విరామ చిహ్నాలు
Appearance
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
చదివేటప్పుడు, వ్రాసేటప్పుడు పదాల మధ్య, వాక్యాల మధ్య ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఆగాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలిపేవి విరామ చిహ్నాలు (Punctuation marks).
Hari
[మార్చు]- బిందువు (Full Stop): వాక్యం పూర్తయినప్పుడు, పూర్తి అయినట్లుగా సూచించడానికి బిందువు పెడతారు. దీని సూచిక (.).
- వాక్యాంశ బిందువు (Comma): చెప్పవలసిన అంశం ముగియనప్పుడు, అసమాపక క్రియలను వాడి వాక్యం వ్రాస్తున్నప్పుడు వాక్యాంశ బిందువు లేదా కామా ఉపయోగిస్తాము. దీని సూచిక (, ).
- అర్థ బిందువు (Semi Colon): ఒక పెద్ద వాక్యములో భాగంగా ఉండే చిన్న వాక్యాల చివర అర్థ బిందువు వస్తుంది. దీని సూచిక (;).
- న్యూన బిందువు (Colon): వాక్యాలలో వరుసగా కొన్ని పదాల పట్టిక ఇచ్చుటకు ముందు న్యూన బిందువు ఉపయోగిస్తారు. దీని సూచిక (:).
- అనుకరణ చిహ్నాలు (Quotation Marks): ఒకరు అన్న మాట ఇంకొకరు చెప్పుచున్నప్పుడు, వేరే ఏదో ఒక గ్రంథం నుండి తీసిన వాక్యాలు చెప్పునప్పుడు అనుకరణ చిహ్నాలు వాడతాము. దీని సూచిక ( " " ).
- ప్రశ్నార్థకం (Question Mark): ఏదైనా విషయాన్ని గురించి ఎదుటి వారిని అడిగేటప్పుడు ఆ వాక్యం చివర ప్రశ్నార్థకం ఉపయోగిస్తారు. దీని సుచిక (?).
- ఆశ్చర్యార్థకం (Exclamatory Mark): ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, భయాన్ని, వింతను, మెచ్చుకోలును తెలిపే పదాల చివర ఆశ్చర్యార్థకం ఉపయోగిస్తారు. దీని సూచిక (!).
- పొడవు గీత (EM Dash): వాక్యంలో వచ్చే విషయాలు వివరణ ఇచ్చేటప్పుడు పొడవు గీత వాడతాం. దీని సూచిక (-).
- కుండలీకరణం (Bracket): భాషా పదాల వివరణ నిచ్చుటకు, ఇతర నామాలు తెలుపుటకు, వివరణ నిచ్చుటకు కుండలీకరణాలను ఉపయోగిస్తారు. దీని సూచిక (( )) .
- మూడు చుక్కలు: చెప్పవలసిన మాటలు లోపించినప్పుడు అక్కడ ఏవో మాటలున్నాయని సూచించడానికి ఈ మూడు చుక్కలను ఉపయోగిస్తారు. దీని సూచిక (...) .
వాడే తీరు
[మార్చు]పైన ఉన్న విరామ చిహ్నాలని వాడే సంప్రదాయం మనకి ఇంగ్లీషు నుండి వచ్చింది. ఈ సంప్రదాయం ప్రకారం ఈ కింది నియమాలని పాటించాలి.
- వాక్యం పూర్తి అవగానే, ఆఖరి అక్షరం తరువాత, వెనువెంటనే, బిందువుని పెట్టాలి. అనగా, ఆఖరి అక్షరం తరువాత ఒక ఖాళీ వదలి అప్పుడు బిందువు పెట్టకూడదు. బిందువు పెట్టిన తరువాత తప్పనిసరిగా కనీసం ఒక ఖాళీ జాగా (blank space) వదలి, తరవాత వాక్యం మొదలు పెట్టాలి. అనగా, బిందువు తరువాత, వెనువెంటనే, కొత్త వాక్యం మొదలవదు; ఒక ఖాళీ తరువాత మొదలవుతుంది.
- అంశ బిందువు వాడే నియమం కూడా పై విధంగానే ఉంటుంది. అంశ బిందువు పెట్టిన తరువాత తప్పనిసరిగా కనీసం ఒక ఖాళీ జాగా (blank space) వదలి అప్పుడు వాక్యం కొనసాగించాలి. అనగా, అంశ బిందువు తరువాత, వెనువెంటనే, మిగిలిన వాక్యం కొనసాగదు; ఒక ఖాళీ తరువాత కొనసాగుతుంది.
- ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం వాడేటప్పుడు కూడా బిందువు వాడినప్పుడు వాడిన విధులనే పాటించాలి.
- అనుకరణ చిహ్నాలు రెండు రకాలు: ఏక గుర్తులు (single quotes), జంట గుర్తులు (double quotes). ఏ గుర్తు వాడినా తెరిచే గుర్తు (opening quote) వేసిన వెనువెంటనే పాఠం మొదలవుతుంది; గుర్తుకీ, పాఠ్యానికి మధ్య ఖాళీ జాగా ఉండదు. అదే విధంగా పాఠం పూర్తి అవగానే పాఠంలోని చివరి అక్షరానికీ ముగిసే గుర్తు (closing quote) కీ మధ్య ఖాళీ జాగా ఉండకూడదు. ఉదాహరణకి, ఏ మాటని అనుకరణ చిహ్నాలతో బంధిస్తున్నామో ఆ చిహ్నాలు ఆ మాటలో భాగం అన్నమాట.
- కుండలీకరణ చిహ్నాలు. ఏ గుర్తు వాడినా తెరిచే గుర్తు (opening bracket) వేసిన వెనువెంటనే పాఠం మొదలవుతుంది; గుర్తుకీ, పాఠానికి మధ్య ఖాళీ జాగా ఉండదు. అదే విధంగా పాఠం పూర్తి అవగానే పాఠంలోని చివరి అక్షరానికీ ముగిసే గుర్తు (closing bracket) కీ మధ్య ఖాళీ జాగా ఉండకూడదు. ఉదాహరణకి, ఏ వాక్య భాగాన్ని కుండలీకరణ చిహ్నాలతో బంధిస్తున్నామో ఆ చిహ్నాలు ఆ వాక్యంలో భాగం అన్నమాట.