Jump to content

మీలో ఎవరు కోటీశ్వరుడు

వికీపీడియా నుండి
మీలో ఎవరు కోటీశ్వరుడు
మీలో ఎవరు కోటేశ్వరుడు షో లోని చిత్రం
సమర్పణఅక్కినేని నాగార్జున
దేశంభారతదేశము
అసలు భాషతెలుగు
సిరీస్‌లసంఖ్య
ప్రొడక్షన్
నిడివి90 నిమిషాలు
విడుదల
వాస్తవ నెట్‌వర్క్మాటీవి (2014–ఇప్పటి వరకు)
వాస్తవ విడుదల1 జూన్ 2014 (2014-06-01) –
ప్రస్తుతము

మీలో ఎవరు కోటీశ్వరుడు మాటీవిలో ప్రసారం చేయబడుతూ బహుళ ప్రజాదరణ పొందుతున్న గేమ్‌షో. దీనికి అక్కినేని నాగార్జున సారథ్యం వహిస్తున్నారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి" (2000-2007) టీవీ షోకు దేశవ్యాప్తంగా గొప్ప ప్రజాదరణ వచ్చింది. అయితే ఆ టీవీ కార్యక్రమం తెలుగులో "మీలో ఎవరు కోటీశ్వరుడు" పేరుతో చేస్తున్నారు. ఈ షో జూన్ 2014 నుంచి మాటీవీలో ప్రసారమవుతోంది. ఇప్పుడీషో అందర్నీ ఆకట్టుకుంటోంది. మా టీవీలో వస్తోన్న ఈ షో గంటన్నరపాటు ఉంటుంది. ఈ కార్యక్రమానికి అదిరే అభి క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

ఈ షోకి మంచి రేటింగ్స్ వస్తున్నాయని మా టీవీ ప్రకటించింది. ప్రస్తుతం వస్తోన్న అన్ని తెలుగు కార్యక్రమాలకంటే ఈ షో రేటింగుల్లో దూసుకుపోతోంది. గత వారం ఈ కార్యక్రమం అత్యధికంగా స్థూల రేటింగ్ పాయింట్లను సొంతం చేసుకుంది. 9.7 టెలివిజన్ వ్యూయర్ రేటింగ్ (టీవీఆర్) పాయింట్లు లభించాయి. గత రెండేళ్లలో ఈ స్థాయిలో రేటింగులు వచ్చిన కార్యక్రమం మరేదీ లేదని మా టీవీ ప్రకటించింది.[1]

ఎంపిక విధానం

[మార్చు]

ఈ షో ప్రతి సోమవారం నుండి గురువారం వరకు మాటీవిలో రాత్రి 9 గంటల నుండి 10.30 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ పోటీలో పాల్గొనుటకు 10 లక్షల మంది ఎస్.ఎం.ఎస్ లు పంపించారు. వారిలో 1500 మందిని మాత్రమే షార్ట్ లిస్టు చేయడం జరిగింది. వారిలో ప్రతి షోకు 10 మంది మాత్రమే హాట్ సీటు కోసం పోటీ పడుతుంటారు.

షో విధానం

[మార్చు]
అక్కినేని నాగార్జున
ప్రశ్నల విలువల విధానం
ప్రశ్న సంఖ్య ప్రశ్న విలువ
1 1,000
2 2,000
3 3,000
4 5,000
5 10,000
6 20,000
7 40,000
8 80,000
9 1,60,000
10 3,20,000
11 6,40,000
12 12,50,000
13 25,00,000
14 50,00,000
15 1,00,00,000

ఇందులో ఒక షోకు పదిమందిని ఎంపిక చేస్తారు. అందులో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్టు అనే ప్రక్రియలో మొదట మూడు ప్రశ్నలు విడివిడిగా అడగబడతాయి. అందులో ఏ వ్యక్తి తక్కువ సమయంలో వాటి జవాబులను చెప్తారో ఆ వ్యక్తిని హాట్ సీట్ పైకి ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తదుపరి ఆ వ్యక్తి జీవిత విశేషాలపై మాటీవి వారు తయారు చేసిన వీడియోను ప్రదర్శిస్తారు. తదుపరి ఆవ్యక్తికి గేమ్‌లో భాగంగా పదిహేను ప్రశ్నలు కంప్యూటర్ ద్వారా అడగబడతాయి. అందులో మూడు లైఫ్ లైన్ లు ఉంటాయి.

వాటిలో ఒకటి "ఆడియన్స్ పోల్", "ఫోన్ ఎ ఫ్రెండ్", "50-50". వాటిలో అభ్యర్థి ఏ ప్రశ్న జవాబు తెలియకపోయినా ఈ లైఫ్ లైన్స్ ను వాడుకోవచ్చు. ఆడియన్స్ పోల్ లో భాగంగా ఏ ప్రశ్న జవాబైనా అభ్యర్థికి తెలియని యెడల ఆ షోలో పాల్గొన్న వీక్షకులకు టచ్ ప్యాడ్స్ యిస్తారు. వాటిని ఉపయోగించి ఆడియన్స్ వారి జవాబు అక్షరాలను ఒత్తిన యెడల నాలుగు జవాబులలో ఆడియన్స్ ఎంపిక చేసిన జవాబుల శాతాన్ని తెలుసుకోవచ్చు. ఆ జవాబును గేంలో పాల్గొన్న అభ్యర్థి సంతృప్తి చెందిన యెడల ఆడియన్స్ తో పాటుగా వెళ్ళి ఆ సమాధానాని ఎంపిక చేస్తాడు. ఆడియన్స్ యిచ్చిన జవాబును కూడా సంతృప్తి పడకపోవచ్చు. రెండవ లైఫ్ లైన్ అయిన "ఫోన్ ఎ ఫ్రెండ్"లో భాగంగా అభ్యర్థి ముందుగా గేమ్ షోకు ముగ్గురు స్నేహితుల వివరాలను వారి ఫోన్ నెంబర్లను యిస్తాడు. గేమ్‌షోలో అభ్యర్థికి ఏదైనా ప్రశ్నకు సహాయం కావలసిన యెడల ఈ లైఫ్ లైన్ ఎంపిక చేసిన యెడల ముందుగా అందజేసిన స్నేహితులలో ఒకరిని ఎంపిక చేయమని అక్కినేని నాగార్జున చే అడగబడతారు. అందులో ఆ ప్రశ్నకు సమాధానం యివ్వగల సామర్థ్యం ఉన్న వ్యక్తిని అభ్యర్థి ఎంపిక చేస్తారు. వారికి కంప్యూటరు ద్వారా ఫోన్ చేయబడుతుంది. వారికి అభ్యర్థి 30 సెకన్లలో ప్రశ్నను చెప్పి దాని జవాబును తెలుసుకోవాలి. ఆ జవాబుకు సంతృప్త పడవచ్చు లేదా పడక పోవచ్చు. మూడవ లైఫ్ లైన్ అయిన "50-50"లో భాగంగా అభ్యర్థి ప్రశ్నకు దిగువనీయబడిన జవాబులలో రెండు తప్పు సమాధానాలను తొలగించమని కోరుతారు. వాటిలో రెండు తప్పు సమాధానములను కంప్యూటరు తొలగించిన పిదప మిగిలిన రెంటిలో ఒకదాన్ని ఎంపిక చేస్తాడు.

ఈ షోలో అడగవలసిని 15 ప్రశ్నలలో మొదటి ప్రశ్న యొక్క విలువ 1000/- ఉంటుంది. ఆతదుపరి క్రమంగా ప్రశ్నల విలువలు 2000,3000,5000, 10000 గానూ ఒక విభాగంగా ఐదు ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకు 45 సెకన్ల సమయం మాత్రమే యివ్వబడుతుంది. పదివేలు లోపు ఏదైనా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పని యెడల ఆభ్యర్థికి ఏ విధమైన ప్రైజ్ రాదు. 6 నుండి 10 ప్రశ్నల యొక్క విలువలు క్రమంగా 20000, 40000, 80000, 160000, 320000 గా ఉంటాయి.ఈ ప్రశ్నలకు 60 సెకన్లు సమయం మాత్రమే యివ్వబడుతుంది. ఈ ఐదు ప్రశ్నలలో ఏదైనా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పని యెడల అభ్యర్థికి 10 వేలు మాత్రమే ప్రైజ్ మనీగా వస్తుంది. లేదా ఏ ప్రశ్నకైనా సరైన సమాధానం తెలియని యెడల గేమ్‌ నుండి నిష్క్రమిస్తే వారికి ఆ ప్రశ్న యొక్క విలువ గల మొత్తం స్వంతమవుతుంది. మూడవ భాగంగా 11 నుండి 15 ప్రశ్నల విలువలు క్రమంగా 640000, 1250000, 2500000, 5000000, 1 కోటి ఉంటాయి.ఈ ప్రశ్నలకు సమయ నిబంధన ఉండదు. ఈ ఐదు ప్రశ్నలలో ఏదైనా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పని యెడల అభ్యర్థికి 3 లక్షల యిరవై వేలు మాత్రమే ప్రైజ్ మనీగా వస్తుంది. లేదా ఏ ప్రశ్నకైనా సరైన సమాధానం తెలియని యెడల గేమ్‌ నుండి నిష్క్రమిస్తే వారికి ఆ ప్రశ్న యొక్క విలువ గల మొత్తం స్వంతమవుతుంది.

ఒక అభ్యర్థి గేమ్‌లో ప్రైజ్ మనీని గెలుపొందిన తదుపరి మిగిలిన వారికి పై విధంగా మరల పాస్టెస్ట్ ఫింగర్ ఫస్టు, గేమ్‌ నిర్వహింపబడుతుంది. ఈ విధంగా ఒకవారంలో పదిమందిలో గరిష్ఠంగా ఎందరు అభ్యర్థులు హాట్ సీట్ లో పాల్గొంటారో వారు పాల్గొనిన తర్వాత మిగిలిన అభ్యర్థులకు బహుమతులనిచ్చి గౌరవిస్తారు. ఆ తదుపరి వారంలో మరల పది మంది క్రొత్త అభ్యర్థులతో గేమ్‌ షో ప్రారంభించబడి పై విధానం ప్రకారం జరుగుతుంది. ఈ షోలలో ప్రతివారం వివిధ రంగాలలో సెలబ్రిటీలను కూడా ఆహ్వానించి వారికి కూడా హాట్ సీట్ ఛాన్స్ యిచ్చి వారి జీవితంలో సాధించిన విజయాల విషయాలను ప్రేక్షకులకు తెజియజేస్తారు.

మొదటి సీజన్

[మార్చు]

మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం మొదటి సీజన్ ఆగస్టు 7, 2014న పూర్తయింది. నాగార్జున మొదటి సీజన్ కు గానూ 40 ఎపిసోడ్ లకు చిత్రీకరణ జరిపారు. చివరి ఎపిసోడ్‌కి పార్లమెంట్ సభ్యుడు, ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

రెండవ సీజన్

[మార్చు]

మూడవ సీజన్

[మార్చు]

మూడవ సీజన్ లో మొట్ట మొదటిసారి రావణ శర్మ అనే వ్యక్తి 25 లక్షలు గెలుచు కొన్నారు, తరువాత జనవరి 2016 మొదటి వారంలో అమరనాధ్ - రోహిత దంపతులు 50 లక్షలు గెలుచు కొన్నారు

విశేష ప్రతిభ కనబరచిన వ్యక్తులు

[మార్చు]
ఎపిసోడ్ సంఖ్య అభ్యర్థి పేరు హోదా నివాసస్థలం గెలుపొందిన మొత్తం
27 పేరి ఉమాకాంత్ [2] సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులు
చింతాకులపేట, యానాం
యానాం 12,50,000
35 అరుణ్ మెహర్ గంగరాజు ఆంగ్ల ఉపాధ్యాయులు
తూర్పుగోదావరి జిల్లా
తూ.గోదావరి జిల్లా 12,50,000

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]