రవికుమార్ పనస

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రవికుమార్ పనస
జననంరవికుమార్ పనస
(1977-04-12) 1977 ఏప్రిల్ 12 (వయసు 47)
నల్గొండ జిల్లా, తెలంగాణ
వృత్తివ్యాపారవేత్త, సినీ నిర్మాత
తండ్రిశంకరయ్య గౌడ్
తల్లిలింగమ్మ

డాక్టర్ రవికుమార్ పనస తెలంగాణకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త, సినీ నిర్మాత. జర్నలిస్టుగా, పి.ఆర్.ఓ.గా తన జీవితాన్ని ప్రారంభించిన రవికుమార్ వ్యాపార వ్యూహకర్తగా, మాస్టర్ ఆఫ్ ఫిల్మ్ & మీడియా, పబ్లిక్ రిలేషన్స్ గీక్ గా, సినిమా నిర్మాతగా, రియల్ ఎస్టేట్ ప్రమోటర్ గా ఇటు వ్యాపారంగంలోనూ, అటు సినిమారంగంలోనూ రాణిస్తున్నాడు.[1]

ఒక సామాన్య మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చిన రవికుమార్, వ్యాపార ప్రపంచంలో ఎంతో అనుభవాన్ని సంపాదించడంతోపాటు, వ్యాపార నిర్వహణ, మీడియా ప్రమోషన్‌లలో యునెస్కో ఐఎస్సిఈడీ నుండి డాక్టరేట్‌ కూడా పొందాడు.[2]

జననం, విద్య[మార్చు]

రవికుమార్ 1977, ఏప్రిల్ 12న తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు. తండ్రి శంకరయ్య గౌడ్ ప్రభుత్వ ఉద్యోగి కాగా, తల్లి లింగమ్మ గృహిణి. 2022 జూలై 22న దుబాయ్‌లో జరిగిన డాక్టరేట్ డిగ్రీ కాన్వకేషన్ వేడుకలో రాబర్ట్ డి సోర్బన్ హయ్యర్ స్కూల్ నుండి బిజినెస్ మేనేజ్‌మెంట్ & మీడియా ప్రమోషన్స్‌లో ఫ్రెంచ్ గౌరవ డాక్టరేట్ (యునెస్కో ఐఎస్సిఈడీ లెవల్ 8) అందుకున్నాడు.[3]

తెలంగాణ ఉద్యమం[మార్చు]

ప్రత్యేక రాష్ట్రం జరిగిన తెలంగాణ ఉద్యమంలో రవికుమార్ చురుగ్గా పాల్గొన్నాడు. సినిమారంగంలో తెలంగాణ ప్రాంతవారికి జరుగుతున్న అన్యాయం గురించి, వివక్షత గురించి అనేక వేదికలలో తన గొంతును వినిపించారు. అనేక నిరసన కార్యక్రమాలను నిర్వహించాడు.

ఉద్యోగ జీవితం[మార్చు]

యురేకా ఫోర్బ్స్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన రవికుమార్, తరువాత టాటా సెల్యులార్‌లో బిజినెస్ మేనేజర్‌గా పనిచేశాడు. తరువాత నెలకు కేవలం 8000 రూపాయల సంపాదనకు 2009లో సినీస్టార్, 2010లో మాయానగర్ పత్రిక వంటి తెలుగు ఫిల్మ్ మ్యాగజైన్‌లకు జర్నలిస్టుగా, చీఫ్ ఎడిటర్‌ గా పనిచేశాడు.[4]

వ్యాపారరంగం[మార్చు]

సినిమారంగంలోని ప్రముఖులతోపాటు ఇతర రంగాలలోకి ప్రముఖులతో పరిచయాలు పెంచుకున్నాడు. వారి ఆస్తులు, వ్యాపార ఒప్పందాలకు వారధిగా పనిచేశారు. ప్రముఖులు, వారి సంస్థల మధ్య వ్యాపార సమావేశాలను కూడా నిర్వహించాడు. అలా వచ్చిన ఆదాయంతో తన సంపాదనను పెంచుకున్నాడు.[5] డాక్టర్ రవి కుమార్ పనస ప్రస్తుతం రియల్ ఎస్టేట్, సినిమారంగం (రవి పనస ఫిల్మ్ కార్పోరేషన్, ఆర్కే మీడియా), నిర్మాణరంగం (పనస ఇన్‌ఫ్రా అండ్ డెవలప్‌మెంట్), ఫుడ్ & బెవరేజెస్ (పనస బెవరేజెస్), ఇమ్మిగ్రేషన్ వంటి బహుళ వ్యాపారాలలో కొనసాగుతున్నాడు.[6]

ఆ తరువాత ఇన్‌ఫ్రా, నిర్మాణ రంగాలలో స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. 'ఎంఎల్' ప్రీమియమ్ లగ్జరీ లిక్కర్ మార్ట్ సంస్థ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన రవికుమార్,  హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ‘ఎంఎల్’ పేరుతో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద మద్యం దుకాణాన్ని ఏర్పాటుచేశాడు.[7] పనస ఛారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాడు.

సినిమారంగం[మార్చు]

తొలినాళ్ళలో కొంతమంది నిర్మాతలు, నటీనటులకు పీఆర్‌ఓగా కూడా పనిచేశారు. అనంతరం 2011లో ఆర్కే మీడియా అనే సంస్థను స్థాపించి వ్యాపార ప్రకటనలు రూపొందించడంతోపాటు నైజాం ఏరియాలో పలు సినిమాలకు పంపిణీదారుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నక్షత్రం సినిమాకు నైజాం ప్రాంతంలో పంపిణీదారునిగా వ్యవహరించాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు నిర్వర్తించాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్, సైమా, ఐఫా వంటి పలు అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలకు కూడా పి.ఆర్.ఓ. గా పనిచేసాడు.

ఎవరి సహకారం లేకుండా తెలుగు సినిమారంగంలో అంచెలంచెలుగా ఎదిగిన రవికుమార్, ఆ తరువాతికాలంలో రవి పనస ఫిలిం కార్పోరేషన్ పేరుతో ఒక సినీ నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఆ సంస్ధ నుండి గోపీ విహారి (జి.జి.) దర్శకత్వంలో తిరువీర్ హీరోగా తన తొలి సినిమాను నిర్మిస్తున్నాడు.[8]

జింబాబ్వే ట్రేడ్ కమిషనర్‌ గా[మార్చు]

భారతదేశం, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడంలో భాగంగా జింబాబ్వే ఇండియా ట్రేడ్ కౌన్సిల్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జింబాబ్వే ట్రేడ్ కమీషనర్‌ రాయబారిగా రవికుమార్ నియమించబడ్డాడు. న్యూఢిల్లీలో ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్. ఆసిఫ్ ఇక్బాల్, డిప్యూటీ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ మినిస్టర్, జింబాబ్వే రాయబారి రాజ్ కుమార్ మోడీ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నాడు.[9]

అవార్డులు[మార్చు]

  1. 2017లో ఆర్కే మీడియా తరుపున దక్షిణాదిలో ఉత్తమ మీడియా ప్రమోషన్‌లు విభాగంలో ఇండివుడ్ అవార్డును గెలుచుకున్నాడు.
  2. 2023లో లండన్ ఇంటర్నేషనల్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2023 మే 4న లండన్ లో జరిగే అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఈ అవార్డును అందుకోనున్నాడు.

మూలాలు[మార్చు]

  1. "తెలుగు వారి సత్తా.. జింబాబ్వే ట్రేడ్ కమిషనర్‌గా నియమితులైన డాక్టర్ రవి కుమార్ పనస". News18 Telugu. 2023-02-14. Archived from the original on 2023-04-12. Retrieved 2023-04-12.
  2. "జింబాబ్వే ట్రేడ్ కమిషనర్‌ రాయబారిగా డాక్టర్ రవి కుమార్ పనస |". 2023-02-14. Archived from the original on 2023-02-14. Retrieved 2023-04-12.
  3. "జింబాబ్వే ట్రేడ్ కమిషనర్‌గా డాక్టర్ రవి కుమార్ పనస". Prabha News. 2023-02-15. Archived from the original on 2023-02-15. Retrieved 2023-04-12.
  4. B, Satya (2022-03-29). "Ravi Panasa: "I Work With The Rich To Become Rich"". Gulte. Archived from the original on 2022-03-31. Retrieved 2023-04-12.
  5. Arikatla, Venkat (2022-03-28). "Editor In 2011 Becomes Millionaire In 2022?". greatandhra.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-03-29. Retrieved 2023-04-12.
  6. "Dr Ravi Panasa Appointed As Trade Commissioner for Zimbabwe". www.ptinews.com. 2023-02-14. Archived from the original on 2023-02-15. Retrieved 2023-04-12.
  7. ABN (2022-07-30). "హైదరాబాద్‌లో 'ML' ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ లిక్కర్ సూపర్‌స్టోర్". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-11-01. Retrieved 2023-04-12.
  8. "పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా". EENADU. Archived from the original on 2023-04-10. Retrieved 2023-04-12.
  9. Shanker (2023-02-15). "జింబాబ్వే ట్రేడ్ కమిషనర్‌గా నియమితులైన డాక్టర్ రవి కుమార్ పనస". Mana Telangana. Archived from the original on 2023-02-15. Retrieved 2023-04-12.