మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం
| ||||||||||||||||||||||||
మూస:Campaignbox Third Anglo-Mysore War |
మూడవ ఆంగ్లో-మైసూరు యుద్ధం (1789-92) దక్షిణ భారతదేశంలో మైసూరు సామ్రాజ్యానికీ, ఈస్టిండియా కంపెనీ-మిత్రరాజ్యాలైన హైదరాబాద్ నిజాం, మరాఠాలతో జరిగిన యుద్ధం. మొత్తం నాలుగు ఆంగ్లో మైసూరు యుద్ధాల్లో ఇది మూడవది.
నేపథ్యం
[మార్చు]మైసూరు రాజ్యపు పరిపాలకుడైన టిప్పు సుల్తాన్, అతనికి ముందు తండ్రి హైదర్ అలీ కాక బ్రిటీష్ సైన్యంతో దీనికి ముందు జరిగిన యుద్ధాలలో రెండుసార్లు తలపడ్డారు. మొదటి ఆంగ్లో-మైసూరు యుద్ధం 1760లో జరిగి స్పష్టమైన ఫలితాలు లేకుండానే ముగిసింది. ఐతే ఈ యుద్ధానంతరం సంధిలో భావి సంఘర్షణల్లో ఒకరికొకరు సహకరించుకోవాలని నిబంధించారు. మరాఠా సామ్రాజ్యంతో జరిగిన అనంతర యుద్ధాల్లో బ్రిటీష్ వారు మైసూరుకు సహకారం చేయకపోవడం, మైసూరు శత్రువులకు లాభం కలిగించేలా వ్యవహరించడం హైదర్ అలీకి బ్రిటీషర్లపై అయిష్టత ఏర్పడేందుకు కారణమయ్యింది. 1779లో ఫ్రెంచి-నియంత్రణలో ఉన్న మహె పోర్టు బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ తీసుకుంది. హైదర్ ఈ పోర్టు ద్వారానే సైనిక సంపత్తిని స్వీకరిస్తూండడంతో ఆయనకు ఇది అత్యంత కీలకమైనది. దీని కారణంగా రెండవ ఆంగ్లో-మైసూరు యుద్ధం ప్రారంభమైంది.