రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్
రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ | |
---|---|
దేశం | భారతదేశం |
ఎక్కడ ఉందీ? | కడప, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 14°42′N 78°28′E / 14.70°N 78.46°E |
స్థితి | వాడుకలో ఉంది |
మొదలయిన తేదీ | యూనిట్ 1: 31 మార్చి 1994 యూనిట్ 2: 25 ఫిబ్రవరి 1995 యూనిట్ 3: 25 జనవరి 2007 యూనిట్ 4: 20 నవంబరు 2007 యూనిట్ 5: 14 మార్చి 2018 |
సంచాలకులు | ఎపిజెన్కో |
రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఇదీ ఒకటి.[1]
సామర్థ్యం
[మార్చు]ఈ థర్మల్ పవర్ స్టేషన్ 1650 మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉంది. ఇందులో 210 మెగావాట్లు గలవి 5 యూనిట్లు, 600 మెగావాట్లు గలవి 1 యూనిట్ కలిగి ఉన్నాయి.
దశ | వ్యవస్థాపించిన సామర్థ్యం ( వాట్లు ) | ఆరంభించిన తేదీ | స్థితి |
---|---|---|---|
I | 2X210 | 1994 | ఆరంభించారు |
II | 2X210 | 2007 | ఆరంభించారు |
III | 1X210 | 2010 | ఆరంభించారు |
IV | 1X600 | 2018 | ఆరంభించారు |
పవర్ ప్లాంట్
[మార్చు]I, II, III అనే 3 దశలలో ఈ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ అభివృద్ధి చేయబడింది. ఇది 98–99, 2002–03, 2003–04 మధ్య దేశంలోను మొదటి స్థానంలో, 99–2000, 2001–02 మధ్య రెండవ స్థానంలో నిలిచింది.[2] ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కు వరుసగా ఆరు సంవత్సరాలు మెరిటోరియస్ ఉత్పాదకత అవార్డులు, వరుసగా ఏడు సంవత్సరాలు ప్రోత్సాహక అవార్డులు లభించాయి.[1] 2018, మార్చి లో స్టేజ్ IV యూనిట్ 1x600 మెగావాట్లని ప్రారంభించింది. ఇది ఆర్టిపిపి మొత్తం వ్యవస్థాపిత సామర్థ్యానికి 1650మెగావాట్లకు చేరింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2011-01-24. Retrieved 2021-05-22.
- ↑ "Rayalaseema Thermal Power Plant". Andhra Pradesh Power Generation Corporation Ltd. Archived from the original on 3 మార్చి 2012. Retrieved 22 May 2021.
- ↑ https://energy.economictimes.indiatimes.com/news/power/bhel-commissions-600-megawatt-thermal-power-plant-in-andhra-pradesh/63298985