యాదాద్రి భువనగిరి జిల్లా సాహిత్య చరిత్ర (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యాదాద్రి భువనగిరి జిల్లా సాహిత్య చరిత్ర
కృతికర్త: డా. పోరెడ్డి రంగయ్య
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): సాహిత్య చరిత్ర
ప్రచురణ:
విడుదల: 2021
పేజీలు: 213


యాదాద్రి భువనగిరి జిల్లా సాహిత్య చరిత్ర, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన సాహిత్య చరిత్రను తెలిపే పుస్తకం. ప్రముఖ కవి, రచయిత, ఉపాధ్యాయుడు, పరిశోధకుడు డా. పోరెడ్డి రంగయ్య రాసిన ఈ పుస్తకంలో వివిధ సాహితీ ప్రక్రియలను సృజించిన వారితో పాటుగా ఇందులో జిల్లాలోని దేవాలయాలు, శాసనాలు, ప్రసిద్ధ ప్రదేశాల, జాతరల వివరాలతోపాటుగా అనేకమంది సాహితీ ప్రసిద్ధుల వివరాలు ఉన్నాయి.[1]

పుస్తక నేపథ్యం[మార్చు]

2017లో తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రంలోని ముప్ఫైమూడు జిల్లాల సాహిత్య చరిత్రను గ్రంథరూపంలోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాల వారిగా సాహిత్య చరిత్రను వెలుగులోకి తేవాలన్న సంకల్పంతో జిల్లాలకు చెందిన ప్రముఖ కవులకు ఆయా జిల్లాల సాహిత్య చరిత్రను రాసే బాధ్యతను అప్పగించింది. అందులో భాగంగా, యాదాద్రి భువనగిరి రచయితల సంఘ అధ్యక్షుడు డా. పోరెడ్డి రంగయ్య ఈ పుస్తకాన్ని రాశాడు.[1]

విషయసూచిక[మార్చు]

జిల్లా భౌగోళిక స్వరూపం

సాంస్కృతిక విశేషాలు

• దేవాలయాలు • మతం పండుగలు • జాతరలు

• దర్శనీయ స్థలాలు • భాష • ఆచార వ్యవహారాలు

• కోటలు • భూదానోద్యమ స్ఫూర్తి • బుద్ధ విగ్రహం

రామానందతీర్థ గ్రామీణ సంస్థ

ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయం

• సినిమా రంగం

చరిత్ర - శాసనాలు

• చరిత్ర • శాసనాలు • నిజాం రాష్ట్రం

ఆంధ్రమహాసభ (భువనగిరి)

ప్రాచీన సాహిత్యం

• శాసన కవి పండితులు • ప్రాచీనకవులు

• రాజకవులు • జైన సాహిత్యం

ఆధునిక సాహిత్యం

• పద్య సాహిత్యం • శతక సాహిత్యం • భక్తి కవిత్వం

• వచన కవిత్వం • జానపద సాహిత్యం

• గేయ కవిత్వం • కథ-నవల • యక్షగానం-నాటకం

• హరికథ-బుర్రకథ • జ్యోతిష వాస్తు విద్యలు

• పరిశోధన విమర్శ • ఆంగ్ల సాహిత్యం

• ఉర్దూ సాహిత్యం • దీర్ఘ కావ్యాలు

• లఘురూప కవిత్వం • జీవిత చరిత్ర-స్వీయ చరిత్ర

• బాల సాహిత్యం • అనువాదం

• తెలంగాణ ఉద్యమ కవిత్వం • అవధానం

• రచయితలు, సాహిత్య పోషకులు మరి కొందరు

• జంట కవులు - రచయితలు

• ఇతర ప్రాంత రచయితలు

• ఈ జిల్లా ఆయా రంగాల ప్రముఖ వ్యక్తుల గురించి

• కవితా సంకలనాలు పత్రికలు సాహిత్య సంగీత సభలు

• యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు-ధార్మిక ప్రత్యేక అభినందన సంచికలు

సాహిత్య, కళా సంస్థలు

• సాహిత్య సంస్థలు • కళా సంస్థలు

ముగింపు

• ఉపయుక్త గ్రంథాలు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 యాదాద్రి భువనగిరి జిల్లా సాహిత్య చరిత్ర, డా. పోరెడ్డి రంగయ్య, మొదటి ముద్రణ 2021, పుట VIII.