Jump to content

రామ్ సుతార్

వికీపీడియా నుండి
రామ్ సుతార్
అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (కుడి) నుంచి 2016లో పద్మభూషణ్ అవార్డును అందుకున్న సుతార్ (ఎడమ).
జననం (1925-02-19) 1925 ఫిబ్రవరి 19 (వయసు 99)
గోండూర్, ధులే, మహారాష్ట్ర, భారతదేశం
అవార్డులు2016 పద్మభూషణ్
1999 పద్మశ్రీ
మహాత్మా గాంధీ ప్రతిమ

రామ్ వాంజీ సుతార్ (జననం 1925 ఫిబ్రవరి 19) ఒక భారతీయ శిల్పి. అతను స్టాట్యూ ఆఫ్ యూనిటీని కూడా రూపొందించాడు, ఇది 182 మీటర్ల (597 అడుగులు) ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం.[1]

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్‌బండ్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనంలో రామ్ సుతార్ రూపొందించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. 2023 ఏప్రిల్ 14న ఆంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించాడు.[2][3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సుతార్ 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని ధులే జిల్లాలోని గోందూర్ గ్రామంలో విశ్వకర్మ కుటుంబంలో జన్మించాడు. 1952లో ప్రమీలను వివాహం చేసుకున్నాడు.[4]

కెరీర్

[మార్చు]

గుజరాత్లో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సుతార్ రూపొందించారు. 45 అడుగుల ఎత్తైన చంబల్ స్మారక చిహ్నాన్ని, మహాత్మా గాంధీ ప్రతిమను కూడా ఆయన నిర్మించారు.[5]

అవార్డులు

[మార్చు]

పనులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "India unveils the world's tallest statue". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2018-10-31. Retrieved 2021-12-02.
  2. "BR Ambedkar: జాతి గర్వించేలా.. జగమంతా కనిపించేలా." EENADU. 2023-04-13. Archived from the original on 2023-04-13. Retrieved 2023-04-13.
  3. "CM KCR:దేశమంతా దళిత బంధు ఇచ్చే రోజు వస్తుంది: సీఎం కేసీఆర్‌". EENADU. 2023-04-14. Archived from the original on 2023-04-14. Retrieved 2023-04-14.
  4. "RAM SUTAR AND ANIL SUTAR SCULPTORS". ramsutar.in. Archived from the original on 2020-07-30. Retrieved 2021-12-02.
  5. "'Statue of Unity' To Be Completed In 2 Years: Renowned Sculptor Ram Sutar". NDTV.com. Retrieved 2021-12-02.
  6. "Tagore Awards for Cultural Harmony: Manipuri dancer, Bangladeshi sculptor among recipients". The Indian Express (in ఇంగ్లీష్). 2018-10-26. Retrieved 2021-12-02.

బాహ్య లింకులు

[మార్చు]