మైలార మహాదేవప్ప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైలార మహదేవప్ప
2018లో తపాలాశాఖ విడుదల చేసిన స్మారక తపాలా బిళ్ళ
జననం(1911-06-08)1911 జూన్ 8
మరణం1943 ఏప్రిల్ 1(1943-04-01) (వయసు 31)
హొసరిట్టి, కర్ణాటక
వృత్తిభారత విప్లవ వీరుడు
తల్లిదండ్రులుమార్తాండప్ప, బసమ్మ

మైలార మహాదేవప్ప (8 జూన్ 1911 – 1 ఏప్రిల్ 1943), కర్ణాటక రాష్ట్రం, హవేరి జిల్లాకు చెందిన బ్రిటీష్‌కు వ్యతిరేకంగా పనిచేసిన భారత విప్లవ వీరుడు. మార్తాండప్ప, బసమ్మలు ఇతని తల్లిదండ్రులు.

ఇతడు తన 18వ యేట మహాత్మా గాంధీతో పాటు దండి యాత్రలో పాల్గొన్నాడు. ఇతడు కర్ణాటక నుండి దండి యాత్రలో పాల్గొన్న ఏకైక వ్యక్తిగా పేరు గడించాడు.

ఇతడు గాంధీ పిలుపు మేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. బ్రిటీషు అధికారులు రైతులతో బలవంతంగా వసూలు చేసిన భూమి సిస్తును వారి నుండి తిరిగి ఆయా రైతులకు పంచిపెట్టేవాడు. హొసరిట్టి గ్రామం వీరభద్రస్వామి ఆలయంలో బ్రిటీష్ అధికారులు ఉంచిన ఖజానాపై దాడి చేస్తుండగా ఇతడు 1943, ఏప్రిల్ 1వ తేదీన బ్రిటీష్ పోలీసుల తూటాలకు బలయ్యాడు. ఇతనితో పాటు మడివలార తిరకప్ప, హీరేమఠ వీరయ్యలు కూడా హత్య గావించబడ్డారు.

2018లో భారత తంతి తపాలా శాఖ ఇతని స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఇతని పేరుమీద ఒక స్మారక ట్రస్టు కూడా ప్రారంభించబడింది.[1][2][3][4]

మూలాలు

[మార్చు]
  1. Vaddiraju, Anil Kumar (2013). Sisyphean Efforts? State Policy and Child Labour in Karnataka. Newcastle upon Tyne: Cambridge Scholars Publishing. p. 25. ISBN 978-1-4438-4974-6.
  2. Basavaraj, S. The Legend of Mahadevappa, Karnataka's own Bhagat Singh[permanent dead link]. News Karnataka, 31 August 2018.
  3. Hugar, Gangadhar (15 August 2016). "Freedom fighter's tales of valour". The New Indian Express. Retrieved 8 February 2020.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "India Post Issued Stamp and Sheetlet on Freedom Fighter Mahadevappa Mailara" (in అమెరికన్ ఇంగ్లీష్). PhilaMirror. 4 September 2018. Archived from the original on 22 జనవరి 2020. Retrieved 9 February 2020.

బయటి లింకులు

[మార్చు]