వినోద్ కాంబ్లీ
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | వినోద్ గణపత్ కాంబ్లీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం | 1972 జనవరి 18|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి ఆఫ్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాట్స్ మాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు | 1993 జనవరి 29 - ఇంగ్లండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1995 నవంబరు 8 - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే | 1991 అక్టోబరు 18 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 అక్టోబరు 29 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1989–2011 | ముంబయి క్రికెట్ జట్టు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 4 |
వినోద్ గణపత్ కాంబ్లీ (ఆంగ్లం: Vinod Ganpat Kambli; 1972 జనవరి 18) మాజీ భారతీయ క్రికెటర్. ఆయన భారతదేశం తరపున మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా రాణించాడు. ప్రస్తుతం అతను క్రికెట్ నిపుణుడిగా, వివిధ టెలివిజన్ ఛానెల్‌లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.
జీవితం తొలి దశలో
[మార్చు]వినోద్ కాంబ్లీ ముంబైకి చెందినవాడు. అతను భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కి చిన్ననాటి స్నేహితుడు. వీరిరువురు కలసి పాఠశాల క్రికెట్ రోజుల్లో సెయింట్ జేవియర్స్ స్కూల్‌తో జరిగిన స్కూల్ క్రికెట్ మ్యాచ్‌లో 664 పరుగుల వర్షం కురిపించారు. వినోద్ కాంబ్లీ వ్యక్తిగతంగా 349 పరుగులతో దోహదపడ్డాడు. వారి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ ఈ జంటను ఇన్నింగ్స్ డిక్లేర్ చేయమని ఒత్తిడి చేశాడు. వినోద్ కాంబ్లీ సెయింట్ జేవియర్స్ మొదటి ఇన్నింగ్స్‌లో 37 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు.
కెరీర్
[మార్చు]వినోద్ కాంబ్లీ తాను ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్‌తో రంజీ ట్రోఫీ కెరీర్‌ను ప్రారంభించాడు. అతను 1991, 1992లలో వరుసగా వన్డే ఇంటర్నేషనల్, టెస్ట్ మ్యాచ్ లతో అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలతో సహా నాలుగు సెంచరీలు చేశాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 14 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.