శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్
శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్ শরত্চন্দ্র চট্টোপাধ্যায় | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | దేబానందపూర్, హుగ్లీ, బెంగాల్, బ్రిటిష్ ఇండియా | 1876 సెప్టెంబరు 15
మరణం | 1938 జనవరి 16 కలకత్తా,బెంగాల్, బ్రిటిష్ ఇండియా | (వయసు 61)
కలం పేరు | దేవి అనిలా |
వృత్తి | రచయిత |
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | భారతీయుడు |
కాలం | 19 వ శతాబ్దం |
రచనా రంగం | నవలలు |
సాహిత్య ఉద్యమం | బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము |
శరత్ చంద్ర చట్టోపాధ్యాయ్ లేదా శరత్‌చంద్ర చట్టోపాధ్యాయ్ (బెంగాలీ: শরত্চন্দ্র চট্টোপাধ্যায়) (1876 సెప్టెంబరు 15 - 1938 జనవరి 16) ఇరవయ్యవ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ నవలా రచయితా, కథా రచయితా. ఆయన నవలలు తెలుగునాట కూడా ప్రభంజనంలా ప్రాచుర్యం పొందాయి. సమాజాన్ని, వ్యక్తినీ లోతుగా అధ్యయనం చేసి సృష్టించిన ఆయన పాత్రలు, నవలలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగునాట నవలగా, చలన చిత్రంగా సంచలనం సృష్టించిన దేవదాసు ఆయన నవలే. చక్రపాణి మొదలైన అనువాదకులు ఆయనను తెలుగు వారికి మరింత దగ్గర చేసారు. చివరకు కొందరు పాఠకులు శరత్ బాబు తెలుగువాడేనని భావించేవారంటే, తెలుగులో ఆయన ప్రాచుర్యం ఎంతటిదో తెలుసుకోవచ్చు.
బాల్యం
[మార్చు]శరత్ హూగ్లీ జిల్లా దేవానందపూర్ లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. "ప్యారై పండిట్" పాఠశాలలో చదువు ప్రారంభించి, తర్వాత హూగ్లీ బ్రాంచ్ హై స్కూల్ లో చేరాడు. పేదరికం వల్ల తర్వాత చదువు మానేశాడు.
యవ్వనం
[మార్చు]శరత్ దాదాపు ఇరవై సంవత్సరాల పాటు భాగల్‌పుర్‌లో నివసించాడు. శరత్ రచనల్లో చాలా వరకు భాగల్‌పుర్‌లో రాసినవి లేదా భగల్పూర్ అనుభవాల ఆధారంగా రాసినవి. తల్లిదండ్రుల మరణం తర్వాత 1903లో బర్మా వెళ్ళి, అక్కడ ప్రభుత్వాఫీసులో గుమాస్తాగా చేరాడు. కానీ అక్కడ ఎక్కువ కాలం ఉండక, తిరిగి వచ్చేశాడు. తిరిగి వచ్చే ముందు ఒక కథల పోటీకి తన కథను పంపాడు. ఆ కథకు మొదటి బహుమతి వచ్చింది.
వ్యక్తిగతం
[మార్చు]పీడిత ప్రజల కోసం ధైర్యంగా ఎన్నో రచనలు చేసినప్పటికీ వ్యక్తిగతంగా చాల సిగ్గరి. ఒక సందర్భంలో ఆయన తన పాఠకులను కలవటానికి వేదిక పైకి పిలిచిన తర్వాత కూడా రాకుండా వెళ్ళిపోయాడు.
మరణం
[మార్చు]ఆయన 1938లో కాలేయ సంబంధ కాన్సర్ తో మరణించాడు.
జీవిత చరిత్ర
[మార్చు]శరత్ జీవిత చరిత్రను హిందీలో ప్రముఖ రచయిత విష్ణు ప్రభాకర్ రాశాడు. శరత్ కు సంబంధించిన విషయ సేకరణ కోసం ప్రభాకర్ పద్నాలుగు సంవత్సరాల పాటు అనేక ప్రదేశాలు తిరిగాడు.
రచనలు
[మార్చు]- బడదీదీ, (Borodidi) 1907
- బిందుగారబ్బాయి, (Bindur Chhele) 1913
- పరిణీత (Parinita/Parineeta), 1914
- విరాజ్ బహు (Biraj Bou) 1914
- రాముని బుద్ధిమంతనం (Ramer Shumot) 1914
- పల్లీ సమాజ్ (Palli Shomaj) 1916
- దేవదాసు (Debdas/Devdas), 1917 (రచించింది 1901లో)
- చరిత్రహీనులు (Choritrohin), 1917
- శ్రీకాంత్ (Srikanto), (4 భాగాలు, 1917, 1918, 1927, 1933)
- దత్త (Datta), 1917–19
- గృహదహనం Grihodaho, 1919
- శేష ప్రశ్న (Ses Prasna), 1931
- విప్రదాసు (Bipradas), 1935
- నిష్కృతి (Nishkriti)
- చంద్రకాంత్ (Chandranath)
- పండిత మహాశయులు (Pandit Mashay)
- నవవిధాన్ (Naba Bidhan)
- వైకుంఠుని వీలునామా (Boikunter Will)
- శుభద (Shubhoda)
- స్వామి Swami (The Husband)
- ఏకాదశి బైరాగి (Ekadoshi Bairagi)
- అనురాధ (Anuradha)
- హరిలక్ష్మి Harilakshmi
- కాశీనాథ్ Kashinath
- Abhagir Swargo
- Mejho Didi
- Bilashi
- Mandir
- Aalo O Chhaya
- Dhare Alo
- Srikanta
- Arakhsanya, 1916
- Anupamar Prem
- Andhare Aalo
- Shesher Parichoy
- Dorpochurno (Broken Pride)
- Mahesh (The Drought)
- Dena Paona, (Debts and Demands) 1923
- Pather Dabi, (Demand for a Pathway) 1926
- శారద (Sharda - మరణానంతర ప్రచురణ)
చలన చిత్రాలు
[మార్చు]ఆయన రచనల ఆధారంగా దాదాపు 50 సినిమాలు వివిధ భారతీయ భాషల్లో నిర్మించబడ్డాయి. ప్రత్యేకించి దేవదాసు ఎనిమిది సార్లు (బెంగాలీ, హింది, తెలుగు), పరిణీత రెండు సార్లు నిర్మించబడ్డాయి. హృషికేశ్ ముఖర్జీ 'మజ్లి దీదీ' (1967), 'బిందుగారబ్బాయీ ఆధారంగా 'ఛోటీ బహూ' (1971), 'స్వామి' (1977), నిష్కృతి ఆధారంగా హిందీలో బసు ఛటర్జీ 'అప్నే పరయే' (1980), తెలుగులో 'తోడికోడళ్ళు' నిర్మించబడ్డాయి. గుల్జార్ చిత్రం 'ఖుష్బూ ' (1975) కు 'పండితమహాశయుడు ' ప్రేరణ. ఆచార్య ఆత్రేయ సినిమా వాగ్దానం (1961) ఆయన కథ ఆధారంగా తీసిందే.
పురస్కారాలు
[మార్చు]- కుంతొలిన్ పురస్కార్ ('మంది ర్’ రచనకు)
- డి.లిట్ పట్టా (ఢాకా యూనివర్సిటీ - ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉంది)
పాఠ్యపుస్తకాలు
[మార్చు]- గోల్పొ సంగ్రహ (కథా సంగ్రహం) బాంగ్లదేశ్ లో బి.ఏ. కోర్సుకు పాఠ్యపుస్తకం.
- బాంగ్లా సాహిత్య (బెంగాలీ సాహిత్యం) బంగ్లాదేశ్ లో ఇంటర్మీడియెట్ పాఠ్యపుస్తకం.