ముషీరాబాద్ మసీదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముషీరాబాద్ మసీదు
ముషీరాబాద్ మసీదు, ఛాయాచిత్రం: గులాం యజ్దానీ (1940)
మతం
అనుబంధంఇస్లాం
ప్రదేశం
ప్రదేశంముషీరాబాదు, హైదరాబాదు, తెలంగాణ
వాస్తుశాస్త్రం.
గ్రౌండ్‌బ్రేకింగ్1580 CE
పూర్తైనది1611 CE
మినార్లు2

ముషీరాబాద్ మసీదు (ముషీరాబాద్ పెద్ద మసీదు లేదా ముషీరాబాద్ జమా మసీదు) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ముషీరాబాద్ ప్రాంతంలో ఉన్న మసీదు.[1][2][3] దీని అసలు భాగాన్ని కుతుబ్ షాహి రాజవంశపు నాల్గవ సుల్తాన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించాడు.

చరిత్ర[మార్చు]

1580లో దీని నిర్మాణం ప్రారంభమై 1611 పూర్తయింది. గోల్కొండ పతనం తరువాత, నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II పాలనలో నవాబ్ అరస్తు జా ప్రధానమంత్రి అయ్యేవరకు ఈ మసీదుని ఎవరూ పట్టించుకోలేదు. ఇది 1951లో పునఃనిర్మించబడింది. నమాజ్ చేసుకోవడానికి వీలుగా కొత్తగా నాలుగు అంతస్తుల భాగం నిర్మించబడింది.[4]

నిర్మాణం[మార్చు]

కట్టడాలకు నాలుగు ద్వారాలు నిర్మించడం, సున్నంతో అందమైన డిజైన్లు చెక్కడం ఇరాన్ సంస్కృతిలో భాగం. హైదరాబాదు నగరంలోని వివిధ కట్టడాలపై ఇరానియన్ల ప్రభావం ఉంది. ఈ ముషీరాబాదు మసీదు కూడా ఇరానియన్ శైలీలో నిర్మించబడింది. ఈ మసీదులో ఐదు ఎత్తైన తోరణాలు, మూలల్లో రెండు స్తంభాలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. Iyer, Lalita (3 June 2018). "Hyderabad: The grandeur of Qutb mosque". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 8 April 2020.
  2. "Jamia Masjid Musheerabad, Musheerabad Mosque Hyderabad – Temples In India Information". templesinindiainfo.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 20 July 2018. Retrieved 8 April 2020.
  3. Nanisetti, Serish (19 August 2017). "There lies a forgotten story". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 8 April 2020.
  4. Bilgrami, Syed Ali Asgar (1992). Landmarks of the Deccan: A Comprehensive Guide to the Archaeological Remains of the City and Suburbs of Hyderabad (in ఇంగ్లీష్). Asian Educational Services. ISBN 9788120605435.