Jump to content

మైదానం (నవల)

వికీపీడియా నుండి
మైదానం
మైదానం పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: గుడిపాటి వెంకట చలం
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ: అరుణా పబ్లిషింగ్ హౌస్
విడుదల:


మైదానం గుడిపాటి వెంకట చలం 1927 లో రచించిన నవల. ఈ నవల ప్రధానంగా స్త్రీ స్వేచ్ఛ గురించి ప్రస్తావిస్తుంది.[1]

ఈ నవల మొత్తం ఒక స్త్రీ యొక్క వ్యక్తి గతజీవితం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ స్త్రీ శారీరక సుఖం కోసం పడే తపన, దానికి వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు, సమాజం యొక్క పాత్ర, ఇత్యాదివన్ని ఈ స్త్రీ ద్వారా మనకు వివరిస్తాడు చలం. ఈ నవల మొత్తం స్త్రీ కోణంలో వివరించబడుతుంది, అంతా తానే చెప్తున్నట్టుగా ఉంటుంది. నవల మొత్తంలో ప్రధాన పాత్రలు మూడు. మొదటిది మూలము అయిన రాజేశ్వరిది. రెండవది అమీర్. నవల మొత్తం వీరిద్దరే ప్రధాన కర్తలు కాగా మిగిలినది మీర్ అనే పాత్ర. ఈ నవలకి ముందు మాట, ఉపోద్ఘాతం, ఇతివృత్తం ఏమీ లేవు.

ప్రభావాలు

[మార్చు]

చలం రాసిన ఈ నవల ప్రభావంతో విశ్వనాథ సత్యనారాయణ 1933 లో చెలియలి కట్ట అనే నవల రాశాడు. 1960 వ దశకంలో త్రిపురనేని గోపీచంద్ ఇదే భావజాలం మీద గడియపడని తలుపులు, మెరుపుల మరకలు, గతించని గతం అనే నవలలు రాశాడు. రచయిత్రి తెన్నేటి లత చలం రచనను విమర్శిస్తూ కాలం కరిచిన కడపట అనే నవల రాసింది.[2]

మూలాలు

[మార్చు]
  1. "మైదానం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". www.andhrabhoomi.net. Archived from the original on 2021-10-28. Retrieved 2021-01-30.
  2. జయప్రభ (1 July 1999). "మైదానానికి చెలియలి కట్ట – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-07-08.