వెబ్ ఛాట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:Mibbit Extension Screenshot.png
వెబ్ చాట్

వెబ్ ఛాట్ అనగా అంతర్జాలంలో ఒకరి ఇంకొక సమూహంతో పాల్గొనే చర్చావేదిక. ఈ సౌలభ్యాన్ని గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి వివిధ అంతర్జాల స్థలాలు, సాంప్రదాయక ఇంటర్నెట్ రిలే ఛాట్ నడుపువారుఅందచేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడనుండైనా అంతర్జాల అనుసంధానము ద్వారా ఒకరునొకరు కలుసుకొని, ఆసక్తిగల విషయాలపై చర్చించి ఉపయోగకరమైన ప్రణాళికలో పాల్గొనటానికి ఇది ఒక సదవకాశం. దీనిని రెండు రకాలుగా మనం విభజించవచ్చు. ఒక సమూహంలో సభ్యుడై వుండి అదే సమూహంలో ఒకరు అంతకంటే ఎక్కువమందితో సంభాషించడానికి ఉపయోగపడేది మొదటిది. ఏ సమూహంలో ఖాతా లేకుండా, స్వేచ్ఛగా జరిగే చర్చలలో పాల్గొనటానికి అవకాశం కలిగేది రెండవది.

సమూహ ఛాట్

[మార్చు]

మీరు గూగుల్ లో కాని, యూహూలోకాని చేరినప్పుడు, మీ మెయిల్ చూపించే తెరలో సత్వర సందేశ పట్టీ కూడా కనబడుతుంది. దానిలో మీతో ఈ మెయిల్లో సంపర్కంలో వుండే మీ స్నేహితులపేర్లు కనబడతాయి. ఒకవేళ కనబడకపోతే వారిని మీరు ఆహ్వానించవచ్చు. అలా కనబడేవారి ప్రస్తుత స్థితి (అందుబాటులో వున్నారా లేదా) రంగులతో తెలుస్తుంది. ఎవరైనా అందుబాటులోవున్నవారి పేరుపై రెండవ మౌస్ ని క్లిక్ చేస్తే, వారిని ఛాట్ (సంభాషణ) జరపటానికి అదేశం కనబడుతుంది.

స్వేఛ్చా ఛాట్

[మార్చు]

ఛాట్ లో వ్యక్తిగత ఖాతాలు, ప్రసార ఖాతాలు అని రెండురకాలు. మీరు ఒక సమూహంలో చేరి పంపే సందేశాలు వ్యక్తిగత ఖాతాల క్రిందికి, మీరు ఎవరికి ప్రత్యేకించి ఉద్దేశించకుండా పంపే సందేశాలు ప్రసారఖాతాలు క్రిందికి వస్తాయి. ఫ్రీనోడ్ (freenode) సైట్ లో చాలా పాతదైన ఇంటర్నెట్ రిలే ఛాట్ (irc) వ్యక్తిగత ఖాతాకి ఉదాహరణ, ట్విట్టర్ ప్రసార ఖాతాకి ఉదాహరణ. ప్రసార ఖాతాలో మీ సందేశాలు ప్రసారమే కాకుండా మీరు ఇంకొకరికి వుద్దేశించి లేక వారిని పేర్కొంటు సందేశాలు పంపవచ్చు.

ఇంటర్నెట్ రిలే ఛాట్ ను ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ లేక బ్రౌజర్ ద్వారా వాడవచ్చు. వాటిని గురించి వివరంగా తెలుసుకుందాము.

ఎంపథీ కక్షిదారు

[మార్చు]

ఉబుంటులో ఎంపథీ అనబడే అనువర్తనము ద్వారా, చాలా సత్వర సందేశిని వ్యవస్థలతో సంభాషించడానికి వీలవుతుంది. స్థాపన తర్వాత, మీ తెర పై పేనెల్ లో కుడివైపు కవరు ప్రతిమపై నొక్కి ఛాట్ మెనూ నొక్కితే మీరు ఖాతాలను జతపరచుకోవచ్చు. మీరు ఫ్రీనోడ్ ను ఎంచుకుంటే మీ నిక్ నేమ్ ప్రవేశపెట్టాలి. ఆ తరువాత నిక్ సర్వర్ లో /join #wikipedia-te నొక్కితే మీరు ఆ ఛాటింగ్ గదిలో చేరతారు. దానిలోనున్న వారు పంపే సందేశాలు మీరు చూడవచ్చు. మీరు సందేశాలు పంపవచ్చు.

వెబ్ ఛాట్

[మార్చు]

దీనిలో ప్రవేశించడానికి మీ విహరిణిలో వెబ్ ఛాట్ అంతర్జాల చిరునామా (ఉదాహరణకి http://webchat.freenode.net/ Archived 2010-12-22 at the Wayback Machine ) ప్రవేశపెట్టాలి. అప్పుడు అనుసంధానమయ్యేతెర కనబడుతుంది. దానిలో మీరు వాడదలచుకున్న ముద్దుపేరు, చేరాలనుకున్న సమావేశం (ఛానల్) పేరు ప్రవేశపెట్టి, మీరు యంత్రం కాదని నిర్థారించుటకు కేప్చాలో చూపించబడిన అక్షరాలను టైప్ చేసి కనెక్ట్ అనే అదేశం ప్రవేశపెట్టాలి. కేప్చాలో చూపించిన అక్షరాలు మీరు సరిగా గుర్తించలేనపుడు, రీలోడ్ (Reload) బొత్తాము (బటన్) నొక్కితే కొత్త కేప్చా చూపెట్టపడుతుంది. అలా మీరు ఎన్ని సార్లయినా ప్రయత్నించవచ్చు. అప్పుడు కొత్త తెరలో మీ వెబ్ ఛాట్ అభీష్టాలను తెలిపే బొమ్మ ప్రక్కన జారుడుపెట్టె గుర్తు, అనుసంధాన స్థితిని (Status) తెలిపే ఉపపేజి తర్వాత మీరు చేరిన ఛానల్ మెనూ (#wikipedia-te) కనబడతాయి. మీరు చేరిన ఛానల్ లో మీ పేరు కుడివైపు పట్టీలో కనబడుతుంది. మీరు సందేశాలను తెర క్రిందభాగంలో టైప్ చేసి ప్రవేశపెట్టవచ్చు. మీరు పంపిన, ఇతరులు పంపిన సందేశాలను కాలానుగుణంగా తెరపై చూపెట్టబడతాయి. ఒకవేళ మీరు వేరే పనిలోబడి ఈ తెర మరుగునపడేస్తే, మీరు ఛానల్ లో వాడిన పేరును ఇతరులు సందేశాలలో వాడినప్పుడు మీకు శ్రవణ మాధ్యమం ద్వారా లేక మీ విహరిణిలో ఈ తెరని చూపించే బొమ్మ వెలిగి ఆరిపోవడంద్వారా మీకు హెచ్చరికలు అందచేయబడ్తాయి. దీనికి మీ వ్యవస్థలో అడోబి ఫ్లాష్ ‌‌ప్లేయర్ స్థాపించివుండాలి. అది సరిగా వున్నదీ లేనిదీ పరిశీలించటానికి జాల చిరునామా వాడండి. ఆ తరువాత ధ్వని సమస్యలేదని నిర్ణయించుకోటానికి ఈ పరీక్షా పేజీలో Archived 2012-01-11 at the Wayback Machine రెండవ దృశ్య శ్రవణ ‌విషయాన్ని నడిపి చూడండి. మీరు ఛానల్ లో చేరినప్పుడు అక్కడున్న వారి పేరు వాడి హెచ్చరించండి. ఇక మీరు సంభాషించవచ్చు.

మరింత నేర్చుకోటానికి వెబ్ ఛాట్ పాఠం (ఇంగ్లీషు వికీపీడియా) చూడండి.

అదేశాలు

[మార్చు]
  • అదేశాలను '/' (ముందుకు వాలే గీత) తో ప్రారంభించాలి. మరిన్ని వివరాలకు ఇంగ్లీషు వికీ వ్యాసం [1] చూడండి.
  • మీ ఉద్వేగాలను, అలోచనలను మామూలు సంభాషణలా కాకుండా పంచుకోవాలంటే /me <అలోచన>
  • మీ పేరు ఫ్రీనోడ్ లో నమోదైన పేరుగా గుర్తించాలంటే Status ఛానల్ లో /msg NickServ identify <సంకేత పదం> . (కొన్ని అదేశాలు వాడటానికి, ఛానల్ నిర్వాహకులకు ఇది తప్పనిసరి.)
  • పాల్గొంటున్న సభ్యులలో ఒకరితో గుప్తంగా సంభాషించాలంటే /PRIVMSG < మాట్లాడగోరే వ్యక్తి వాడుకరిపేరు (తెరపై కుడివైపు కనిపిస్తున్నది) > < మీ సందేశం> (కోణపు బ్రాకెట్లులేకుండా వాటిలో వున్నవాటికి సంబంధించి రాయాలి)
  • సమావేశ నిర్వాహకుడికి అనుమతి వున్నట్లయితే నిర్వాహకత్వం కోసం అదేశం ఇవ్వాలి /msg chanserv op #wikipedia-te
  • ఆ తర్వాత /TOPIC <‌‌విషయం పేరు>తో చర్చా విషయం మార్చవచ్చు. అది తెరపై భాగంలో అందరికి కనిపిస్తూ చర్చ అర్థవంతంగా సాగటానికి తోడ్పుడుతుంది.

చిట్కాలు

[మార్చు]
  • సభ్యుల పేర్లను పూర్తిగా టైప్ చేయకుండా, ఒకటి రెండు అక్షరాలు టైపు చేసిన తరువాత టేబ్ నొక్కితే పూర్తి పేరు ప్రత్యక్షమవుతుంది. వాడుకరి పేరుసందేశంలో వున్నప్పుడు అది ప్రసారం చేసినప్పుడు ధ్వని మూలంగా, ఇతరత్రా వారికి హెచ్చరిక చేయబడుతుంది.
  • ఇతరులకు చాలా వరుసలు కల పాఠ్యాన్ని మీ కంప్యూటర్ లో కనపడినది చూపాలనుకుంటే తాత్కాలిక అతికింపుఅర (ఉదా: https://web.archive.org/web/20140112065300/http://pastebin.ca/ ) వాడి దానిలో మీరు చూపాలనుకున్న దానిని చేర్చి త ద్వారా వచ్చే జాల చిరునామా మీ చాట్లో వాడండి.

చాట్, టెక్స్ట్ మెసేజింగ్ సంక్షిప్త పదాలు

[మార్చు]
ఇంగ్లీషు సంక్షిప్త పదం ఇంగ్లీషు అర్థం తెలుగు అర్థం తెలుగు సంక్షిప్తపదం
A3 Anyplace, anywhere, anytime ఎక్కడయినా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఎఎఎ
ADN Any Day Now ఇప్పటి నుంచి ఏ రోజు అయినా
B4N Bye For Now ఇప్పటికి సెలవు
BF Boy Friend మగ స్నెహితుడు లేక ప్రియుడు / బ్లూ ఫిలిం లేక ఆశిలిన చిత్రం
CRB Come Right Back ఇదే సమయమునకు రా !
CU See You తిరిగి కలుద్దాము, శలవు.
CUL See you later తరువాత మీరు చూడండి, తరువాత కలుద్దాము
CUL8ER See you later తరువాత మీరు చూడండి
DOM Dirty old man
DWB Don't write back
E2E Exchange to Exchange
E2E e business to e-business
F2F Face to face
FYI For your information
GA Go Ahead
GF Girl Friend అడ స్నేహితురాలు లేక ప్రియురాలు
GL Good Luck
HAND Have a nice day
IC I see
IM Immediate message
IMS I am sorry
JMO Just my opinion
k ok అలాగే లేక సరే
LOL Laughing Out Loud
MorF Male or female
MOSS Member of the same sex
NRN No response necessary
OMG Oh My God
OIC Oh I See

ఇవీ చూడండి

[మార్చు]
  • వికీపీడియాలో కల అప్రమేయ తెలుగు టైపింగు పద్ధతి వాడే వారు, వెబ్ ఛాట్ లో తెలుగులో టైపు చేయుటకు, మైక్రోసాఫ్ట్ లేక గూగుల్ వారి విహరిణి ప్లగిన్లు (బుక్ మార్క్లెట్లు) కాని కంప్యూటర్ లో స్థాపన అనువర్తనాలు ( మంచి ఎంపిక ఎందుకంటే త్వరితకీ లతో భాష మార్చగలగుతారు, ముఖ్యంగా గూగుల్ బుక్ మార్క్లెట్లలో మౌస్ తోటే తెలుగు భాషని చేతనం లేక అచేతనం చేయాలి, మైక్రోసాఫ్ట బుక్ మార్క్ లెట్ లో CTRL+M తో ఇంగ్లీషు, తెలుగు మధ్య మార్పుకీగా వాడవచ్చు) కాని వాడాలి. మరిన్ని వివరాలకు చూడండి కీ బోర్డు
  • వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్

బయటి లింకులు

[మార్చు]

వనరులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వెబ్_ఛాట్&oldid=4290689" నుండి వెలికితీశారు