Jump to content

వికీపీడియా:పేరుబరి

వికీపీడియా నుండి
వికీపీడియా డేటా స్ట్రక్చర్
సబ్జెక్టు పేరుబరులు చర్చ పేరుబరులు
0 (ప్రధాన/వ్యాసం) చర్చ 1
2 వాడుకరి వాడుకరి చర్చ 3
4 వికీపీడియా వికీపీడియా చర్చ 5
6 దస్త్రం దస్త్రంపై చర్చ 7
8 మీడియావికీ మీడియావికీ చర్చ 9
10 మూస మూస చర్చ 11
12 సహాయం సహాయం చర్చ 13
14 వర్గం వర్గం చర్చ 15
100 వేదిక వేదిక చర్చ 101
118 [[వికీపీడియా:డ్రాఫ్టులు|]] 119
710 TimedText TimedText talk 711
828 మాడ్యూల్ మాడ్యూల్ చర్చ 829
రద్దైనవి
2300 [[వికీపీడియా:గాడ్జెట్|]] 2301
2302 [[వికీపీడియా:గాడ్జెట్|]] 2303
-1 ప్రత్యేక
-2 మీడియా

వికీపీడియాలో పేరుబరి అనేది వికీపీడియా పేజీల సముదాయం. ఈ పేజీల పేర్లు మీడియావికీ సాఫ్ట్‌వేర్ నిర్దుష్టంగా నిర్వచించిన పదంతో (ఆ తరువాత ఒక కోలన్) ప్రారంభమవుతాయి. ఉదాహరణకు, వాడుకరి పేరుబరిలో ఉన్న పేజీల పేర్లన్నీ వాడుకరి: అనే ఉపసర్గతో మొదలవుతాయి. విజ్ఞానసర్వస్వ వ్యాసాలు ఉండే వ్యాసం (లేదా ప్రధాన) పేరుబరి విషయంలో, నిర్వచించిన పదం గానీ, కోలన్ గానీ ఉండవు. (గమనిక: ప్రధానబరిలో ఉన్న వ్యాసాలకు ముందు కావాలనుకుంటే కోలన్‌ని చేర్చవచ్చు. అంచేత [[వ్యాసం]] అని రాసినా, [[:వ్యాసం]] అని రాసినా ఈ రెండూ ఒకటే, తేడా ఏమీ లేదు. ప్రధానబరిలో ఉన్న ఒక వ్యాసం పేజీని మరొక పేజీలోకి ట్రాన్స్‌క్లూడు చేసేటపుడు మాత్రమే ఇలా కోలన్ వాడాల్సిన అవసరం ఉంటుంది.)

వికీపీడియాలో 30 ప్రస్తుత పేరుబరులు ఉన్నాయి: 14 సబ్జెక్ట్ పేరుబరులు, 14 సంబంధిత టాక్ పేరుబరులు, 2 వర్చువల్ పేరుబరులు. వీటిని కుడి వైపున ఉన్న పెట్టెలో చూడవచ్చు. వికీపీడియాలో సర్ఫింగ్ చేస్తున్నప్పుడు, పేరుబరుల జాబితా రెండు క్లిక్‌లలో అందుబాటులో ఉంటుంది: వెతుకు పెట్టెలో ఏమీ ఇవ్వకుండా వెతికి, ఆపై ఫలితాల పేజీలో "దీనిలో వెతుకు:" ను నొక్కితే, పేరుబరుల జాబితా కనిపిస్తుంది. ఈ జాబితా అవసరమైన చోట్ల డ్రాప్‌డౌన్ మెనూలలో కూడా అందుబాటులో ఉంటుంది, ఉదాహరణకు, Special:Prefixindex, Special:Allpages, Special:Recentchanges, Special:Contributions .

వికీపీడియా కోసం WP, వికీపీడియా చర్చ కోసం WT అనే మారుపేర్లు కూడా పనిచేస్తాయి. వెతుకు పెట్టెలోను, లింకులిచ్చేటపుడు, పేజీల్లో చేర్చడానికీ కూడా ఇవి పనిచేస్తాయి. చూడండి మారు ఇతర మారుపేర్ల కోసం క్రింద. (సహాయం కోసం H, వర్గం కోసం CAT వంటి మిధ్యా పేరుబరుల వాడకం చాలా తక్కువ. క్రింద సూడో-పేరుబరులను చూడండి. )

మీరు మీ వీక్షణ జాబితాలో ఉన్న పేజీలను దాచాలనుకున్నప్పుడు ఏ పేరుబరి కోసం ఏ సంఖ్యను వాడాలో కుడి వైపున ఉన్న పట్టిక చూసి తెలుసుకోవచ్చు. వివరాల కోసం చూడండి: వికీపీడియా:వాచ్ లిస్ట్‌లో పేజీలను దాచడం.

ఇంతకుముందు, ఫ్లో ప్రాజెక్ట్ కోసం టాపిక్ పేరుబరి అందుబాటులో ఉండేది గానీ ఈ వికీలో దాన్ని ఆఫ్ చేసారు.

సబ్జెక్ట్ పేరుబరులు

[మార్చు]
ఈ పేజీ వికీపీడియా పేరుబరిలో ఉంది .

పేరుబరుల ద్వారా కంటెంట్ పేజీలను నిర్వహణ పేజీలనూ వేరు చేయడానికి, ఒక పద్ధతిలో పేర్చడానికీ వీలు కలుగుతుంది. పేరుబరులు వికీపీడియా సమాచారాన్ని వికీ పాఠకుల కోసం ఉద్దేశించిన కోర్ సెట్‌లు గాను, ఎడిటింగ్ కమ్యూనిటీ కోసం ఉద్దేశించినవి గానూ వేరు చేస్తాయి. వికీపీడియా సబ్జెక్ట్ పేరుబరులు, వాటి విధులాను క్రింద, క్లుప్త వివరణతో సహా ఇచ్చాం. మరింత సమాచారం కోసం అక్కడున్న లింకు చూడండి.

పేరుబరిని సంక్షిప్తంగా బరి అని కూడా పిలుస్తారు. సబ్జెక్ట్ పేజీ, దాని చర్చా పేజీ కలిసి ఒక జత అవుతాయి

వాడుకలో ఉన్న పేరుబరులు

[మార్చు]
  • ప్రధాన పేరుబరి (ఉపసర్గ లేదు): అన్ని విజ్ఞానసర్వస్వ వ్యాసాలు, జాబితాలు, అయోమయ నివృత్తి పేజీలు, విజ్ఞానసర్వస్వ దారిమార్పులూ ఈ పేరుబరిలో ఉంటాయి. దీన్ని "ప్రధానబరి" అనీ "వ్యాసం" అనీ అంటారు.
  • వాడుకరి పేరుబరి (ఉపసర్గ వాడుకరి: ): వ్యక్తిగత వాడుకరులు వారి వ్యక్తిగత ఉపయోగం కోసం సృష్టించిన వాడుకరి పేజీలు, ఇతర పేజీలూ ఇందులో ఉంటాయి. ఈ పేరుబరిలో ఉన్న పేజీలను ఇతరులు చూడవచ్చు, దిద్దుబాట్లూ చెయ్యవచ్చు. అందుచేత సున్నితమైన సమాచారం ఏదీ ఈ పేజీల్లో పెట్టవద్దు.
  • వికీపీడియా పేరుబరి లేదా ప్రాజెక్ట్ పేరుబరి (ఉపసర్గ వికీపీడియా: ): వికీపీడియా ప్రాజెక్టుతో సంబంధమున్న అనేక రకాల పేజీలు ఇందులో ఉంటాయి: సమాచారం, విధానాలు, మార్గదర్శకాలు, వ్యాసాలు, ప్రక్రియలు, చర్చలు మొదలైనవి. పేరుబరి మారుపేర్లు : WP: లేదా Project:
  • దస్త్రం పేరుబరి (ఉపసర్గ దస్త్రం: ): మీడియా ఫైళ్ళు (చిత్రాలు, వీడియోలు, ఆడియో దస్త్రాలు) వాటి వివరణ పేజీలూ ఇందులో ఉంటాయి. [[దస్త్రం: తో ప్రారంభమయ్యే లింకు ఉన్న చోట సంబంధిత మీడియాను చూపిస్తుంది. అలా దత్స్రాన్ని చూపించకుండా కేవలం లింకు మాత్రమే ఇవ్వాలంటే, [[:దస్త్రం: ( కోలన్ ట్రిక్ ) అని రాయాలి. పేరుబరి మరోపేరు: Image:
  • మీడియావికీ పేరుబరి ( ఉపసర్గ మీడియావికీ: ): ఆటోమాటిగ్గా తయారయ్యే పేజీలలో కనిపించే లింకులు, సందేశాల వంటి ఇంటర్‌ఫేస్ పాఠ్యాలను కలిగి ఉండే పేరుబరి ఇది. ఈ పేరుబరిలోని పేజీలు సాధారణ వినియోగదారులు సవరించకుండా, శాశ్వత సంరక్షణలో ఉంటాయి. ఈ సందేశాల జాబితా కోసం, ప్రత్యేక:AllMessages చూడండి. (ఉపసర్గను "MW"కి కుదించడం సాధ్యం కాదు ఎందుకంటే mw అనేది అంతర్వికీకి ఉపసర్గ. దిగువన ఉన్న ఇంటర్‌వికీ లింక్‌లను చూడండి. )
  • మూస పేరుబరి (ఉపసర్గ మూస: ): ఇందులో మూసలు ఉంటాయి. వేరే పేజీల్లో ట్రాన్ప్ర&స్‌క్లూడు చేసేందుకు, లేదా సబ్‌స్టిట్యూట్ చేసేందుకూ ఉద్దేశించిన పేజీలివి. ఉదాహరణకు: ఒక ప్రామాణిక సందేశాన్ని గాని, సమాచారపెట్టెలు, నేవిగేషను పెట్టెలను గానీ చేర్చే పేజీలు.
  • సహాయం పేరుబరి (ఉపసర్గ సహాయం: ): వికీపీడియాను, దాని సాఫ్ట్‌వేర్‌నూ ఉపయోగించడంలో సహాయం అందించే పేజీలు ఇందులో ఉంటాయి. విజ్ఞానసర్వస్వ పాఠకులు, సంపాదకులు ఇద్దరికీ ఇవి ఉపయోగపడతాయి.
  • వర్గం పేరుబరి (ఉపసర్గ వర్గం: ): వర్గం పేజీలుంటాయి. సంబంధిత పేజీలు, ఉపవర్గాల జాబితాలు ఈ పేఝీల్లో ఉంటాయి. వర్గం గురించి వివరించే క్లుప్తమైన వచనం కూడా ఉండవచ్చు. [[వర్గం: అని రాస్తే ఆ పేజీని పేర్కొన్న వర్గానికి జోడిస్తుంది. ఆ వర్గం పేజీకి వికీలింకు లాగా ఇవ్వాలంటే, కోలన్ ట్రిక్ వాడాలి, ఇలా: [[:వర్గం: .
  • వేదిక పేరుబరి ( ఉపసర్గ వేదిక: ): పాఠకులకు నిర్దిష్ట అంశానికి సంబంధించిన వ్యాసాలను కనుగొనడంలో సహాయపడేలా ఈఇందులోని పేజీలుంటాయి. అలాగే ఆయా అంశాలకు సంబంధించిన వికీప్రాజెక్ట్‌ఉలకు తోడ్పాటు నందించేలా ప్రోత్సహించే లింకులుంటాయి .ఉదాహరణకు, వేదిక:తెలుగు సినిమా వేదిక:ఫోటోగ్రఫి. ఇది ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో లేదు.
  • డ్రాఫ్ట్ పేరుబరి (ప్రిఫిక్స్ డ్రాఫ్ట్: ): కొత్త (సంభావ్య) వికీపీడియా వ్యాసాల చిత్తుప్రతులు ఇందులో ఉంటాయి. ఇది ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో లేదు.
  • TimedText పేరుబరి (ఉపసర్గ TimedText: ): మీడియా ఫైల్‌ల కోసం సమకాలీకరించబడిన ఉపశీర్షికలు. ఇది ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో లేదు.
  • మాడ్యూల్ పేరుబరి (ఉపసర్గ మాడ్యూల్: ): Scribunto మాడ్యూల్‌లు ఉంటాయి. మీడియావికీ, దాని పొడిగింపులతో చేర్చబడిన ప్రాథమిక సెట్‌కు మించి మూసలలో ఉపయోగించేందుకు ప్రత్యేక ప్రయోజన పార్సర్ ఫంక్షన్‌లను అమలు చేసే లువా (Lua) స్క్రిప్ట్‌లు ఇందులో ఉంటాయి.

చర్చ పేరుబరులు

[మార్చు]

పైన పేర్కొన్న ప్రతి పేరుబరికీ (వర్చువల్ పేరుబరులు కాకుండా) అనుబంధంగా ఒక చర్చ పేరుబరి ఉంటుంది. వీటిని వీటిని చర్చా పేజీలు అంటారు. పేరుబరి పేరుకు పక్కన చర్చ అని చేర్చితే సంబంధిత చర్చ పేరుబరి అవుతుంది. ఉదాహరణకు, వాడుకరి పేరుబరికి చెందిన చర్చ పేరుబరికి వాడుకరి చర్చ: అనే ఉపసర్గ ఉంటుంది. వ్యాసం పేరుబరికి అనుబంధంగా ఉండే చర్చ పేరుబరి చర్చ: .

చర్చా పేరుబరుల్లోని చాలా పేజీలు అనుబంధిత పేరుబరిలోని సంబంధిత పేజీలో మార్పులను చర్చించడానికి ఉపయోగపడతాయి. వాడుకరి చర్చ పేరుబరిలోని పేజీలు నిర్దిష్ట వాడుకరికి సందేశాలను పంపడానికి ఉపయోగిస్తారు. వాడుకరి చర్చ పేరుబరి ప్రత్యేకత ఏమిటంటే, అ పేజీలో ఎవరైనా ఏమైనా రాస్తే, ఆ వాడుకరి తన చర్చా పేజీని చూసేవరకూ వారు చూసే ప్రతి పేజీలోనూ పైన "మీకు కొత్త సందేశాలు ఉన్నాయి" అనే నారింజ రంగు పెట్టె కనిపిస్తూ ఉంటుంది. డిఫాల్ట్‌గా, లాగిన్ అయిన వాడుకరులకు ఎరుపు నోటిఫికేషన్ చతురస్రం, పేజీకి పైన కుడి మూలలో చిన్న నారింజ పెట్టె కనబడుతుంది. చూస్తారు; IP వాడుకరులకు పేజీ పైన విశాలమైన నారింజ రంగు పెట్టెను మాత్రమే చూస్తారు. (బాట్‌లు చేసిన చిన్నపాటి సవరణల వలన కొత్త సందేశ పట్టీ కనబడదు. లాగిన్ అయిన వాడుకరులు, కొత్త సందేశ పట్టీ కనబడకుండా ప్రత్యేక:అభిరుచులను మార్చుకోవచ్చు.)

WP: అనేది వికీపీడియాకు విస్తరించినట్లే, WT: ఉపసర్గ వికీపీడియా చర్చ: కి విస్తరిస్తుంది. (క్రింద ఉన్న మారుపేర్లను చూడండి). ఉదాహరణకు, [[WT:నిర్ధారత్వం]] అంటే వికీపీడియా చర్చ:నిర్ధారత్వం .

వర్చువల్ పేరుబరులు

[మార్చు]

సబ్జెక్ట్ పేరుబరులు, వాటి సంబంధిత చర్చ పేజీలతో పాటు, ప్రత్యేక ప్రయోజనాల కోసం రెండు వర్చువల్ పేరుబరులు (వాటికి చర్చా పేజీలు ఉండవు) కూడా ఉన్నాయి:

ప్రత్యేక

[మార్చు]

స్పెషల్: పేరుబరిలో ప్రత్యేకం:ఇటీవలి మార్పులు వంటి సాఫ్ట్‌వేర్ సృస్ఝ్ఃతించే పేజీలుంటాయి (వీటిని ప్రత్యేక పేజీలు అని పిలుస్తారు). ఈ పేజీలు పారామితులు ఉన్నపుడు తప్ప, ఇతర పేజీల్లానే వీటికీ లింకు ఇవ్వవచ్చు [[ప్రత్యేక:ఇటీవలి మార్పులు]] లాగా. పారామితులను ఉపయోగించాలంటే, పూర్తి URL తప్పనిసరిగా బాహ్య లింక్‌గా ఇవ్వాలి. ఉదాహరణకు, https: //te.wikipedia.org /w /index.php?title=Special:Recentchanges&days=3&limit=10, ఇది గత మూడు రోజులలో చేసిన పది మార్పులను చూపిస్తుంది.

ప్రత్యేక పేజీకి దారిమార్పును సృష్టించవచ్చు. కానీ ఈ దారిమార్పు ఆటోమాటిగ్గా గమ్యం పేజీకి దారితీయదు.

ప్రత్యేక పేజీల జాబితా కోసం, ప్రత్యేక:ప్రత్యేకపేజీలు చూడండి.

అంతర్వికీ, భాషాంతర లింకులు

[మార్చు]

అంతర్వికీ, భాషాంతర ఆదిపదాలు పేరుబరులను నిర్వచించవు, కానీ te.wikipedia.org వెబ్‌సైట్ వెలుపల ఉన్న ఇతర వికీమీడియా ప్రాజెక్ట్‌లలోని పేజీలను సూచించేందుకు వీటిని వాడుతారు. వాటికి లింకులిచ్చేందుకు పేరుబరి లాంటి ఉపసర్గ సాంకేతికతను ఉపయోగిస్తున్నందున వాటిని ఇక్కడ పేర్కొన్నాం. అంతర్వికీ ఉపసర్గలకు ఉదాహరణలు w: వికీపీడియా కోసం; m: (లేదా meta: ) Meta-Wiki కోసం, mw: మీడియావికీ, wikt: విక్షనరీ కోసం. భాషాంతర ఆదిపదాలకు ఉదాహరణలు en: ఆంగ్ల భాష కోసం, ta: తమిళ భాష కోసం మరియు ml: మలయాళ భాష కోసం.

గమనించవలసిన ముఖ్యమైన అంశాలు:

  • ఇంటర్‌వికీ ఉపసర్గ ఉండి, ఇంటర్‌లాంగ్వేజ్ ప్రిఫిక్స్ లేనట్లైతే, ఆ లింకు అందులో పేర్కొన్న ప్రాజెక్టుకు, ప్రస్తుత భాషలోనే ఉన్నదానికి వెళ్తుంది. అంటే [[w:అంతర్జాలం]] అనే లింకు తెలుగు భాషలో ఉన్న ఏ వికీమీడియా ప్రాజెక్ట్‌లో (వికీసోర్స్, వికీబుక్స్, వగైరా) ఉన్నా సరే.., తెలుగు వికీపీడియాలో ఉన్న "అంతర్జాలం" అనే పేజీకి వెళ్తుంది.
  • భాషాంతర ఆదిపదం ఉండి, అంతర్వికీ ఉపసర్గ లేకుంటే, ప్రస్తుత ప్రాజెక్టు లోనే పేర్కొన్న భాషకు లింకు అవుతుంది. అంటే [[:en:Internet]] అనే లింకు ఏ భాషకు చెందిన వికీపీడియా ప్రాజెక్ట్‌లో ఉన్నా సరే, అది ఇంగ్లీషు వికీపీడియా లోని "Internet "కి వెళ్తుంది.

ఇతర భాషా వికీపీడియాలకు లింక్‌లు ఇచ్చినప్పుడు, ఆ లింకు పక్కపట్టీ లోని "భాషలు" అనే శీర్షిక కింద కనిపిస్తుంది. అలా కాకుండా ఆ లింకు పాఠ్యం లోనే కనిపించాలంటే, ముందు కోలన్‌ పెట్టండి. మరింత వివరం కోసం సహాయం:కోలన్ ట్రిక్ చూడండి. అంటే [[:en:Internet]] అనేది ఇంగ్లీషు వికీపీడియాలో "ఇంటర్నెట్ "కి ఇన్‌లైన్ లింకు అవుతుంది. అయితే ఇంటర్‌వికీ ఉపసర్గను కూడా ఉపయోగించినపుడు ఇది ఇవ్వనక్కరలేదు. ఉదాహరణకు [[w:en:Internet]] అనేది ఇన్‌లైన్ లింకు అవుతుంది.

ప్రోగ్రామింగ్

[మార్చు]

ఆంగ్ల వికీపీడియాలోని 32 పేరుబరులు ప్రోగ్రామింగ్ ప్రయోజనాల కోసం లెక్కించబడ్డాయి. ప్రతి పేరుబరి యొక్క ఉపసర్గ క్రింది పట్టికలో చూపిన విధంగా {{ns: xx }} రూపంలో చమత్కార పదం {{ns}} ఉపయోగించి రూపొందించబడింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]