Jump to content

మాలతీ మాధవం (1940 సినిమా)

వికీపీడియా నుండి
మాలతీ మాధవం
(1940 తెలుగు సినిమా)

మాలతీమాధవం సినిమా పోస్టర్
దర్శకత్వం చిత్తజల్లు పుల్లయ్య
తారాగణం పాలువాయి భానుమతి,
పెంటపాడు పుష్పవల్లి,
రేలంగి వెంకటరామయ్య,
కస్తూరి శివరావు
కళ్యాణి
నిర్మాణ సంస్థ మెట్రో పోలిటన్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

1940లో విడుదలైన ఈ చిత్రం భానుమతి రెండవ చిత్రం. అమాయక పిల్లైన మాలతి పాత్రలో నటించింది. ఈ సినిమాలో భానుమతి నటించడానికి బలిజేపల్లి, రేలంగి, శివరావు ప్రభృతులు ఆమె తండ్రి ఒత్తిడి తేగా అయిష్టంగా అంగీకరించింది.[1]

సి. పుల్లయ్య దర్శకత్వంలో భవభూతి రాసిన కావ్యం ఆధారంగా కవిరాజు రాసిన సంభాషణలు పాటలతో 'మాలతీ మాధవం' రూపొందింది. ముగ్ద లాంటి మాలతి పాత్రకి భానుమతిని ఆమె సరసన మాధవుడుగా హీరో పాత్రలో శ్రీనివాసరావు, మరో పాత్రలో పుష్పవల్లి నటించారు. ఈ చిత్రానికి కలకత్తా న్యూ థియేటర్‌ స్టూడియోలో ఇండోర్‌ షూటింగ్‌, కలకత్తాలోని బొటానికల్‌ గార్డెన్స్‌లో ఔట్‌డోర్‌ షూటింగ్‌ చేశారు. 'మాలతీ మాధవం' చిత్రం ఆర్థిక సమస్యలతో రూపొందింది. ఈ చిత్రం ద్వారా భానుమతికి పేరొచ్చింది కానీ సినిమా విజయం సాధించలేదు.[2]


తారాగణం

[మార్చు]

పాలువాయి భానుమతి

పెంటపాడు పుష్పవళ్ళి

రేలంగి వెంకట్రామయ్య

కస్తూరి శివరావు

కళ్యాణి

శ్రీనివాసరావు

కామేశ్వరరావు

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య

మాటలు, పాటలు:కవిరాజా

నిర్మాణ సంస్థ: మెట్రో పాలిటిన్

సంగీతం:

గాయనీ గాయకులు: పి.భానుమతి , శ్రీనివాసరావు, ఎ.నారాయణరావు , ప్రశాంతమ్మ, పుష్పవల్లి, సుభద్ర, లక్ష్మీబాయి, ఎన్.పరదేశి, బి.కామేశ్వరరావు, కల్యాణి, ఎ.వి.సుబ్బారావు

విడుదల:12:04:1940.

పాటల జాబితా

[మార్చు]

1.సుందర నందనమే లోకము నందన , గానం.పాలువాయి భానుమతి,శ్రీనివాసరావు

2.ఓయీ విజయ వేషధారి ప్రేయసీగోనిపో,గానం. పి.పుష్పవల్లి, సుభద్ర, లక్ష్మీబాయి

3.అధోగతినైతి విధి పగబూనే వృధా బ్రతుకేలా, గానం.పి.భానుమతి

4.ఘనుడే సుగుణుడే అహా గౌరింపవాడే చెలియా, గానం.పి.భానుమతి

5.ఓబాలా ముదమోందవే బాలా త్రిభువన జననికి, గానం.ప్రశాంతమ్మ

6.చల్లని మారుత మహామది జల్లని తృల్లించే ,

7.జై మహేశా నటరాజా. కామకోటి కమనీయ మహనీయా, గానం.బృందం

8.నవ్వు నవ్వితే నవ్వాలి నా నాథుడే

9.నాడేము గాదీ పాడు శరీరము నమ్మకురా నరుడా, గానం.ఎన్.పరదేశి

10.నారాణి ముద్దుల రాణి ఇటురావే నా దొరసానీ, గానం.సుభద్ర, లక్ష్మీబాయి, ఎ.నారాయణరావు

11.పరమ పురుషుని దరియ తగునటే, గానం.లక్ష్మీబాయి, సుభద్ర, ఎ.నారాయణరావు

12.పూలను గూర్చి నే మాలిక జేతును మాలికగొని నా నా మగనికి ,

13.ప్రియతమా ప్రణయనిది నా జీవనాధార , గానం.సి.శ్రీనివాసరావు

14.ప్రేమము దాచగదే నా ప్రేమము, గానం.పి.పుష్పవళ్లి, బి.కామేశ్వరరావు

15.ప్రేయసీ నా మాలతి నవనీత, గానం.పి.భానుమతి, సి.శ్రీనివాసరావు, పుష్పవళ్లి, బి.కామేశ్వరరావు

16.భ్రాంతి మదిని విడుమా మాలతి వరశాంతిని చేకొనుమా, గానం.కల్యాణి

17.మందయాన రావే నీ మాధవుడల్లడుగో జలకములాడే,

18.మోవి అనగనిమ్మా ఓ ముద్దులగుమ్మాా, గానం.ఎ.వి.సుబ్బారావు

19.లేదో మరలా నాకా భాగ్యము తరుణిమణి నే, గానం.బి.కామేశ్వరరావు

20.లేమా సౌందర్యసీమా లేమా దీపిత , గానం.సి.శ్రీనివాసరావు

21.లోకము లేలెడు రాజా శశాంకా చేగొను స్వాగతము, గానం.పి.భానుమతి

22.సరసిక దళ నయనాదేవి కరుణా జలనిధీ, గానం.పి.భానుమతి , సి.శ్రీనివాసరావు

23.సరసుడ ఔరా చాల్చాలు కపటమతి , గానం.పుష్పవళ్లి , బి.కామేశ్వరరావు

24.హాయిగా కూ అని తీయవే రాగము కోకిలా సఖీ, గానం.పి.భానుమతి

25.హే జననీ భీకర కరశత హే జననీ ,

పద్యాలు

[మార్చు]

1.అర్జను గుట్టు మట్టంతయు శౌరీ సత్యకుం జెప్ప, గానం.ఎ.నారాయణరావు

2.అర్జునుడట్లు సన్యాసి వేషము వహియించి, గానం.ఎ.నారాయణరావు

3.ఇది కామాందకి సత్కృపా మహిమ, గానం.సి.శ్రీనివాసరావు

4.ఒక్క వదూటికై శ్రమము నొందగా, గానం.ప్రశాంతమ్మ

5.నీకు పుత్రిక పుత్రుoడు నీకు గాని,

6.పుత్రిక సౌఖ్యమింత తలపోయగా జాలని,గానం.పి.భానుమతి

7.మనసులో కోర్కె మనసులోననే యుండగా , గానం.పి.భానుమతి

8.మారుడు క్రూరుడౌచునను మాటిమాటికీ, గానం.ఎ.వి.సుబ్బారావు

9.సకల శుభదాత సుగతుడు సాక్షిగాగ ,

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.















మూలాలు

[మార్చు]