Jump to content

లూయిస్ గ్లూక్

వికీపీడియా నుండి
లూయిస్ గ్లూక్

జననం: (1943-04-22) 1943 ఏప్రిల్ 22 (వయసు 81)
న్యూయార్క్ నగరం, న్యూయార్క్, USA
వృత్తి: Poet
జాతీయత:అమెరికా సంయుక్త రాష్ట్రాలు

లూయిస్ ఎలిజబెత్ గ్లూక్ (జననం 1943 ఏప్రిల్ 22) అమెరికన్ కవయిత్రి. ఆమె న్యూయార్క్ నగరంలో పుట్టి పెరిగింది. ఆమె తన పుస్తకం ది వైల్డ్ ఐరిస్, నేషనల్ బుక్ అవార్డ్ ఆఫ్ పోయెట్రీ కి 1993లో పులిట్జర్ బహుమతితో సహా అనేక అవార్డులను గెలుచుకుంది. ఆమె తన పుస్తకం ఫెయిత్ ఫుల్ అండ్ వర్టువస్ నైట్ కు 2014లో నేషనల్ బుక్ అవార్డ్ లభించింది. 2003లో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కు కవితలో పొయెట్ లారెట్ కన్సల్టెంట్ గా ఉంది..[1] అమెరికాలో జాతీయ మానవతా పతకం, పులిట్జర్ బహుమతితో సహా పలు ప్రధాన సాహిత్య అవార్డులను గెలుచుకుంది. వాటిలో నేషనల్ బుక్ అవార్డు, నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు, బోలింగర్ ప్రైజ్ లు కొన్ని. 2003 నుండి 2004 వరకు అమెరికా దేశపు పొయెట్ లారేట్ గా ఉంది. లూయిస్‌ను స్వీయచరిత్ర కవయిత్రిగా వర్ణిస్తూంటారు. 77 ఏళ్ల ప్రొఫెసర్ లూయిస్ ఎలిసబెత్ గ్లూక్ ను 2020లో సాహిత్యంలో నోబెల్ బహుమతి తో సత్కరించారు[2]. అమెరికా సమకాలీన సాహిత్యంలో పేరెన్నికగన్న రచయితల్లో లూయిస్ ఎలిసబెత్ గ్లూక్ కూడా ఒకరు. గ్లూక్ కవిత్వం ఎప్పుడూ ఒక స్పష్టత కోసం పరితపించే విధంగా ఉంటుందనీ, బాల్యం, కుటుంబ జీవితంతో పాటు తల్లిదండ్రులు, తోబుట్టువుల మధ్య సన్నిహిత సంబంధాలపై ఆమె రచనలు కేంద్రీకృతమై ఉంటాయనీ అకాడమీ కొనియాడింది.

జీవిత చరిత్ర

[మార్చు]

లూయిస్ గ్లూక్ 1943 ఏప్రిల్ 22 న న్యూయార్క్ నగరంలో జన్మించింది. డేనియల్ క్లిక్, పియరీ క్రాస్బీ దంపతుల ఇద్దరు కుమార్తెలలో ఆమె పెద్దది. క్లిక్ తల్లితండ్రులు అమెరికాకు వలస వచ్చిన హంగేరియన్ యూదులు. వారు న్యూయార్క్‌లో కిరాణా దుకాణం పెట్టుకున్నారు. గ్లూక్ తండ్రికి రచయిత కావాలనే కోరిక ఉండేది. కానీ తన బావతో కలిసి వ్యాపారం పెట్టాడు. వారిద్దరూ కలిసి, X-Acto పేరుతో ఒక చాకును కనిపెట్టి వ్యాపారంలో విజయం సాధించారు. గ్లూక్ తల్లి వెల్లస్లీ కాలేజీలో పట్టభద్రురాలైంది. చిన్నతనంలో తల్లిదండ్రులు ఆమెకు గ్రీక్ పురాణశాస్త్రం, జోన్ ఆఫ్ ఆర్క్ జీవితం వంటి క్లాసిక్ కథలను బోధించారు. ఆమె చిన్న వయస్సులోనే కవిత్వం రాయడం ప్రారంభించింది. న్యూయార్క్ లో పుట్టి లాంగ్ ఐలండ్ లో పెరిగిన గ్లూక్, తన కౌమారదశలో ఎనొరెక్సియా నెర్వోసా అనే మానసికవ్యాధికి గురైంది. ఈ ఈటింగ్ డిజార్డర్ వల్ల తింటే బరువు పెరుగుతావేమో అని ఆందోళన చెందుతూంటారు. ఆకలి అసలే లేకపోవడం ఈ వ్యాధి లక్షణం [3]

ఆమె శారీరక పరిస్థితి కారణంగా, గ్లూక్ పూర్తి-కాల విద్యార్థిగా విశ్వవిద్యాలయానికి హాజరు కాలేదు. సారా లారెన్స్ కళాశాలలో కవితా తరగతులకు హాజరయింది. 1963 నుండి 1966 వరకు, కొలంబియా విశ్వవిద్యాలయపు స్కూల్ ఆఫ్ జనరల్ స్టడీస్ లో కవిత్వం వర్క్ షాప్ లలో నమోదు చేసుకుంది. సంప్రదాయేతర విద్యార్థుల కోసం ఈ కళాశాలలో ఒక డిగ్రీ కార్యక్రమం ఉంది. అక్కడ ఉన్నప్పుడు, ఆమె లెయోనీ ఆడమ్స్, స్టాన్లీ కునిట్జ్ ల వద్ద చదువుకుంది. కవయిత్రిగా తన అభివృద్ధిలో ఈ ఉపాధ్యాయులు ముఖ్యమైన గురువులని ఆమె కొనియాడింది.

డిగ్రీ పొందకుండానే కొలంబియా విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టింది. ఆ తరువాత గ్లూక్, సెక్రటేరియల్ పనిలో చేరింది. ఆమె 1967 లో చార్లెస్ హెర్ట్జ్ జూనియర్‌ను వివాహం చేసుకుంది. అయితే వారి దాంపత్యం విడాకులతో ముగిసింది. 1973లో గ్లూక్, జాన్ డ్రానౌకు జీవిత భాగస్వామిగా నోవా అనే కుమారుడికి జన్మ నిచ్చి౦ది. జాన్ డ్రానౌ రచయిత. అతడు గొడ్దార్డ్ కాలేజీలో వేసవి కాలపు రచనా కార్యక్రమ౦ ప్రార౦భి౦చాడు. 1977లో ఆమె డ్రానౌ ను పెళ్ళి చేసుకుంది. 1980లో, డ్రేనో వ్, కవయిత్రి ఎల్లెన్ బ్రయంట్ వోట్ భర్తైన ఫ్రాన్సిస్ వోట్ తో కలిసి ఇంగ్లాండ్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ అనే ప్రైవేట్ అనే లాభాపేక్ష కలిగిన కళాశాలను స్థాపించింది. గ్లూక్, బ్రయంట్ వోట్ లు ఈ సంస్థలో ప్రారంభ పెట్టుబడిదారులు. దాని డైరెక్టర్ల బోర్డులో పనిచేశారు కూడా.

1984లో గ్లూక్, మసాచుసెట్స్ లోని విలియమ్స్ కాలేజీలో ఇంగ్లీష్ డిపార్ట్ మెంటులో సీనియర్ లెక్చరరుగా చేరింది. 1990 వ దశకంలో సాహితీ రంగంలో ఆమె పెద్ద విజయాలను సాధించింది. అదే కాలంలో ఆమె వ్యక్తిగత జీవితం కష్టాల్లో పడింది. జాన్ నుండి విడాకులు తీసుకుంది. ఇది ఆమె వ్యాపార వ్యవహారాలను కూడా ప్రభావితం చేసింది. ఫలితంగా న్యూ ఇంగ్లాండ్ క్యులినరీ ఇన్స్టిట్యూట్ లో పదవుల నుండి అమెను తొలగించారు. తరువాత గ్లూక్ తన అనుభవాన్ని రచనలోకి మళ్ళించి, తన వృత్తి జీవితంలో గొప్ప విజయాలను అందుకుంది.

ఆమె మసాచుసెట్స్ లోని కేంబ్రిడ్జ్‌లో నివ‌సిస్తోంది. అమెరికాలోని యేల్ యూనివ‌ర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెస‌ర్‌గా చేరాక ఆమె 12 క‌వితా సంపుటాలు వెలువ‌రించింది. [4]. 2020 అక్టోబరులో గ్లూక్ కు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. 1901లో ఈ బహుమతి స్థాపించబడినప్పటి నుండి ఈ పురస్కారాన్ని పొందిన పదహారవ మహిళ ఆమె. నోబెల్ పురస్కార గ్రహీతకు బంగారు పతకంతో పాటు 1.1 మిలియన్​ డాలర్ల నగదు బహుమతి కూడా లభిస్తుంది.[5]

రచనలు

[మార్చు]

గ్లూక్ తన మొదటి కవితా సంపుటిని 1968 లో Firstborn అనే పేరుతో ప్రచురించినప్పుడు విమర్శకుల నుండి మంచి స్పందన లభించింది. చిన్న‌త‌నం నుంచి ఫ్యామిలీ లైఫ్ వ‌ర‌కు ఆమె అనేక ర‌చ‌న‌లు చేశారు. కుటుంబీకుల మధ్య సంబంధాలు ఆమె రచనల్లో ప్రధానాంశాలుగా ఉంటాయి. ఈమె కవిత్వంలో భాషాపరమైన కచ్చితత్వంతో పాటు సాదాసీదా ధ్వని, గేయలక్షణం కనిపిస్తాయి. ఆమె కవిత్వం యొక్క సాంకేతిక ఖచ్చితత్వం, సున్నితత్వం, ఒంటరితనం, కుటుంబ సంబంధాలు, విడాకులు, మరణం వంటి అంతర్దృష్టికి ప్రసిద్ధి చెందాయి[6]. సమాజంలో బయటికి కనపడే విషయాల కన్నా మనిషి లోలోపలి సంగతులే లూయిస్‌ని ఎక్కువ ప్రభావితం చేశాయి. 1980 లో తన యిల్లు కాలిపోయి చాలా నష్టం జరిగిన తర్వాత, 1985 లో The Triumph of Achilles అన్న మరో కవితా సంపుటిని వెలువరించింది 1985 లో ఆమె తండ్రి చనిపోయాడు. ఆ దుఃఖపు నేపథ్యం ఆమెను Ararat అనే మరో కవితా సంపుటిని రాసేలా చేసింది. ది ట్రయంఫ్ ఆఫ్ ఆచిల్లెస్ (1985), అరట్ (1990) వంటి కవితా సంపుటాలతో గ్లూక్, USA ఇంకా విదేశాలలో పేరు గడించినది. . ఆమె అత్యంత ప్రశంసించిన సేకరణల్లో ఒకటైన ది వైల్డ్ ఐరిస్ (1992) కవితా సంకలనం సాహితీప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఇది 1993లో పులిట్జర్ బహుమతి గెలుచుకుంది, ఇది ఒక ప్రముఖ అమెరికన్ కవిగా గ్లూక్ యొక్క కీర్తిని ఇనుమడింపచేసింది, "స్నోడ్రాప్స్" అనే కవితలో శీతాకాలం తరువాత జీవితం యొక్క అద్భుతమైన పునరాగమనం గురించి ఆమె వర్ణించింది. విటా నోవా (1999) అనే స౦కలన౦ లో ఇలా అ౦ది: "నా జీవిత౦ ముగిసి౦ది, నా హృదయ౦ పగిలిపోయి౦ది. / తర్వాత నేను కే౦బ్రిడ్జికి వెళ్లాను. " అని, 1994లో ఆమె ప్రూఫ్స్ అండ్ దియరీస్: ఎస్సేస్ ఆన్ పోయెట్రీ అనే వ్యాసాల సంకలనాన్ని ప్రచురించినది. ఆ తర్వాత ఆమె ప్రేమ స్వభావం గురించి, ఒక వివాహం యొక్క క్షీణత గురించి కవితా సంకలనం అయిన మెడోలాండ్స్ (1996) ను నిర్మించింది. ఆమె దాని తరువాత మరో రెండు సంకలనాలు: విటా నోవా (1999), ది సెవెన్ ఏజెస్ (2001). 2004 లో, సెప్టెంబర్ 11, 2001 లో జరిగిన తీవ్రవాద దాడులకు ప్రతిస్పందనగా, గ్లూక్ అక్టోబరు పేరుతో ఒక పుస్తక-నిడివి గల కవితను ప్రచురించినది ఇది ఆరు భాగాలుగా విభజించిన, ఈ కవిత ప్రాచీన గ్రీకు పురాణంపై చిత్రిస్తుంది, బాధ ఇంకా ఆ బాధల యొక్క అంశాలను అన్వేషించడానికి. అదే సంవత్సరం, ఆమె యేల్ విశ్వవిద్యాలయంలో రోసెన్‌క్రాంజ్ రచయిత గా పేరు గడించారు. అవెర్నో (2006) అనేది ఒక అద్భుతమైన సేకరణ, మరణదేవుడు అయిన హేడిస్ చెరలో ఉన్న పెర్సెఫోన్ యొక్క సంతతికి చెందిన వ్యక్తి యొక్క కల్పిత మైన వివరణ. ఫెయిత్ఫుల్ అండ్ వర్చుయస్ నైట్ (2014), దీనికి గ్లూక్ నేషనల్ బుక్ అవార్డును అందుకున్నారు[7]. అమెరికా యొక్క అత్యంత ప్రతిభావంతమైన సమకాలీన కవుల్లో ఒకరిగా పలువురు భావించిన గ్లూక్, అతి తక్కువసమయంలోనే స‌మ‌కాలీన అమెరికా సాహిత్యంలో ప్ర‌ఖ్యాత క‌వయిత్రిగా ఆమె పేరుగాంచారు. ఆమెది ఆత్మాశ్రయ కవిత్వం అని విమర్శకులు పేర్కొంటారు[8]. లూయిస్ గ్లూక్ ఎక్కువగా ఇంగ్లీషులో సాహిత్య సృజన చేసారు, వాటిలో కొన్ని రచనలు స్పానిష్, స్వీడిష్, జర్మన్ భాషలలోకి అనువాదం అయ్యాయి.

Works in English

[మార్చు]

Firstborn. – New York : New American Library, 1968

The House on Marshland. – New York : Ecco Press, 1975

The Garden. – New York : Antaeus Editions, 1976

Descending Figure. – New York : Ecco Press, 1980

The Triumph of Achilles. – New York : Ecco Press, 1985

Ararat. – New York : Ecco Press, 1990

The Wild Iris. – Hopewell, N. J.  : Ecco Press, 1992

Proofs and Theories : Essays on Poetry. – Hopewell, N. J.  : Ecco Press, 1994

The First Four Books of Poems. – Hopewell, N. J.  : Ecco Press, 1995

Meadowlands. – Hopewell, N. J.  : Ecco Press, 1996

Vita Nova. – Hopewell, N. J.  : Ecco Press, 1999

The Seven Ages. – New York : Ecco Press, 2001

October. – Louisville, Ky : Sarabande Books, 2004

Averno. – New York : Farrar, Straus and Giroux, 2006

A Village Life. – New York : Farrar, Straus and Giroux, 2009

Poems 1962–2012. – New York : Farrar, Straus and Giroux, 2012

Faithful and Virtuous Night. – New York : Farrar, Straus and Giroux, 2014

American Originality : Essays on Poetry. – New York : Farrar, Straus and Giroux, 2017

పురస్కారాలు - అవార్డులు

[మార్చు]

లూయిస్ ఎలిజబెత్ గ్లూక్ యొక్క కృషి అనేక అవార్డులను గెలుచుకుంది. యుఎస్‌తో పాటు, ఆమె ప్రధాన కవితా బహుమతి, ఆమె నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్, గుగ్గెన్‌హీమ్ మెమోరియల్ ఫౌండేషన్ సభ్యులు. సంస్థాగత, వ్యక్తిగత పనులలో ఆమె గెలుచుకున్న పురస్కారాలు, అవార్డుల, గౌరవాల జాబితా:)
సంస్థాగత అవార్డులు)
నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్ (1970)
గుగ్గెన్‌హీమ్ మెమోరియల్ ఫౌండేషన్ (1975)
ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫండ్ (1979-80)
అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ కవితల అవార్డు (1981)
గుగ్గెన్‌హీమ్ క్రియేటివ్ ఆర్ట్స్ ఫండ్ (1987))
నేషనల్ ఆర్ట్ ఫండ్ (1988-89))
విలియమ్స్ కళాశాల గౌరవ డాక్టరేట్ (1993))
అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (1993)
వెర్మోంట్ యొక్క అధికారిక కవి (1994-1998)
మిడిల్‌బరీ కళాశాల గౌరవ డాక్టరేట్ (1996)
అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ యొక్క ఫెలోషిప్ (1996)
లన్నన్ లిటరరీ అవార్డు (1999)
MIT స్కూల్ ఆఫ్ ఆంత్రోపాలజీ, ఆర్ట్ అండ్ సొసైటీ (2001) యొక్క 50 వ వార్షికోత్సవ పతకం
బోలీన్ రూట్ అవార్డు (2001)
యు. ఎస్. కవి గ్రహీత (2003-2004)
సొసైటీ ఆఫ్ అమెరికన్ కవి వాలెస్ స్టీవెన్స్ అవార్డు (2008)
ఆధునిక అమెరికన్ కవితలకు ఐకెన్ టేలర్ అవార్డుఆధునిక అమెరికన్ కవితలకు (2010)
యునైటెడ్ స్టేట్స్ అచీవ్మెంట్ అకాడమీ ఫెలోషిప్ (2012)
అమెరికన్ ఫిలాసఫికల్ సొసైటీ (2014) యొక్క ఫెలోషిప్
అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ కవితల బంగారు పతకం (2015)
నేషనల్ హ్యుమానిటీస్ మెడల్ (2015)
ట్రాన్స్ట్రోమర్ ప్రైజ్ (2020)
సాహిత్యంలో నోబెల్ బహుమతి (2020)

వ్యక్తిగత పనికి అవార్డులు

మెల్విల్లే కేన్ అవార్డు: "The Triumph of Achilles" (1985)
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బుక్ క్రిటిక్స్ అవార్డు : "The Triumph of Achilles" (1985)
రెబెక్కా జాన్సన్ బావో కవితలకు జాతీయ బహుమతి : " Ararat అరరత్" (1992)
విలియం కార్లోస్ విలియమ్స్ అవార్డు : " The Wild Iris వైల్డ్ ఐరిస్" (1993)
కవితలకు పులిట్జర్ బహుమతి : " The Wild Iris వైల్డ్ ఐరిస్" (1993)
PEN మార్తా అల్ బ్లాండ్ నాన్-ఫిక్షన్ తొలి అవార్డు: "Proofs & Theories: Essays on Poetry" (1995)
ఇంగ్లీష్ మాట్లాడే నేషన్స్ లీగ్ అంబాసిడర్ బుక్ అవార్డు: "Vita Nova" (2000)
ఇంగ్లీష్ మాట్లాడే దేశాల లీగ్ యొక్క అంబాసిడర్ బుక్ అవార్డు: "Averno'Avernoఅవెర్నో" (2007)
న్యూ ఇంగ్లాండ్ ఇండిపెండెంట్ PEN అవార్డు : "Averno'Avernoఅవెర్నో" (2007)
లాస్ ఏంజిల్స్ టైమ్స్ బుక్ ప్రైజ్ : "కవితలు: 1962-2012" (2012)
జాతీయ పుస్తక పురస్కారం: "Faithful and Virtuous Night" (2014)

మూలాలు

[మార్చు]
  1. "All Nobel Prizes 2020". NobelPrize.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-12.
  2. "అమెరికన్ కవయిత్రి లూయిస్‌ గ్లక్‌ కు సాహిత్యంలో నోబెల్". 10TV. 2020-10-08. Archived from the original on 2020-10-13. Retrieved 2020-10-12.
  3. "Anorexia nervosa - Symptoms and causes". Mayo Clinic (in ఇంగ్లీష్). Retrieved 2020-10-12.
  4. "నోబెల్ సాహిత్య విజేత లూయిస్ గ్లూక్‌". ntnews. 2020-10-08. Retrieved 2020-10-12.
  5. "ETV Bharat". www.etvbharat.com. Retrieved 2020-10-12.
  6. Foundation, Poetry (2020-10-12). "Louise Glück". Poetry Foundation (in ఇంగ్లీష్). Retrieved 2020-10-12.
  7. https://www.nobelprize.org/prizes/literature/2020/bio-bibliography/
  8. "ఆత్మాశ్రయ కవిత్వానికి నోబెల్‌ | Prajasakti". www.prajasakti.com. Retrieved 2020-10-12.