Jump to content

శాంతకుమారి. జి

వికీపీడియా నుండి

శాంతకుమారి. జి, పెమ్మరాజు లక్ష్మీ సువర్చలాదేవి, వెంకటరమణ దంపతులకు తెనాలిలో జన్మించారు. దక్షిణభారత హిందీ, రాష్ట్ర భాష ప్రవీణ ఉత్తరార్థ్ర చేసి హిందీ టీచర్ గా పనిచేశారు.

కళాకారుణిగా

[మార్చు]

3వ ఏటనుండి భరతనాట్యం, కూచిపూడి శాస్త్రీయ నృత్యాలతోపాటు రంగస్థలంపైన బాలనటిగా తన కళాజీవితాన్ని ప్రారంభించి అనేక బహుమతులు పొందారు. వివాహ అనంతరం 1997వ సంవత్సరంనుండి రంగస్థల, రేడియో, టీ.వి., సిని నటిగా నటించారు. ఇందులో మచ్చుకి వీలునామా, తులసితీర్థం, ఔనుమల్లా, చిటారుకొమ్మన మిఠాయి పొట్లం, ఆషాఢమేఘం, పర్జన్యఘోష, పిరదౌషి, రాయబారం, అఖండ విప్లవజ్యోతి అంబేద్కర్, అంగుళీమాలుడు, ఇందాకటిదుందా?, వశీకరణ, కాస్తసిగ్గుపడదాం వంటి సాంఘిక నాటక, నాటికలు, పౌరాణిక, చారిత్రక నాటకాలలో నటించారు.

రంగస్థల దర్శకురాలిగా

[మార్చు]

తులసితీర్థం, అమ్మ అమ్మబడును, కంటిపాప, ఓనమః, వడిసెల, సన్నధానం మొదలైనవి.

రచయిత్రిగా

[మార్చు]

పాటల పరిమళం – కవితా నీరాజనం నీకోసం అనే పుస్తకంలో దాదాపుర 65 పాటలు కవితల సంపుటి, సన్నిధానం, గారడి గారడి గారడి, ఇదా ముగింపు, నిర్ణయం వంటి నాటకాలు, తలుపుకుషాళం, నాదీ ఆడజన్మే, ఆమె వంటి నాటికలు, అమరుడు, లంచం, నిర్ణయం, తీర్పు, ద్రౌపది మొదలైన ఏకపాత్రలు, ముసుగు, నిర్ణయం, గ్రీన్ సిగ్నల్ వంటి కథలు రచించారు.

స్క్రీన్ ప్లే, దర్శకనిర్మాతగా

[మార్చు]

పూతరేకులు (8 ఎపిసోడ్స్), మాఆవిడ మంగారం (లఘుచిత్రం).

నటిగా

[మార్చు]

నరసింహుడు, బంగారుకొండ420, కౌసల్యాఆంటీ మొదలైన సినిమాలు, కాంతిరేఖలు, బొమ్మరిల్లు, మనోరమ, మొగలిరేకులు, దేవత ఇలా దాదాపుగా 50 సీరియల్స్ లో నటించారు.

బిరుదులు

[మార్చు]
  • 2008లో వెన్నెల సంస్థ అధినేత ప్రముఖ ఇంటర్నేషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ చిట్టేరి గోపిచంద్ గారిచే ‘హాస్యనందిని’ బిరుదు,
  • 2010లో మైత్రిమహిళా మండలి వారిచే ‘మహానటి’ బిరుదు,
  • 2010లో జైపూర్ లో జరిగిన అంతర్జాతీయ రైల్వే వారి ద్వారా ‘జైపూర్ మహారాణి’ బిరుదు,
  • 2011లో బాదం సరోజాదేవి ట్రస్టు ద్వారా ‘మహిళా రత్న’ పురస్కారం,
  • 2011లో విజయవాడలో ఎ.పి.యస్.ఆర్.టి.సి ద్వారా,
  • 2013లో లలితాకల్చరల్ అసోసియేషన్ ద్వారా మహిళారత్న ఉగాది పురస్కారం.

అవార్డులు

[మార్చు]

జాతీయ స్థాయిలో నిర్వహించిన నాటక పోటీల్లో బిలాయి, ఖరగ్ పూర్, జైపూర్, తిరుపతి, కరీంనగర్ మొదలైన ప్రాంతాలలో ఉత్తమనటిగా 5సార్లు అవార్డు పొందడం జరిగింది.

ఇతర అంశాలు

[మార్చు]

దూరదర్శన్ ప్రివ్యూ బోర్డు మెంబరుగా కొన్నాళ్ళు పనిచేశారు. రేడియో ఆడిషన్ ఆర్టిస్టుగా, ధాత్రి సంక్షేమ సంఘం సేవా సంస్థతోపాటు ధాత్రి కళాంజలి సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా అనేక సేవా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.