రక్తతిలకం (1964 సినిమా)
Appearance
రక్త తిలకం | |
---|---|
దర్శకత్వం | దాదా మిరాసి |
రచన | కన్నదాసన్ (కథ), శ్రీశ్రీ (మాటలు) |
స్క్రీన్ ప్లే | దాదా మిరాసి |
నిర్మాత | సండే టైమ్స్ రామయ్య |
తారాగణం | శివాజీ గణేశన్, సావిత్రి, మనోరమ, నగేష్ |
ఛాయాగ్రహణం | జాగీర్దార్ |
కూర్పు | వి. రాజు, బిపి కృష్ణన్ |
సంగీతం | పెండ్యాల శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | మణీరాం మూవీస్ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 7, 1964 |
సినిమా నిడివి | 142 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
రక్త తిలకం 1964, ఫిబ్రవరి 7న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. మణీరాం మూవీస్ పతాకంపై సండే టైమ్స్ రామయ్య నిర్మాణ సారథ్యంలో దాదా మిరాసి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, సావిత్రి, మనోరమ, నగేష్ ప్రధాన పాత్రల్లో నటించగా, పెండ్యాల శ్రీనివాస్ సంగీతం అందించాడు.[1]
కథా నేపథ్యం
[మార్చు]చైనా-ఇండియన్ యుద్దం మధ్యలో దేశంలో చైనా దండయాత్ర గురించి వార్తలు విన్న తరువాత, భారత సైన్యంలో చేరాలనుకున్న కుమార్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించబడింది.
నటవర్గం
[మార్చు]- శివాజీ గణేషన్
- సావిత్రి
- పుష్పలత
- నగేష్
- మనోరమ
- ఇన్నత కన్నయ్య
- షణ్ముగ సుందరం
- జావర్ సీతారామన్
- కన్నదాసన్
- సెంతమరై
- తులిబాల
- కన్నప్ప
- ఎస్.ఆర్. జానకి
- గుండు కరుప్పయ
సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: దాదా మిరాసి
- నిర్మాత: సండే టైమ్స్ రామయ్య
- కథ: కన్నదాసన్
- మాటలు: శ్రీశ్రీ
- సంగీతం: పెండ్యాల శ్రీనివాస్
- ఛాయాగ్రహణం: జాగీర్దార్
- కూర్పు: వి. రాజు, బిపి కృష్ణన్
- నిర్మాణ సంస్థ: మణీరాం మూవీస్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి పెండ్యాల శ్రీనివాస్ సంగీతం అందించాడు. ఘంటసాల, పి.బి. శ్రీనివాస్, పి. సుశీల, ఎస్. జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి పాటలు పాడారు.
- ఓ భారతవీరా ఓయీ భారతవీరుడా - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
- బుద్ధుడున్న ధాత్రినే - ఘంటసాల బృందం- రచన: శ్రీశ్రీ
- మహిమగల హిమాద్రిమీద - ఘంటసాల - రచన: శ్రీశ్రీ
- జాజి పూవై చల్లగా రావే జతగా , పి బి.శ్రీనివాస్ , ఎల్.ఆర్.ఈశ్వరి , రచన: శ్రీరంగం శ్రీనివాసరావు
- పలుమాటలేల సెలవిదియే భాషించరానీ మనవి, పి.బి.శ్రీనివాస్ , పి.సుశీల , రచన: శ్రీ శ్రీ
- వేడుకనేడమా వేడుకనేడమా వేడుకలంతా, ఎల్.ఆర్.ఈశ్వరి , రచన: శ్రీ శ్రీ.
మూలాలు
[మార్చు]- ↑ "Raktha Thilakam (1964)". Indiancine.ma. Retrieved 2020-08-30.
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రక్తతిలకం
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)