Jump to content

అచలాత్మజా పరిణయము

వికీపీడియా నుండి

అచలాత్మజా పరిణయం తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు రచించిన పద్యకావ్యం. ఇది అత్యంత ప్రత్యేకమైన, విశిష్టమైన ద్వ్యర్థి కావ్యమనే ప్రక్రియలో దీనిని రచించారు.

రచనా నేపథ్యం

[మార్చు]

అచలాత్మజా పరిణయము కావ్యం తిరుమల బుక్కపట్టణ వేంకటాచార్యులు తెలుగు సాహిత్య చరిత్రలో క్షీణయుగంగా భావించే కాలంలో రచించారు. దక్షిణాంధ్ర యుగంలో కవులు క్లిష్టమైన శైలీ విన్యాసాలు, విశిష్టమైన శబ్దాలంకారాల విన్యాసాలు ప్రదర్శించారు. వెనువెంటనే వచ్చిన ఈ యుగంలోని కవుల్లోనూ అవే ఛాయలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ గ్రంథకర్త ఒకే కావ్యాన్ని ముందు నుంచి చదివితే ఒక ఇతివృత్తం, వెనుక నుంచి చదివితే మరొక ఇతివృత్తంగా కనిపించే విశిష్టమైన శైలిలో రచించారు. దక్షిణాంధ్ర యుగంలోని వెలుగులు కూడా క్షీణించిపోయాయనీ, చిత్రకవిత్వాలు, గర్భకవిత్వాలతో రసానికి, ఇతివృత్తానికి ప్రాధాన్యత ఇవ్వకుండా రచించారనీ భావించి ఈ యుగాన్ని కొందరు సాహిత్యకారులు క్షీణయుగం అన్నారు. అటువంటి దశలో రాసిన ఈ గ్రంథం 1936లో పునర్ముద్రితమైంది.

ఇతివృత్తాలు

[మార్చు]

ప్రత్యేకత

[మార్చు]

ద్వ్యర్థి కావ్యం చాలా విలక్షణమైన, కష్టభరితమైన ప్రక్రియ. ఒకే కావ్యానికి రెండు అర్థాలు వచ్చేలా రచిస్తే దాన్ని ద్వ్యర్థి కావ్యమని పిలుస్తారు. రాఘవ పాందవీయమనే గ్రంథాన్ని ఉదాహరణగా స్వీకరిస్తే అవే పద్యాలు రామాయణ పరంగా చదువుకుంటే రామాయణంగానూ, మహాభారతంగా అర్థం చేసుకుంటే భారతంగానూ అర్థం వచ్చేలా రచించారు. ఇలాంటి గ్రంథాన్ని రచించడానికి విస్తృతమైన భాషా పరిజ్ఞానం, లోతైన సాహిత్య పాండీత్యం అవసరం. ఆ అపురూపమైన ప్రక్రియలో ఈ గ్రంథం చేరుతుంది.

మూలాలు

[మార్చు]

బయటిలింకులు

[మార్చు]