Jump to content

దిట్టకవి నారాయణకవి

వికీపీడియా నుండి
దిట్టకవి నారాయణకవి
వృత్తిపండితులు, రచయిత, కవి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రంగారాయ చరిత్రము
తల్లిదండ్రులు
  • పాపరాజకవి (తండ్రి)

దిట్టకవి నారాయణకవి తెలుగు కవి.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

అతను ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. కాశ్యప గోత్రానికి చెందిన పాపరాజకవి కుమారుడు. ఇతడు రంగరాయచరిత్రము అనే ప్రబంధమును రాసి దానిని కృష్ణామండలములోని నర్సారావుపేట జమీందారు మల్రాజు రామారాయని కి అంకితం చేసాడు. ఈ గ్రంధము 1790 వ సంవత్సర ప్రాంతముల యందు రచించినట్లు తెలియవచ్చుచున్నది. ఈ పుస్తకము 1757 వ సంవత్సరమున బొబ్బిలికోటవద్ద శ్రీరావు రంగారాయఁడు గారికిని ఫ్రెంచిసేనానాయకుఁ డగు బుస్సీ గారితో నచ్చటి కేగిన పూసపాటి విజయరామరాజు గారికిని జరిగినయుద్దము భారతయుద్దమువలె వర్ణింపబడినది. బొబ్బిలికోటవద్ద జరిగిన యుద్దక్రమమును బొబ్బిలి సంస్థాన చరిత్రమును కథా సందర్భమున నిందు కొంత వివరించబడి ఉన్నది.

ఈ రంగారాయచరిత్రమును తొలిసారి వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు వారు 1885 లో ముద్రించారు. దీని మూడవ కూర్పు 1914 ముద్రించబడి ప్రస్తుతం అందుబాటులోనున్నది.[2]

మూలాలు

[మార్చు]
  1. కందుకూరి వీరేశలింగం పంతులు (1911). ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము. రాజమండ్రి: హితకారిణీ సమాజము. pp. 109–115.
  2. దిట్టకవి నారాయణకవి (1914). రంగారాయ చరిత్రము (PDF). మద్రాసు: వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్. Retrieved 14 August 2020.