మైలు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
మైలు రకం | విలువ (కి.మీ.) |
---|---|
అంతర్జాతీయ | 1.609344 |
నాటికల్ | 1.852 |
యు.ఎస్. సర్వే | 1.60934721869 |
పొడవును కొలుచుటకు ఒక ప్రమాణం మైలు. సాధారణంగా మైలు 5.280 అడుగులకు సమానంగా ఉంటుంది. 1760 గజాలు లేదా 1609 మీటర్లు ఒక మైలు. 5,280 అడుగుల యొక్క మైలును కొన్నిసార్లు స్టాట్యూట్ మైలు లేదా లాండ్ మైలు అంటారు, ఎందుకంటే నాటికల్ మైలుకి (6,076 అడుగులు లేదా 1,852 మీటర్లు) దీనికి భేదం చూపడానికి. చరిత్రలో మైళ్ళను అనేక రకాల ప్రమాణిక యూనిట్లగా ఉపయోగించారు. ఆ పొడవులను రకరకాల మైళ్ళుగా ఆంగ్లంలోకి అనువదించారు. వారు వాడిన వివిధ రకాల మైళ్ళ పొడవు 1 నుంచి 15 కిలోమీటర్లు ఉండేవి. 1 మైలు = 1.609344 కిలోమీటర్లు
1959 లో అంతర్జాతీయంగా యార్డ్ (గజం), పౌండ్ ల ఒప్పందం చేసుకునేంత వరకు ఆంగ్లం మాట్లాడే దేశాలలో ల్యాండ్ మైలు కచ్చితమైన దూరాన్ని చూచించడంలో కొద్ది మార్పులు ఉండేవి, తరువాత గజము అంటే కచ్చితంగా 0.9144 మీటర్లు అని, మైలు అంటే కచ్చితంగా 1,609.344 మీటర్లని నిర్ణయించారు.
శబ్దలక్షణం
[మార్చు]మైలు అనే పదం పాత ఆంగ్ల పదం మిల్ నుండి ఉద్భవించింది, ఈ పదం లాటిన్ పదం మిలియా నుండి వచ్చింది, లాటిన్ లో ఈ పదం యొక్క అర్థం "వెయ్యి".
స్టాట్యూట్ మైలు
[మార్చు]యు.ఎస్. UK పదం మైలు సాధారణంగా స్టాట్యూట్ మైలు ఉపయోగిస్తారు. 1 స్టాట్యూట్ మైలు = 1,760 గజాలు (నిర్వచనం ద్వారా) = 5,280 అడుగులు = 1.609344 కిలోమీటర్లు (సరిగ్గా)
నాటికల్ మైల్
[మార్చు]నాటికల్ మైల్ ను వాయు లేదా సముద్ర ప్రయాణానికి ఉపయోగిస్తారు. నాటికల్ మైలు అనగా భూమిపై అక్షాంశం యొక్క నిముషం కోణం యొక్క చాపం పొడవు. ఒక డిగ్రీ (60 '= 1 °) లో అరవై నిముషాలుంటాయి. ఒక నిముషం కోణం అక్షాంశం పై చేయు చాపరేఖ పొడవును నాటికల్ మైలు అంటారు. భూమి యొక్క ఉత్తర ధృవం నుండి దక్షిణ ధృవం వరకు 10,800 నాటికల్ మైళ్ళు ఉంటుంది. నిర్వచనం ప్రకారం నాటికల్ మైలు అనగా 1.852 మైళ్ళు.≈ 6,076 అడుగులు ≈ 1.151 స్టాట్యూట్ మైళ్ళు గా పరిగణలోకి తీసుకుంటారు.