Jump to content

శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం (వింజమూరు)

వికీపీడియా నుండి
శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీచెన్నకేశవస్వామి దేవాలయ గర్భగుడి.

నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామంలో ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీచెన్నకేశవస్వామి దేవాలయం ఈ గ్రామానికి చుట్టుప్రక్కల గ్రామాలలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయంలో ప్రతిరోజు అర్చకులు పూజలు చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ చుట్టుప్రక్కల గ్రామాలలోని జంటలకు జరిపించే సామూహిక వివాహాలను ఈ దేవాలయంలో నిర్వహిస్తారు. మామూలు రోజులలో కూడా ఇక్కడ వివాహాలు జరుగుతుంటాయి. ముఖ్యమైన పండుగ రోజులలో స్వామి వారు గ్రామోత్సవానికి విచ్చేస్తారు. ప్రతి సంవత్సరం గ్రామస్తుల సహకారంతో అత్యంత వైభవంగా తిరునాళ్ళను నిర్వహిస్తారు.

శ్రీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు

[మార్చు]

ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి తరువాత శ్రీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవములు ప్రారంభమవుతాయి. ఇవి 9 రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతవి.

దేవాలయ చరిత్ర

[మార్చు]

పలనాటి పౌరుషవంతులైన రాజవంశాలకు కులదైవంగా శ్రీ చెన్నకేశవస్వామి కొలువుదీరిన ఆలయమిది. 18వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని కడప ఓబులరెడ్డిగారి ఆధ్వర్యంలో పునర్నిర్మాణం జరిపారు. (ఈనాడు,30 అక్టోబరు 2013)

మూలాలు

[మార్చు]