసరథే - కోకిలప్రియా
  70. దాషరథీ - తోడి
  71. దణ్డము బెట్టేదనురా - బాలహంస
  72. దరిదాపులేక వేడితే - సావేరి
  73. దరిని తెలుసుకొంటి - సుద్ద సావేరి
  74. దర్షనము సేయ - నారాయణ గౌళ
  75. దషరథ నందన - అసావేరి, సావేరి
  76. దయ జూచుట కిది - గనవరిధి
  77. దయ సేయవయ్యా - యదుకుల కాంభోజి
  78. దయలేని బ్రతుకేమి - నాయకి
  79. దయరానీ దయరానీ - మోహనం
  80. దీన జనావన - బౌళి
  81. దేహి తవ - సహానా
  82. దేవ రామ రామ - సౌరాష్ట్రం
  83. దేవ శ్రీ తపస్తీర్థపుర - మద్యమావతి
  84. దేవాది దేవ - సిందు రామక్రియా
  85. దేవీ శ్రీ తులసమ్మ - మాయమాళవ గౌళ
  86. ధరనునూ సరి - వరాళి
  87. ధర్మాత్మ నన్నిపుడు - కేదార గౌళ
  88. ధ్యానమే వరమైన - ధన్యాసి
  89. దినమణి వమ్ష - హరికాంభోజి
  90. దొరకునా అని - తోడి
  91. దొరకునా ఇటువంటి సేవ - బిలహరి
  92. దుడుకుగల నన్నేదొర - గౌళ
  93. దుర్మార్గచరా - రంజని
  94. ద్వైతము సుఖమా - రీతి గౌళ
  95. ఏ నోము నోచితిమో - పున్నాగవరాళి
  96. ఏ పాపము - అఠాణా
  97. ఏ పనికో - అసావేరి
  98. ఏ రాముని - వకులాభరణం
  99. ఏ తావునరా - కల్యాణి
  100. ఏ వరమడుగుదురా - కల్యాణి
  101. ఏదారి సంచరింతురా - కాంతామణి
  102. ఏది నీ బాహు - దర్బార్, కాపి
  103. ఎదుట నిలిచితే - శంకరాభరణం
  104. ఏహి త్రిజగదీష - సారంగ, శంకరాభరణం
  105. ఏల తెలియలేరో - దర్బార్
  106. ఏలావతారం - ముఖారి
  107. ఏలరా శ్రీ - కాంభోజి
  108. ఏమానతిచ్చేదివో - సహానా
  109. ఏమందునే విచిత్రమును - శ్రీమణి
  110. ఏమని మాటాడితివో - తోడి
  111. ఏమని నెరనమ్ము - సౌరాష్ట్రం
  112. ఏమని పొగడుదురా - వరుణప్రియా
  113. ఏమని వేగింతునే - హుసేని
  114. ఏమేమో తెలియక - సౌరాష్ట్రం
  115. ఏమి దోవ బల్కుమా - సారంగ
  116. ఏమి జేసితే - తోడి
  117. ఏమి నేరము - శంకరాభరణం
  118. ఏనాటి నోము ఫలము - భైరవి
  119. ఎందరొ మహానుభవులు - శ్రీ
  120. ఎందు బాయరా - ధన్యాసి
  121. ఎందు దాగినాడో - తోడి
  122. ఎందు కౌగలింతురా - సుద్ద దేసి
  123. ఎందుకీ చలము - శంకరాభరణం
  124. ఎందుకో బాగా తెలియదు - మోహనం
  125. ఎందుకో నీ మనసు - కల్యాణి
  126. ఎందుకు దయరాదురా - తోడి
  127. ఎందుకు నిర్దయ ఎవరున్నారురా - హరికాంభోజి
  128. ఎందుకు పెద్దల - శంకరాభరణం
  129. ఎందుణ్డి వెడలితివో - దర్బార్
  130. ఎన్నాళ్ళునూ త్రోవ - కాపి
  131. ఎన్నాళ్ళు ఊరకే - షుభపంతువరాళి
  132. ఎన్నాళ్ళు తిరిగేది - మాళవశ్రీ
  133. ఎన్నడో రక్ష్హించితే - సౌరాష్ట్రం
  134. ఎన్నడు జూతునో - కలావతి
  135. ఎన్నగ మనసుకు - నీలాంబరి
  136. ఎంత భాగ్యము - సారంగ
  137. ఎంత నేర్చ్చిన - ఉధయ రవి చంద్రికా
  138. ఎంత పాపినైతి - గౌళిపంతు
  139. ఎంత రాని - హరికాంభోజి
  140. ఎంత వేడుకొందు - సరస్వతి మనోహరి
  141. ఎంతముద్దో ఎంత - బిందుమాలిని
  142. ఎంతని నే - ముఖారి
  143. ఎంతనుచు సైరింతును - యదుకుల కాంభోజి
  144. ఎంతనుచు వర్నింతునే - సౌరాష్ట్రం
  145. ఏతావున నేర్చితివో - యదుకుల కాంభోజి
  146. ఏటి జన్మమిది - వరాళి
  147. ఎటి యోచనలు - కీరణావళి
  148. ఎట్లా దొరకితివో - వసంతా
  149. ఎట్లా కనుగొందునో - ఘంట
  150. ఎటుల బ్రోతువో - చక్రవాకం
  151. ఎటుల గాపాడుదువో - ఆహిరి
  152. ఎటులైన భక్తి - ష్యామా
  153. ఎవరైన లేరా - సిద్ధసేన
  154. ఎవరని - దేవామ్రుతవర్షిని
  155. ఎవరిచ్చిరిరా - మద్యమావతి
  156. ఎవరికై అవతారం - దేవ మనోహరి
  157. ఎవరిమాట - కాంభోజి
  158. ఎవరితో నే - మానవతి
  159. ఎవరూరా నిన్ను వినా - మోహనం
  160. ఎవరు మనకు - దేవగాంధారి
  161. ఎవరు తెలియక - తోడి
  162. ఎవరు తెలియను - పున్నాగవరాళి
  163. ఎవరున్నారు - మాళవశ్రీ
  164. ఏవిధములనైన - శంకరాభరణం, కల్యాణి
  165. ఎవ్వరే రామయ్య - గంగయభూష్హని
  166. గానమూర్తే - గానమూర్తి
  167. గారవింప రాదా - ఘంట
  168. గంధము పుయ్యరుగా - పున్నాగవరాళి
  169. గరుడ గమన వాసుదేవ - గౌరి మనోహరి
  170. గత మోహా - శంకరాభరణం
  171. గతి నీవని - తోడి
  172. గట్టిగాను నను - బేగడ
  173. గీతార్థము - షురుట్టి
  174. ఘుమ ఘుమ ఘుమయని - సౌరాష్ట్రం
  175. గిరిపై నెలకొన్న - సహానా
  176. గిరిరాజ సుతా - బంగాళ
  177. గ్రహ బలం - రేవగుప్తి
  178. గురులేక ఎటువణ్టి - గౌరి మనోహరి
  179. హరి హరియనుకోవే - కామవర్ధని
  180. హరిదాసులు వెడలు - యమునా కల్యాణి
  181. హరియను వాని - తోడి
  182. హెచెరికగా - యదుకుల కాంభోజి
  183. ఇదే భాగ్యము - కన్నడ
  184. ఇది నీకు మెరగాదురా - పున్నాగవరాళి
  185. ఇది సమయమురా - చాయనాట్టై
  186. ఇక కావలసినదేమి - బాలహంస
  187. ఇలలో ప్రణతార్తి - అఠాణా
  188. ఈ మేను గల్గినందుకు - వరాళి
  189. ఇందుకా ఈ తనువును - పున్నాగవరాళి
  190. ఇందుకా పుట్టించితివి - భైరవి
  191. ఇందుకేమి సేతు - వరాళి
  192. ఇంక యోచన - ఘంట
  193. ఇంకా దయ రాకుణ్టే - నారాయణ గౌళ
  194. ఇన్నాళ్ళవలె - దేష్యతోడి, తోడి
  195. ఇన్నాళ్ళు - నారాయణ గౌళ
  196. ఇన్నాళ్ళు నన్నేల్లి - ఘంట
  197. ఇంత భాగ్యమని - పున్నాగవరాళి
  198. ఇంత సౌఖ్యమని నే - కాపి
  199. ఇంతకన్న దెల్ప - సావేరి
  200. ఇంతకన్నానందం - బిలహరి
  201. ఇంతనుచు వర్ణింప - గుండక్రియా
  202. ఇంతనుచు వర్ణింప - సావేరి
  203. ఇపుడైన నన్ను - ఆరబి
  204. ఈష పాహిమాం - కల్యాణి
  205. ఇతర దైవముల - చాయతారంగిని
  206. ఈవరకు జూచినది - శంకరాభరణం
  207. ఈ వసుధ - సహానా
  208. జానకీ నాయక - ధన్యాసి
  209. జానకీ రమణా - సుద్ద సీమంతిని
  210. జగదానంద కారకా - నాట్టై
  211. జనకజా సమేత - అసావేరి
  212. జయ జయ శ్రీ రఘురామా - గౌరి
  213. జయమంగళం నిత్య షుభమంగళం - ఘంట
  214. జయమంగళం నిత్య షుభమంగళం - మోహనం
  215. జయమంగళం నిత్య షుభమంగళం - నాథనామక్రియా
  216. జే జే సీతారాం - సావేరి
  217. జ్ఞాన మొసగ - పూర్వి కల్యాణి, ష్హద్విదమార్గిని
  218. జో జో రామ - రీతి గౌళ
  219. కాలహరణ - సుద్ద సావేరి
  220. కారు వేల్పులు - కల్యాణి
  221. కారుబారు సేయువారు - ముఖారి
  222. కాసిచ్చెదే - గౌళిపంతు
  223. కదలే వాడు గాదే - నారాయణ గౌళ
  224. కడతేర రాదా - తోడి
  225. కద్దనువారికి - తోడి
  226. కళల నేర్చిన - దీపకం
  227. కలషవార్ధిజాం - రత్నాంగి
  228. కలిగియుణ్టేగదా - కీరవాణి
  229. కలినరులకు - కుంతల వరాళి
  230. కలుగునా పద - పూర్నలలితా
  231. కమల భవుడు - కల్యాణి
  232. కమలాప్త కుల - బ్రిందావన సారంగ
  233. కనక న రుచిర - వరాళి
  234. కన్న తల్లి నీవు - సావేరి
  235. కన్న తణ్డ్రి నాపై - దేవ మనోహరి
  236. కణ్ట జూడుమి - లతాంగి, వాచస్పతి
  237. కణ్టకులను - సావేరి
  238. కనుగొణ్టిని - బిలహరి
  239. కనుగొను సౌఖ్యము - నాయకి
  240. కనులు తాకని - కల్యాణ వసంతం
  241. కర్మమే బలవంత - సావేరి
  242. కరుణ ఏలాగణ్టే - వరాళి
  243. కరుణ జూడవమ్మ - తోడి
  244. కరుణ జూడవయ్య - సారంగ
  245. కరుణా జలదే - నాథనామక్రియా
  246. కరుణా జలధీ - కేదార గౌళ
  247. కరుణా సముద్ర - దేవగాంధారి
  248. కట్టు జేసినావు - అఠాణా
  249. కొలువైయున్నాడే - భైరవి
  250. కొలువైయున్నాడే - దేవగాంధారి
  251. కొలువమరె గద - తోడి
  252. కొనియాడేడు - కోకిలధ్వని
  253. కోరి సేవింపరారే - ఖరహరప్రియా
  254. కోరి వచ్చితినయ్య - బిలహరి
  255. కోటి నా దలు - తోడి
  256. కృష్ణా మాకేమి - పున్నాగవరాళి
  257. క్ర్ప జూచుటకు - చాయతారంగిని
  258. క్షీణమై తిరుగ - ముఖారి
  259. క్షీరసాగర షయన - దేవగాంధారి
  260. క్షీరసాగర విహార - ఆనంద భైరవి
  261. కుల బిరుదును - దేవ మనోహరి
  262. కువలయదళ - నాట్టై కురింజి
  263. లాలాగాను జూచు - దివ్యామణి, దుందుబి
  264. లాలి లాలయ్య - కేదార గౌళ
  265. లాలి లాలియని - హరికాంభోజి
  266. లాలి యుగవయ్యా - కేదార గౌళ
  267. లాలి యుగవే - నీలాంబరి
  268. లావణ్య రామ - పూర్నషద్జం
  269. లక్షణములు - సుద్ద సావేరి
  270. లలితే శ్రీ - భైరవి
  271. లేకనా నిన్ను - అసావేరి
  272. లేమిదెల్ప పెద్ద - నవనీతం, పావని
  273. లోకవన చతుర - బేగడ
  274. మా జానకి - కాంభోజి
  275. మా కులమున - షురుట్టి
  276. మా రామచంద్రునికి - కేదార గౌళ
  277. మాహిత ప్రవ్ర్ద్ధ - కాంభోజి
  278. మాకేలరా విచారము - రవి చంద్రికా
  279. మామవ రఘురామ - సారంగ
  280. మామవ సతతం - జగన్మోహిని
  281. మానము లేదా - హమీర్ కల్యాణి
  282. మానస సంచరరే రామే - పున్నాగవరాళి
  283. మానవ్యాలగించరా - నళినకాంతి
  284. మాపాల వెలసి ఇక - అసావేరి
  285. మార వైరి రమణి - నాసికభూషని
  286. మార్గము తెలుపవే - కాంభోజి
  287. మారు బల్క - శ్రీ రంజని
  288. మాటాడవేమి నాతో - నీలాంబరి
  289. మాటి మాటికి - మోహనం
  290. మదిలోన యోచనా - కోలాహలం
  291. మహిమ దక్కించుకోవయ్య - రిష్హభప్రియా
  292. మనసా ఎటులోర్తునే - మలయమారుతం
  293. మనసా మన - వర్ధని
  294. మనసా శ్రీ రామచంద్రుని - ఈసమనోహరి
  295. మనసా శ్రీ రాముని - మారరంజని
  296. మనసు నిల్ప - ఆభోగి
  297. మనసు స్వాధీనమైన - శంకరాభరణం
  298. మనసు విష్హయ - నాట్టై కురింజి
  299. మనసులోనిమర్మములు - హిందోళం
  300. మనవిని వినుమా - జయనారాయణి
  301. మరచే వాడన - కేదారం
  302. మరకత మణి - వరాళి
  303. మరవకరా నవ - దేవగాంధారి
  304. మరి మరి నిన్నే - కాంభోజి
  305. మరియాద గాదయ్య - భైరవం
  306. మరియాద గాదురా - శంకరాభరణం
  307. మరుగేలరా - జయంతశ్రీ
  308. మీ వల్ల గుణదోష - కాపి
  309. మేలు మేలు - సౌరాష్ట్రం
  310. మెలుకో దయానిధి - సౌరాష్ట్రం
  311. మెలుకోవయ్య - బౌళి
  312. మేను జూచి - సరసాంగి
  313. మేరు సమాన - మాయమాళవ గౌళ
  314. మిత్రి భాగ్యమే - ఖరహరప్రియా
  315. మోహన రామ - మోహనం
  316. మోక్షము గలద - సారమతి
  317. మోసబోకు వినవే - గౌళిపంతు
  318. మ్ర్దు భాషణ - మరువధన్యాసి
  319. మ్ర్త్యుంజయ క్ర్పాకర - దేవ మనోహరి
  320. ముచ్చట బ్రహ్మాదులకు - మద్యమావతి
  321. ముద్దుమోము ఏలాగు - సూర్యకాంతం
  322. ముమ్మూర్తులు గుమిగూడి - అఠాణా
  323. ముందు వేనుక - దర్బార్
  324. మున్ను రావణ - తోడి
  325. మునుపే తెలియక - బంగాళ
  326. మురిపేము గలిగెగదా - ముఖారి
  327. ముత్యాల చవికెలో - హమీర్ కల్యాణి
  328. నా మొరాలకింప - దేవగాంధారి
  329. నా మొరలను - ఆరబి
  330. నాథతనుమనిషం - చిత్త రంజని
  331. నాడాడిన మాట - జనరంజని
  332. నాథలోలుడై - కల్యాణ వసంతం
  333. నాదసుధా రసంబిలను - ఆరబి
  334. నాదోపాసనచె - బేగడ
  335. నాదుపై బలికేరు - మద్యమావతి
  336. నాజీవధార - బిలహరి
  337. నామ కుసుమములచే - శ్రీ
  338. నారాయణ హరి - యమునా కల్యాణి
  339. నారద గానలోల - అఠాణా
  340. నారద గురుస్వామి - దర్బార్
  341. నారదముని వెడలిన - కామవర్ధని పంతువరాళి
  342. నాథ బ్రోవవే - భైరవి
  343. నాటి మాట - దేవక్రియా
  344. నాయెడ వంచన - నవనీతం
  345. నడచి నడచి - ఖరహరప్రియా
  346. నగుమోము గలవాని - మద్యమావతి
  347. నగుమోము గనలేని - ఆభేరి
  348. నళిన లోచన - మద్యమావతి
  349. నమ్మక నే - అసావేరి
  350. నమ్మి వచ్చిన - కల్యాణి
  351. నమ్మిన వారిని - భైరవి
  352. నమో నమో రాఘవాయ - దేషికతోడి
  353. నన్ను బ్రోవ - ఆభోగి
  354. నన్ను విడిచి - రీతి గౌళ
  355. నన్నుకన్న తల్లి - కేసరి
  356. నను బ్రోవకను - శంకరాభరణం
  357. నను పాలింప - మోహనం
  358. నపాలి శ్రీ రామ - శంకరాభరణం
  359. నరసిమ్హా - బిలహరి
  360. నతజన పరిపాల - సిమ్హేంద్ర మధ్యమం
  361. నవనీత చోర - షెంజురుట్టి
  362. నే మొరబెట్టితే - రూపవతి, తోడి
  363. నే పొగడకుణ్టే - షుభపంతువరాళి, దేష్యతోడి
  364. నీ బలమా - ఆనంద భైరవి
  365. నీ భజన - నాయకి
  366. నీ భక్తి భాగ్య - జయమనోహరి
  367. నీ చేయు - నీలాంబరి
  368. నీ చిత్తము నా - విజయవసంతం
  369. నీ చిత్తము నిష్చలము - ధన్యాసి
  370. నీ దాసానుదాసుడ - హమీర్ కల్యాణి
  371. నీ దయ గల్గుటే - రీతిగౌళ
  372. నీ దయ రాదా - వసంతభైరవి
  373. నీ దయ రావలెగాక - తోడి
  374. నీ దయచే - యదుకుల కాంభోజి
  375. నీ ముద్దు మోము - కమలా మనోహరి
  376. నీ పద పంకజముల - బేగడ
  377. నీ పరాక్రమము - షన్ముగప్రియా
  378. నీ సాతి ఎవరు - హేమవతి
  379. నీదు చరణములే - సిమ్హేంద్ర మధ్యమం
  380. నీకే దయరాక - నీలాంబరి
  381. నీకే తెలియకపోతే - ఆనంద భైరవి
  382. నీకెవరి బోధన - సుద్ద సావేరి
  383. నీకు సరి ఎవరూరా - మణిరంగు
  384. నీకు తనకు - బేగడ
  385. నీలకణ్ఠ నిరంజన - ఆభోగి
  386. నీవాడ నే గాన - సారంగ
  387. నీవణ్టి దైవము - భైరవి
  388. నీవణ్టి దైవమును - తోడి
  389. నీవే నన్నెడ - సౌరాష్ట్రం
  390. నీవేగాని నన్నెవరు - బిలహరి
  391. నీవేర కులధనము - బేగడ
  392. నీవు బ్రోవవలెనమ్మ - సావేరి
  393. నెనరుంచరా నాపైని - సిమ్హవాహిని
  394. నెనరుంచినాను అన్నిటికి - మాళవి
  395. నేనెందు వేతుకుదురా - హరికాంభోజి, కర్నాటక బెహాగ్
  396. నేరమా రామ - సౌరాష్ట్రం
  397. నిధిచాల సుఖమా - కల్యాణి
  398. నిజ మర్మములను - ఉమాభరణం
  399. నిజమైతే ముందర - భైరవి
  400. నిజముగ నీ - సహాన
  401. నిన్నాడ నేల - కానడా
  402. నిన్నన వలసిన - కల్యాణి
  403. నిన్నే భజన - నాట్టై
  404. నిన్నే నెర - కామవర్ధని
  405. నిన్నే నెర నమ్మిన్ను - ఆరబి
  406. నిన్ను బాసి - బలహంస
  407. నిన్నువినా నామది - నవరస కన్నడ
  408. నిన్నువినా సుఖముగాన - తోడి
  409. నిరవతి సుకద - రవి చంద్రికా
  410. నిత్య రూప - దర్బార్, కాపి
  411. నోరెమి శ్రీ రామ - వరాళి
  412. న్ర్పాలవాల కలాధర - నాథవరంగిణి
  413. ఓ ధవనేషవర - నాట్టై కురింజి
  414. ఓ జగన్నాథ - కేదార గౌళ
  415. ఓ రాజీవాక్శ - ఆరబి
  416. ఓ రామ ఓ రామ - ఆరబి
  417. ఓ రామ రామ - నాగగాంధారి
  418. ఓ రమారమణ - కేదారం
  419. ఓ రంగషాయి - కాంభోజి
  420. ఓడను జరిపే - సారంగ
  421. ఒక మాట - హరికాంభోజి
  422. ఒకపరి జూడగ - కలావతి
  423. ఒరజూపు చూచెడి న్యాయమా - కన్నడగౌళ
  424. ఒరుల నాదుకో - సుద్ద సావేరి
  425. పాహి కల్యాణ రామ - కాపి
  426. పాహి కల్యాణసుందర - పున్నాగవరాళి
  427. పాహి మాం హరే - సౌరాష్ట్రం
  428. పాహి మాం శ్రీ - కాపి
  429. పాహి పాహి - సౌరాష్ట్రం
  430. పాహి పరమ దయాళో - కాపి
  431. పాహి పరమాత్మ - వరాళి
  432. పాహి రామ దూత - వసంతవరాళి, ష్హద్విదమార్గిని
  433. పాహి రామ రామ - ఖరహరప్రియా
  434. పాహి రామచంద్ర పాలిత - శంకరాభరణం
  435. పాహి రామచంద్ర రాఘవ - యదుకుల కాంభోజి
  436. పాహి రమారమణ - వరాళి
  437. పాలయ శ్రీ - దేవగాంధారి
  438. పాలింతువో పాలించ - కాంతామణి
  439. పదవి నీ - సాళగభైరవి
  440. పక్కల నిలబడి - ఖరహరప్రియా
  441. పలుకవేమి నా - పూర్నచంద్రికా
  442. పలుకవేమి పతిత - ఆరబి
  443. పలుకు కణ్డ - నవరస కన్నడ
  444. పరాకు జేసిన - జుజహులి
  445. పరాకునూ - కీరణావళి
  446. పరాముఖం ఏలరా - షురుట్టి
  447. పరాసక్తి మనుపరాదా - సావేరి
  448. పరబ్రహ్మనునే - ఖరహరప్రియా
  449. పరలోక భయము - మందారి
  450. పరలోక సాధనమే - పూర్వి కల్యాణి
  451. పరమ పావన - కామవర్ధని
  452. పరమాత్ముడు వెలుగు - వాగదీష్వరి
  453. పరిపాలయ దాషరథే - శంకరాభరణం - 2
  454. పరిపాలయ మాం - దర్బార్
  455. పరిపాలయ పరిపాలయ - రీతి గౌళ
  456. పరిపూర్ణ కామ భావమున - పూర్వి కల్యాణి
  457. పరిపూర్ణ కామ సరిలేని - హంసభ్రమరి
  458. పరితాపము గని - మనోహరి
  459. పరియాచకమా మాట - వనస్పతి
  460. పరులను వేడను - బాలహంస
  461. పతికి హారతీరే - షురుట్టి
  462. పతికి మంగళ - ఆరబి
  463. పట్టి విడువ - మంజరి
  464. పవమాన (నీ నామరూపములకు) - సౌరాష్ట్రం
  465. పేరిడి నిను - ఖరహరప్రియా
  466. పెరుగు పాలు - ఘంట
  467. ఫణిపతి సాయీ - ఝంకారధ్వని
  468. పూల పాంపు - ఆహిరి
  469. ప్రాణనాథ బిరాన - షూలిని
  470. ప్రారబ్ధ మిట్టుణ్డగ - స్వరావళి
  471. ప్రొదు పొయెను - తోడి
  472. పుష్పపుర నివాస - వసంతా
  473. రాగ రత్నమాలికచె - రీతిగౌళ
  474. రాగ సుధారస - ఆందోళికా
  475. రాజు వెడలె - దేష్యతోడి
  476. రాకా షషి వదన - తక్క
  477. రామ బాణ - సావేరి
  478. రామ దైవమా - షురుట్టి
  479. రామ ఏవ దైవతం - బాలహంస
  480. రామ కథా - మద్యమావతి
  481. రామ కోదణ్డరామ పాహ్ - ఖరహరప్రియా
  482. రామ కోదణ్డరామ రామ - భైరవి
  483. రామ లోభమేల - దర్బార్
  484. రామ నామం - మద్యమావతి
  485. రామ నామము - అఠాణా
  486. రామ నన్ను బ్రోవరా - హరికాంభోజి
  487. రామ నీ వాదుకొందువో - కల్యాణి
  488. రామ నీపై తనకు - కేదారం
  489. రామ నీవేగాని - నారాయణి
  490. రామ నిన్ను వినా - శంకరాభరణం
  491. రామ నిను నమ్మిన - మోహనం
  492. రామ పాహి - కాపి
  493. రామ రామ గోవింద - సౌరాష్ట్రం
  494. రామ రామ నీవారము - ఆనంద భైరవి
  495. రామ రామ రామ - సహానా
  496. రామ రామ రామ మాం - యదుకుల కాంభోజి
  497. రామ రామ రామ నాపై - కల్యాణి
  498. రామ రామ రామ రామ - మోహనం
  499. రామ రామ రామ రారా - షెంజురుట్టి
  500. రామ రామ రామ సీతా - హుసేని
  501. రామ రామ రామచంద్ర - ఘంట
  502. రామ రామకృష్ణ - గౌళిపంతు
  503. రామ రఘుకుల - కాపి
  504. రామ సమయము - మద్యమావతి
  505. రామ సీతారామ - శంకరాభరణం
  506. రామ సీతారామ రామ రజ - బాలహంస
  507. రామ శ్రీ రామ జిత - వరాళి
  508. రామ శ్రీ రామ లాలి (లాలి) - శంకరాభరణం
  509. రామా నీ సమానమెవరు - ఖరహరప్రియా
  510. రామా నీయెడ - ఖరహరప్రియా
  511. రామా నిన్నే - హుసేని
  512. రామాభిరామ మనసు - ధన్యాసి
  513. రామాభిరామ రఘురామ - సావేరి
  514. రామాభిరామ రమణీయ - దర్బార్
  515. రామభక్తి - సుద్ద బంగాళ
  516. రామచంద్ర నీ దయ - షురుట్టి
  517. రామం భజేహం - సావేరి
  518. రాముని మరవకవే - కేదార గౌళ
  519. రానిధి రాదు - మణిరంగు
  520. రారా మాయిణ్టి దాక - అసావేరి
  521. రారా నన్నేలుకోరా - సౌరాష్ట్రం
  522. రారా ఫణిషయన - హరికాంభోజి
  523. రారా రఘువీర - అఠాణా
  524. రారా సీతా - హిందోళవసంతా
  525. రఘునాయక - హంసద్వని
  526. రఘునందన రాజమోహన - సుద్ద దేసి
  527. రఘునందన రఘునందన - కేదార గౌళ
  528. రఘుపతే రామ - సహానా
  529. రఘువర న - కామవర్ధని
  530. రఘువీర రణధీర - హుసేని
  531. రక్ష బెత్తరే - భైరవి
  532. రక్షింపవే శ్రీ - మాయమాళవ గౌళ
  533. రమారమణ భారమా - వసంతభైరవి
  534. రమారమణ రారా - శంకరాభరణం
  535. రమించువ - సుపోషిని
  536. రంగనాయక రక్షింపుమయ్య - శంకరాభరణం
  537. రే మానస చింతయే - తోడి
  538. రూకలు పదివేలున్న - దేష్యతోడి
  539. సాదించనె - ఆరబి
  540. సాగరుణ్డు వెడలె - యమునా కల్యాణి
  541. సాకేత నికేతన - కన్నడ
  542. సాక్షి లేదనుచు - బంగాళ
  543. సామజవరగమనా - హిందోళం
  544. సామికి సరి - బేగడ
  545. సారమే గాని - కామవర్ధని
  546. సారస నేత్ర - శంకరాభరణం
  547. సారి వెడలిన - అసావేరి
  548. సార్వభౌమ సాకేట - రాగపంజరము
  549. సదా భజింపవే - తోడి
  550. సదా మదిన్ - గంభీరవని
  551. సద్గురు స్వామికి - రీతి గౌళ
  552. సమయము దెలిసి - అసావేరి
  553. సమయము ఏమరకే - కల్కడ
  554. సంసారములైతే - సావేరి
  555. సముఖాన నిల్వ - కోకిల వరాళి
  556. సనాతన - ఫలమంజరి
  557. సందేహము ఏలరా - కల్యాణి
  558. సందేహమును - రామప్రియా
  559. సంగీత జ్ఞానము - ధన్యాసి
  560. సంగీత షాస్త్ర - సాలగభైరవి
  561. సరస సామదాన - కాపి నారాయణి
  562. సరసీరుహ నయన - బిలహరి
  563. సరసీరుహ నయనే - అమ్రితవర్షిని
  564. సరసీరుహానన రామ - ముఖారి
  565. సరి ఎవ్వరే - శ్రీ రంజని
  566. సరిజేసి వేడుక - తీవ్రవాహిని
  567. సరివారిలోన చౌక - భిన్నషడ్జం
  568. సర్వాంతర్యామి నీ - భైరవి
  569. సర్వలోక దయానిధే - హుసేని
  570. సత్తలేని దినములు - నాగనందిని
  571. సీతా కల్యాణ వైభోగమే - శంకరాభరణం
  572. సీతా మనోహర - రమామనోహరి
  573. సీతా నాయక - రీతి గౌళ
  574. సీతాపతి కావవయ్య - శంకరాభరణం
  575. సీతాపతి నా - కమాస్
  576. సీతావర సంగీత - దేవగాంధారి
  577. సీతమ్మ మాయమ్మ - వసంతా
  578. షాంతము లేక - ష్యామా
  579. షంభో మహాదేవ - కామవర్ధిని
  580. షంభో షివ - శంకరాభరణం
  581. షంకర గురువరుల - శంకరాభరణం
  582. షర షర సమరైక - కుంతల వరాళి
  583. షరణు షరణు - మద్యమావతి
  584. షషి వదన - చంద్రజ్యోతి
  585. షివ షివ షివ ఎనరాదా - కామవర్ధిని
  586. షివపరాధము - ష్యామా
  587. షివే పాహిమాంబికే - కల్యాణి
  588. షోబానే - కామవర్ధని
  589. శ్రీ గణనాథం - కనకాంగి
  590. శ్రీ గణపతిని - సౌరాష్ట్రం
  591. శ్రీ జానకి మనోహర - ఈసమనోహరి
  592. శ్రీ జనక తనయే - కలాకాంతి
  593. శ్రీ మానిని - పూర్నషద్జం
  594. శ్రీ నారద గురురాయ - భైరవి
  595. శ్రీ నారద నాథ- కానడా
  596. శ్రీ నరసిమ్హ - ఫలమంజరి
  597. శ్రీ రామ దాస - ధన్యాసి
  598. శ్రీ రామ జయరామ ష్రితజన - వరాళి
  599. శ్రీ రామ జయరామ ష్రంగార - మద్యమావతి
  600. శ్రీ రామ పాదమా - అమ్రితవాహిని
  601. శ్రీ రామ రామ జగదాత్మ - పూర్నచంద్రికా
  602. శ్రీ రామ రామ జితరామ - వరాళి
  603. శ్రీ రామ రామ రామ - గోపికవసంతం
  604. శ్రీ రామ రామ సీతా - సావేరి
  605. శ్రీ రామ రామ ష్రితులము - సావేరి
  606. శ్రీ రామ రఘురామ - యదుకుల కాంభోజి
  607. శ్రీ రామ శ్రీ రామ శ్రీ - సహానా
  608. శ్రీ రామచంద్ర - సావేరి
  609. శ్రీ రఘుకులమందు - హంసద్వని
  610. శ్రీ రఘువర - కాంభోజి
  611. శ్రీ రఘువర దాషరథే - శంకరాభరణం
  612. శ్రీ రఘువర కరుణాకర - దేవగాంధారి
  613. శ్రీ రఘువర సుగుణాలయ - భైరవి
  614. శ్రీ రమ్య చిత్తాలంకార - జయమనోహరి
  615. శ్రీ తులసమ్మ్మ - దేవగాంధారి
  616. శ్రీకాంత నీయెడ - భావప్రియా
  617. శ్రీపప్రియ - అఠాణా
  618. శ్రీపతే - నాగస్వరావళి
  619. ష్రింగారించుకొని - షురుట్టి
  620. ష్యామసుందరాంగ - ధన్యాసి
  621. సిగ్గు మాలి - కేదార గౌళ
  622. స్మరణే సుఖము - జనరంజని
  623. సోభిల్లు సప్తస్వర - జగన్మోహిని
  624. సొగసుగా మ్రిదంగ - శ్రీ రంజని
  625. సొగసుజూడ - కన్నడ గౌళ
  626. సుధా మాధుర్య - సిందు రామక్రియా
  627. సుగుణములే జెప్పుకొణ్టి - చక్రవాకం
  628. సుజన జీవన - కమాస్
  629. సుఖి ఎవరో - కానడా
  630. సుందర దషరథ - కాపి
  631. సుందరతర దేహం - కామవర్ధని
  632. సుందరేష్వరుని - శంకరాభరణం
  633. సుందరి నన్నందరిలో - బేగడ
  634. సుందరి నీ దివ్య - కల్యాణి
  635. సుందరి నిను - ఆరబి
  636. స్వర రాగ సుధా - శంకరాభరణం
  637. తలచి నంతనే - ముఖారి
  638. తలి తణ్డ్రులు - బాలహంస
  639. తనలోనే ధ్యానించి - దేవగాంధారి
  640. తనమీద నే - భూషావళి
  641. తనవారి తనము - బేగడ
  642. తనయంతే ప్రేమ - భైరవి
  643. తనయుని బ్రోవ - భైరవి
  644. తప్పగనే వచ్చునా - సుద్ద బంగాళ
  645. తప్పి బ్రతికి - తోడి
  646. తరమా నీ మహిమ - కల్యాణి
  647. తత్వమెరుగ తరమా - గరుడధ్వని
  648. తవ దాసోహం - పున్నాగవరాళి
  649. తీరునా లోని - సావేరి
  650. తెలిసి రామ - పూర్నచంద్రికా
  651. తెలియలేరు రామ - ధేనుకా
  652. తేర తీయగ రాదా - గౌళిపంతు
  653. తోలి జన్మమున - బిలహరి
  654. తొలి నే జేసిన - సుద్ద బంగాళ
  655. తొలి నేను జేసిన - కోకిలధ్వని
  656. తులసి - మాయమాళవ గౌళ
  657. తుళసి బిల్వ - కేదార గౌళ
  658. తులసి జగజ్జనని - సావేరి
  659. ఉండేది రాముడు - హరికాంబోజి
  660. ఉణ్డి ఏమి - యదుకుల కాంభోజి
  661. ఉన్న తావున - ఘంట
  662. ఉపచారము చేసే - భైరవి
  663. ఉపచారములను - భైరవి
  664. ఊరకే గల్గున - సహానా
  665. ఉయ్యాలలూగ వైయ - నీలాంబరి
  666. వాచామగోచరమే - కైకవషి
  667. వాడేర దైవము - కామవర్ధని
  668. వారిధి నీకు - తోడి
  669. వారిజ నయన - కేదార గౌళ
  670. వారిజ నయన (వెర్సిఒన్ 2) - కేదార గౌళ
  671. వాసుదేవ వరగుణ - బిలహరి
  672. వాసుదేవయాని (డరువు) - కల్యాణి
  673. వచ్చును హరి - కల్యాణి
  674. వద్దనే వారు - షన్ముగప్రియా
  675. వద్దనుణ్డునదే - వరాళి
  676. వల్లగాదానక - హరికాంభోజి, శంకరాభరణం
  677. వనజ నయనుడని - కేదార గౌళ
  678. వందనము రఘునందన - సహానా
  679. వర నారద - విజయశ్రీ
  680. వర రగ - షెంజుకాంభోజి
  681. వరాలందు కొమ్మని - గుర్జరి
  682. వరద నవనీత - రాగపంజరము
  683. వరదరాజ నిన్ను - స్వరభూషని
  684. వరలీల గానలోల - శంకరాభరణం
  685. వరమైన నేత్రోత్సవమును - ఫరజు
  686. వరషిఖి వాహన - సుప్రదీపం
  687. వెడలెను కోదణ్డపాణి - తోడి
  688. వేదపురీష షోదన - పూర్వి కల్యాణి
  689. వేదవాక్యమని - కేదార గౌళ
  690. వేదవాక్యమని - మోహనం
  691. వెంకటేష నిన్ను - మద్యమావతి
  692. వేరెవ్వరే గతి - షురుట్టి
  693. విడజాలదురా - జనరంజని
  694. విడము సేయవే - ఖరహరప్రియా
  695. విధి షక్రాదులకు - యమునా కల్యాణి
  696. విధియేమి జేయుదురా - కామవర్ధని
  697. విదులకు మ్రొక్కేద - మాయమాళవ గౌళ
  698. విన నాషకొని - ప్రతాపవరాళి
  699. విన రాదా - దేవగాంధారి
  700. వినాయకుని వలేను - మద్యమావతి
  701. వినతా సుత రారా - హుసేని
  702. వినతా సుత వాహన - జయంతసేన
  703. వినతా సుత వాహనుడై - హరికాంభోజి
  704. వినవే ఓ మనసా - వివర్ధని
  705. వినయము కౌషికుని - సౌరాష్ట్రం
  706. విరాజ తురగ - బాలహంస
  707. విష్ణు వాహనుణ్డిదిగో - శంకరాభరణం
  708. యజ్ఞాదులు సుఖమను - జయమనోహరి
  709. యోచనా కమల - దర్బార్
  710. యుక్తము గాదు - శ్రీ

మూలాలు

[మార్చు]
  1. శ్రీ త్యాగరాజస్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలు, డా.నూకల చిన్నసత్యనారాయణ, 2003.