Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/వర్గాల సంస్కరణ

వికీపీడియా నుండి

ఇది వికీపీడియా:వికీప్రాజెక్టు/వర్గీకరణ అనే గొడుగు ప్రాజెక్టులో భాగం. ఈసరికే ఉన్న వర్గాల్లో ఉన్న వివిధ సమస్యలను సవరించి తెవికీ పేజీలను సరైన విధంగా వర్గీకరించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

ఈ ప్రాజెక్టులో చెయ్యాలని తలపెట్టిన పనులు

[మార్చు]

ఈ ప్రాజెక్టు ద్వారా కింది పనులు చెయ్యాలని తలపెట్టాం.

  • పెద్ద సంఖ్యలో ఎర్రవర్గాలు ఉన్నాయి. అంటే వీటికి మాతృవర్గాలు లేవు, వర్గ వివరణ కూడా లేదు. కానీ ఈ వర్గాల్లోకి పేజీలను చేర్చారు (ప్రత్యేక:కోరినవర్గాలు). వీటిలో అవసరం లేని వర్గాలను ఖాళీచేసి, తొలగించడం. అవసరమైన వాటికి వర్గ వివరణ చేర్చి, వర్గీకరించడం.
  • వర్గీకరించని వర్గాలున్నాయి. వీటికి వర్గ వివరణ ఉంది (అంటే పేజీ ఉనికిలో ఉంది), కానీ వర్గీకరణ జరగలేదు. (ప్రత్యేక:వర్గీకరించనివర్గములు). వీటిలో అవసరం లేని వాటిని ఖాళీ చేసి తొలగించడం లేదా తొలగింపు CSD మూస పెట్టడం. మిగిలిన వాటిని వర్గీకరించడం.
  • ఒకే రకమైన పేజీలను వర్గీకరించేందుకు ఒకటి కంటే ఎక్కువ వర్గాలున్నాయి. ఉదా: వర్గం:భారతీయ మహిళా రచయితలు, వర్గం:భారతీయ రచయిత్రులు ఈ వర్గాల్లోని పేజీలను ఒకే వర్గం లోకి చేర్చి, రెండవ వర్గాన్ని తొలగించడం.
  • వర్గాల పేర్లను ప్రామాణీకరించడం. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ (మధ్యలో స్పేసు ఉండడం ఉండకపోవడం) కర్నాటక, కర్ణాటక, నృత్య కళాకారులు/నృత్యకళాకారులు/నాట్య కళాకారులు వగైరా పేర్లతో వచ్చే వర్గాలు. ఈ పేర్ల కోసం ఒక ప్రామాణికమైన పద్ధతి ఎంచుకోవడం.

పనిచేసే పద్ధతులు

[మార్చు]

ఈ ప్రాజెక్టులో చేపట్టే పనులు ఎలా చెయ్యాలి అనేది చూద్దాం.

ఎర్రవర్గాల సంస్కరణ

[మార్చు]

ఎర్రవర్గాల జాబితా ప్రత్యేక:కోరినవర్గాలు అనే ప్రత్యేక పేజీలో ఉంది. ఎర్రవర్గం అంటే

  • ఆ వర్గానికి పేజీని ఇంకా సృష్టించలేదు.
  • కానీ అందులో పేజీలను చేర్చారు. అంటే ఆ పేజీల్లో ఈ వర్గం ఎర్ర రంగులో కనిపిస్తుంది.

హాట్‌కేట్‌ ద్వారా ఏదైనా పేజీలో వర్గాలను చేర్చేటపుడు టైపు చేసేటపుడే వర్గాల పేర్లను సూచిస్తుంది గదా.., ఆ సూచనల్లో ఈ ఎర్రవర్గాలను చూపించదు. కానీ విజువల్ ఎడిటరు ద్వారా వర్గాలను చేఋచే పెట్టెలో మాత్రం ఎర్రవర్గాలను కూడా చూపిస్తుంది. ఇందులో తర్కం ఏంటో తెలీదు.., ఇది బహుశా సాఫ్టువేరు ఎనామలీ అయి ఉండవచ్చు.

ఇప్పుడు ఎర్రవర్గాలను ఎలా సంస్కరించాలి

[మార్చు]

ఎర్రవర్గాలను సంస్కరణలో కింది పరిష్కారాలున్నాయి

  1. ఆ వర్గాల్లో ఉన్న పేజీలను వేరే సముచిత వర్గానికి మార్చి ఈ వర్గాన్ని ఖాళీ చెయ్యడం. ఖాళీ చెయ్యగానే ఇక ఈ వర్గం ఆటోమాటిగ్గా ఉనికిలో లేకుండా పోతుంది. ఇక ప్రత్యేకించి వర్గాన్ని తొలగించనక్కర్లేదు
  2. వర్గం పేరు సముచితంగానే ఉంది, అది ఉండాల్సిన వర్గమే అని మీరు భావిస్తే, ఆ వర్గానికి పేజీని సృష్టించాలి. అంటే - దాన్ని ఒక మాతృవర్గం లోకి చేర్చడం, దానికి ఒక వర్గవివరణ ఇవ్వడం చెయ్యాలి.
ఒక ఉదాహరణ చూద్దాం.
వర్గం:భారత చలనచిత్ర నటీమణులు అనే వర్గంలో 26 పేజీలున్నాయి. కానీ వర్గం పేజీని ఇంకా సృష్టించలేదు. కాబట్టి ఇది ఎర్రవర్గాల జాబితా లోకి చేరింది. ఇప్పుడు దీని ఏం చెయ్యాలి. పేరుయ్ చూస్తే బాగానే ఉంది. పైగా 26 పేజీలున్నాయి. మరి ఎర్రవర్గంగా ఎందుకు ఉంచేసాం? ఇలాంటిదే వేరే వర్గం ఉందేమో చూద్దాం.. "భారతీయ చలనచిత్ర నటీమణులు", "భారత సినిమా నటీమణులు", "భారతీయ సినిమా నటీమణులు" ఇలా వేరే పేర్లతో వర్గాలున్నాయా..? ఉంది! వర్గం:భారతీయ సినిమా నటీమణులు అనే వర్గం ఉనికిలో ఉంది. 18 ఉపవర్గాలతో దాదాపు వెయ్యి పేజీలతో నిండుగా ఉంది. పరిష్కారం దొరికేసింది. పేజీలన్నిటినీ ఈ వర్గం లోకి చేర్చేసి ఎర్రవర్గాన్ని వదిలెయ్యడమే. పేజీలన్నిటినీ వర్గం లోంచి తీసెయ్యగానే ఎర్రవర్గం ఆటోమాటిగ్గా ఆనవాళ్ళు లేకుండా పోతుంది, మనమేమీ చెయ్యనక్కర్లేదు.
ఇలాంటిదే మరొకటి
వర్గం:భారత టెలివిజన్ నటీమణులు అనే ఎర్రవర్గంలో 24 పేజీలున్నాయి. కానీ వర్గం:భారతీయ టెలివిజన్ నటీమణులు అనే వర్గంలో 2 ఉపవర్గాలు, 130 కి పైగా పేజీలూ ఉన్నాయి. దీనికి కూడా పై మందే వెయ్యాలి.
మరొక ఉదాహరణ
వర్గం:భారతదేశం లోని తాలూకాలు అనే ఒక ఎర్ర వర్గం ఉంది. అందులో 26 పేజీలున్నాయి. పేరు సరిగానే ఉంది. మరి ఎర్రవర్గంగా ఎందుకుంది? వేరే పేరుతో ఇలాంటి వర్గమే ఉందా? తాలుకాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయం మండలం ఆ పేరుతో మనకు మండలాల వర్గం ఉంది. అందులో వీటిని చేఋచలేం. పోనీ "తహసీల్" పేరుతో వర్గాలున్నాయా? లేవు! పోనీ "తాలూకా" / "తాలూకాలు" పేరుతో వ్యాసాల పేజీలు ఎన్నున్నాయి? (అవే గదా ఈ వర్గంలో చేరాల్సినది!) రెండే పేజీలున్నాయి! చాలా తక్కువ. ఈ మాత్రానికి వర్గమెందుకు? భవిష్యత్తులో పేజీలు వచ్చే అవకాశం ఉందా? ఉంది, తెలుగు రాష్ట్రాల్లో మండలాలకు పేజీలు పెట్టినట్టుగానే ఇతర రాష్ట్రాల్లో తాలూకాలకూ పేజీలు రావచ్చు. అలా వస్తే 600 కు పైగా వర్గాలు, 3 వేలకు పైగా పేజీలూ వచ్చే అవకాశం ఉంది. అంచేత ఈ వర్గాన్ని సృష్టించాలి. తెలుగు రాష్ట్రాల మండలాల శీర్షవర్గాలను కూడా ఇందులో చేర్చవచ్చు. పేరు బాగానే ఉంది కాబట్టి ఈ పేరు తోటే సృష్టించవచ్చు.
ఇంకో ఉదాహరణ
28 పేజీలతో వర్గం:స్వాతంత్ర్య పూర్వ సంస్థలు అనే వర్గం ఉంది. పేరులో భావం తెలుస్తోంది గానీ స్పష్టంగా లేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం రాక మునుపే ఏర్పాటైన సంస్థలు అని దీనికి అర్థం. మరింత స్పష్టంగా ధ్వనించే వర్గం ఏదైనా ఉందా అని చేస్తే ఏదీ కనబడలేదు. కాబట్టి ఈ వర్గాన్ని సృష్టించవచ్చు. కానీ ఈ పేరుతో కాదు.. "భారత స్వాతంత్ర్యానికి ముందు ఏర్పాటైన సంస్థలు" అనో "భారత స్వాతంత్ర్యానికి ముందు ఏర్పాటైన భారతీయ సంస్థలు" అనో మరింత స్పష్టంగా ఉండే వర్గాన్ని సృష్టించి ఈ పేజీలను ఆ వర్గం లోకి తరలీంచాలి.
ఇంకోటి
వర్గం:తెలుగు లలిత సంగీత ప్రముఖులు అనే ఎర్ర వర్గంలో 24 పేజీలున్నాయి. (అసలు భారతీయ సంగీతం అంటేనే లలితంగా ఉంటుంది. మళ్ళీ ఈ లలిత సంగీతం ఏంటో) ఈ బ్రాకెట్లో ఉన్న సందేహమే మీక్కూడా వస్తే, మామూలు సంగీతానికి ఈ లలిత సంగీతానికీ తేడా తెలీక పోతే.. ఇలా చెయ్యండి.
  • పేరులో "లలిత సంగీత", "సంగీత" అనే మాట ఉన్న వర్గాలు ఏంటో చూడండి.
    • "సంగీత" వర్గాలున్నాయి గానీ "లలిత సంగీత" అనేవి ఏమీ లేవు. వదిలెయ్యండి. తెలిసిన వాళ్ళు చూస్తారు. దాన్ని ప్రాజెక్టు చర్చ పేజీలో రాయండి.
    • ఉంది. ఈ ఎర్రవర్గం లోని పేజీలను అందులోకి చేర్చి, దీన్ని తీసేయవచ్చనుకుంటే చేసెయ్యండి

వర్గీకరించని పేజీలు

[మార్చు]

ప్రత్యేక:వర్గీకరించనివర్గములు పేజీలో వర్గీకరించని పేజీల జాబితా ఉంటుంది. అంటే ఈ వర్గాలకు వివరణ ఇచ్చి పేజీని సృష్టించారు. వీటిలో వ్యాసాలు కూడా ఉన్నాయి. కానీ ఈ వర్గాన్ని మాతృవర్గాల్లో చేర్చలేదు. వీటిని సరైన వర్గాల్లోకి చేర్చాలి. అలాగే కింది వర్గాలు కూడా ఉన్నాయి

వాడని వర్గాలు

[మార్చు]

వాడని వర్గాలు అనే ఒక ప్రత్యేక పేజీ ఉంది. ఈ వర్గాలు ఉనికిలో ఉన్నాయి గానీ, వీటిలో ఒక్క పేజీ కూడా లేదు. వీటిలో కొన్ని నిర్వహణ వర్గాలున్నాయి. అవి ఖాళీగా ఉన్నప్పటికీ ఉంఛాల్సిన వర్గాలే అయి ఉండవచ్చు. కొన్ని వర్గాలు అసలు ఖాళీగానే ఉండాల్సినవి అయి ఉండవచ్చు. కానీ, వీటిలో ఉన్న విజ్ఞాన సర్వస్వ వ్యాసాలకు సంబంధించిన వర్గాలు - ఖాళీగా ఉన్నాయి కాబట్టి - తొలగించవచ్చు. అయితే ఈ పని అంత ముఖ్యమైనది కాదు కాబట్టి వీలును బట్టి తరువాత చూసుకోవచ్చు.

వనరులు

[మార్చు]
  • ఎర్రవర్గాల జాబితా కోసం ప్రత్యేక:కోరినవర్గాలు అనే ప్రత్యేక పేజీ చూడవచ్చు. ఉండడానికి అనేక వేలో పేజీలు ఉన్నప్పటికీ, ఇందులో 5000 వరక్జే చూపిస్తుంది. అయితే
    • ఈ ఎర్రవర్గాల్లో కనీసం 3 పేజీలు చేరి ఉన్న వర్గాలు 1891 ఉన్నాయి.
    • 2 పేజీలున్న వర్గాలు 1312
    • ఇక మిగతావన్నీ ఒకటే పేజీ ఉన్న వర్గాలు
    • వీటిలో ఇంగ్లీషు పేరుతో ఉన్న వర్గాలు చాలానే ఉన్నాయి. పేజీలో ఉన్న మూస ద్వారా చేరే వర్గాలే వీటిలో ఎక్కువ. ముందు వీటిని పక్కన పెట్టి తెలుగు పేరుతో ఉన్న వర్గాలనే చూద్దాం. ఎక్కువ పేజీలున్న ఎర్రవర్గాలతో మొదలుపెట్టి ముందుకు పోదాం.
  • ఈ ఎర్రవర్గాల్లో కొన్ని కొట్టివేసినట్లు ఉంటాయి,. ఆ వర్గాల అంతు తేల్చేసారనీ, ఇక వాటిని పట్టించుకోనక్కరలేదనీ దాని అర్థం. వాటిని వదిలెయ్యవచ్చు. కొన్నాళ్ల తరువాత అవి ఈ జాబితా లోంచి పోతాయి.

కృషి చేసే వాడుకరులు

[మార్చు]

నిర్వహణ

[మార్చు]

చదువరి