మొహమ్మద్ రఫీ (ప్రొఫెసరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రొఫెసర్ రఫీ
Assumed office
2015
వ్యక్తిగత వివరాలు
జననం
రఫీ

1967 ఆగస్టు 17
వరంగల్, వరంగల్ జిల్లా, ఇండియా
జీవిత భాగస్వామిఅబేదా, సంతానం ఆధ్య, ఇరా
చదువుకాకతీయ వైద్య కళాశాల ఎంబీబీఎస్ మెడికల్ సైన్సెస్ కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ సైన్సెస్ గాంధీ వైద్య కళాశాల ఎం.డీ
వృత్తిబయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ , బుక్ రైటర్, డాక్టర్

డాక్టర్ రఫీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ [1] డీన్, ఆచార్యుడు, బుక్ రైటర్, డాక్టర్. ఇతను 2019 నుండి సురభి ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ సిద్దిపేటలో మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అంతకు ముందు వివిధ మెడికల్ కాలేజీల్లో వివిధ హోదాల్లో పనిచేశార. వరంగల్[2] జిల్లా నేరేడుపల్లి లో ప్రాధమిక విద్య పూర్తి చేశారు.

జననం

[మార్చు]

ఫీ 1867 ఆగష్టు 17 న తెలంగాణ రాష్ట్రం వరంగల్ పట్టణంలో జన్మించారు. ఇతనితల్లి తండ్రులు అబ్బాస్ అహ్మద్ బీ.

విద్యాభ్యాసం

[మార్చు]

మోహబూబాబాద్ లో హై స్కూల్ విద్య ను, ఇంటర్మీడియట్ ను తెలుగు మీడియం లో చదివారు. కాకతీయ మెడికల్ కాలేజ్[3] లో ఎం బి బి ఎస్, గాంధీ మెడికల్ కాలేజ్[4] లో ఎం.డీ[5] చదివారు.

వివాహం

[మార్చు]

అబేదాను వివాహం చేసుకున్నారు. వారి సంతానం ఇద్దరు అమ్మాయిలు, వారి పేర్లు ఆధ్య, ఇరా.

అనుభవం

[మార్చు]

22 సంవత్సరాలుగా మెడికల్ కాలేజీల్లో పనిచేసారు. 2019 నుండి సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో డీన్ గా, మెడికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

పూర్వ అనుభవం

[మార్చు]

2018 నవంబర్ నుండి 2019 సెప్టెంబర్ వరకూ మహావీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైస్ ప్రిన్సిపల్ గా, బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా పనిచేసారు . 2015 నుండి 2018 అక్టోబర్ వరకూ ఆర్వీఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైస్ ప్రిన్సిపాల్, బయో కెమిస్ట్రీ హెడ్ గా వ్యవహరించారు.2011 మే నుండి 2015 డిసెంబర్ వరకూ చెల్మెడ ఆనందరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రొఫెసర్ గా, బయో కెమిస్ట్రీ హెడ్ గా ఉన్నారు. 2007 ఏప్రిల్ నుండి 2011 ఏప్రిల్ వరకు ప్రతిమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో బయో కెమిస్ట్రీ హెడ్ గానూ, అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేసారు. 2002 నుండి 2007 మార్చ్ వరకూ ప్రతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బయో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో పని చేసారు. మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా తనిఖీల సమయం లో వారి ప్రాధాన్యతలను గుర్తెరిగి కాలేజీల నిర్వహణ, గుర్తింపు పునరుద్ధరణ నిపుణుడు. వివిధ మెడికల్ కాలేజీల్లో పీజీ టీచర్ గా, పీజీ ఎగ్జామినర్ నా పనిచేస్తున్నారు.2002 నుండి ఏంబిబిఎస్ విద్యార్థులకు అధ్యాపకుడిగా, పరీక్షకుడిగా వ్యవహరిస్తున్నారు .ఏంబిబిఎస్ విద్యార్థుల పరీక్షలకు ప్రశ్న పత్రాల రూపకల్పన బృందం లో పనిచేసారు. గతం లో ఏంబిబిఎస్, ఏండి , ఏంసీహెచ్, ఏం ఎస్సీ మెడికల్ పరీక్షలకు, ప్రవేశ పరీక్షలకు ప్రశ్నపత్రాలను రూపొందించారు. దేశంలో పలు విశ్వవిద్యాలయాలకు ఎక్సటర్నల్, ఇంటర్నల్ గా వ్యవహరించారు. క్లినికల్ వర్క్, పరిపాలన లో ఏం సీ ఐ మార్గదర్శకాలను పాటించడం లో నిపుణుడు. బయో కెమిస్ట్రీ రంగం లో అత్యాధునిక ల్యాబ్ లు ఏర్పాటు, నిర్వహణ నిపుణుడు.

పరిశోధనలు

[మార్చు]

15 కు పైగా పరిశోధనాత్మక అంశాలపై పత్రాలను సమర్పించారు. అవి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గ్రంథాలలో ప్రచురితం అయ్యాయి.

ప్రాజెక్టులు

[మార్చు]

సుమారు 12 ప్రాజెక్టు లను చేపట్టారు.

అవార్డులు, ఫెలోషిప్‌లు

[మార్చు]
  • ఫెల్లో షిప్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ బయో కెమిస్ట్స్ ఆఫ్ ఇండియా
  • ఫెల్లో షిప్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ బయో కెమిస్ట్స్ ఆఫ్ ఇండియా
  • ఫెలో ఆఫ్ ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్ అకాడెమి
  • ఫెలో ఆఫ్ ది అసోసియేషన్ కాలేజీ ఆఫ్ చేస్త ఫీజిషియన్స్ ఆఫ్ ఇండియా
  • ఫెలో అఫ్ ఇండియన్ ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్
  • ఫెలో అఫ్ రాయల్ సొసైటీ అఫ్ మెడికోస్
  • ఫెలో అఫ్ అల్ ఇండియా మెడికోస్ సొసైటీ
  • ఫెలో అఫ్ ది సొసైటీ ఫర్ అడ్వాన్స్ డ్ స్టడీస్ ఇన్ మెడికల్ సైన్సెస్
  • అవార్డెడ్ బై హైదరాబాద్ మెడికల్ డాక్టర్స్ అసోసియేషన్ -బెస్ట్ మెడికల్ ఆథర్
  • అవార్డు ఫర్ అకడమిక్ ఎక్స్ లెన్స్

శాస్త్ర గ్రంథాలు

[మార్చు]
  • టెక్స్ట్ బుక్ ఆఫ్ బయో కెమిస్ట్రీ -4 వ ఎడిషన్-2020 (ప్రచురణ: యూనివర్సిటీస్ ప్రెస్- ఓరియంట్ బ్లాక్ స్వాన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎస్‌బిఎన్ 9789389211191)
  • టెక్స్ట్ బుక్ ఆఫ్ బయో కెమిస్ట్రీ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్ ( 3 వ ఎడిషన్- 2017, యూనివర్సిటీస్ ప్రెస్- ఓరియంట్ బ్లాక్ స్వాన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎస్‌బిఎన్ 9789386235220)
  • మాన్యువల్ ఆఫ్ ప్రాక్టికల్ బయో కెమిస్ట్రీ , 3 వ ఎడిషన్-2020, -యూనివర్సిటీస్ ప్రెస్- ఓరియంట్ బ్లాక్ స్వాన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎస్‌బిఎన్ 9789389211658)
  • ఎంసిక్యూస్ ఇన్ బయో కెమిస్ట్రీ , 2013, పాత్ ఫైన్డ్ర్స్ , హైదరాబాద్ , ఐఎస్‌బిఎన్ -81-926850-2-0)
  • రిడిల్స్ ఇన్ బయో కెమిస్ట్రీ 2013, పాత్ ఫైన్డ్ర్స్ , హైదరాబాద్ , ఐఎస్‌బిఎన్ -81-926850-3-9)

మూలాలు

[మార్చు]
  1. "Surabhi Institute of Medical Sciences". www.surabhiims.org. Retrieved 2024-04-25.
  2. "Warangal", Wikipedia (in ఇంగ్లీష్), 2024-03-31, retrieved 2024-04-25
  3. "Kakatiya Medical College". www.kmcwgl.com. Retrieved 2024-04-25.
  4. "Gandhi Medical College, Secunderabad". gmcsecunderabad.org. Retrieved 2024-04-25.
  5. "General Medicine - Gandhi Medical College, Secunderabad". gmcsecunderabad.org. Retrieved 2024-04-25.