లక్ష్మమ్మ (సినిమా)
Jump to navigation
Jump to search
లక్ష్మమ్మ (1950 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | త్రిపురనేని గోపీచంద్ |
---|---|
నిర్మాణం | సి.కృష్ణవేణి |
కథ | త్రిపురనేని గోపీచంద్ |
చిత్రానువాదం | త్రిపురనేని గోపీచంద్ |
తారాగణం | చదలవాడ నారాయణరావు, సి.కృష్ణవేణి, మాలతి, సులోచన |
సంగీతం | ఘంటసాల వెంకటేశ్వరరావు (సంగీత దర్శకునిగా మొదటి చిత్రం) |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు |
గీతరచన | బాలాంత్రపు రజనీకాంతరావు |
ఛాయాగ్రహణం | ఎం.ఎ.రహమాన్ |
నిర్మాణ సంస్థ | శోభనాచల & ఎమ్.ఆర్.ఎ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
లక్ష్మమ్మ 1950లో విడుదలైన తెలుగు సినిమా. శోభనాచల పిక్చర్స్ బ్యానర్ పై సి.కృష్ణవేణి నిర్మించిన ఈ సినిమాకు త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వం వహించాడు. చదలవాడ నారాయణరావు, సి.కృష్ణవేణి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
నటీనటులు
[మార్చు]- చదలవాడ నారాయణరావు - వెంకయ్య నాయుడు
- సి.కృష్ణవేణి - శ్రీలక్ష్మి
- గోవిందరాజులు సుబ్బారావు
- మాలతి
- సులోచన
- వంగర వెంకటసుబ్బయ్య
- అట్లతద్దోయ్ అట్లతద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ - బృందం
- అసతోమా సద్గమయా (శ్లోకం) - ఘంటసాల
- ఆశా హర్య్మము కూలె నిలుపుకొన్న నా బొమ్మల కొలువే - కృష్ణవేణి
- ఊయల ఊపనా సఖీ ఊయల ఊపనా సఖీ - ఎం.ఎస్. రామారావు, కృష్ణవేణి
- ఏమని ఏమేమని నా హృదిలోపల కోరిక ఏదో - కృష్ణవేణి
- ఏల విషాదము నాకేల రాదు మోదము - ఎం. ఎస్. రామారావు
- ఓహో కృష్ణా ఓహో కృష్ణా నీ రాధను నేను కృష్ణా - గాయిని ?
- చిన్ననాటి దోషమేమో చిన్ననాటి దోషమేమో - కృష్ణవేణి, ఘంటసాల
- జోజోజో చిట్టినాతల్లీ జోజోజో పున్నమ జాబిల్లి - కృష్ణవేణి
- తధీం ధీం తననా తోం .. సుదతి నీకు తగిన చిన్నదిరా - ఘంటసాల, బెజవాడ రాజరత్నం
- దయవీణ నా హృదయవీణ నీ మృదుకరాలతో - గాయిని?
- దేవతవై వెలసినావమ్మా లక్ష్మమ్మ దేవతవై వెలసినావమ్మా లక్ష్మమ్మ - ఘంటసాల బృందం
- నేనే విరజాజినైతే నీవే ఎలమావివైతే - బెజవాడ రాజరత్నం, ఘంటసాల బృందం
- పడిన దారిని విడవబోకమ్మా నీకు నీవారు ఎవరు లేరమ్మా - ఘంటసాల
- వారిజముఖి నీవు వచ్చేవేళను కొని కోరికతో వేణుగోపాల - గాయిని ?
- శ్రీకర శుభకర శ్రీ నారసింహా నీకు వందనమయ్యా (బుర్రకథ) - ఘంటసాల బృందం
ఆసక్తికరమైన విషయం
[మార్చు]ఒకే సంవత్సరంలో (1950 లో) ఒకే కథని ఇద్దరు నిర్మాతలు, వివిధ తారాగణాలతో - పోటాపోటీలతో - నిర్మించి ఒకేసారి విడుదల చేసేరు. శ్రీ లక్ష్మమ్మ కథ సినిమాలో అంజలీదేవి, నాగేశ్వరరావు, శివరావు, వగైరా నటించేరు. దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం. ఈ పోటీల వెనుక ఏదో కథ ఉందిట.
మూలాలు
[మార్చు]- ↑ "Lakshmamma (1950)". Indiancine.ma. Retrieved 2020-08-25.
- ↑ ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)