Jump to content

షేర్ షా సూరి

వికీపీడియా నుండి
షేర్ షా సూరి
Padishah
Sultan of the Suri Empire
పరిపాలన17 May 1538 – 22 May 1545
Coronation1540
పూర్వాధికారిHumayun (as Mughal Emperor)
ఉత్తరాధికారిIslam Shah Suri
జననం1486
Sasaram, Delhi Sultanate (now in Bihar, India[1]మూస:Npsn
మరణం22 May 1545 (aged 58–59)
Kalinjar, Sur Empire
Burial
SpouseLad Malika[ఆధారం చూపాలి]
Gauhar Gosain[ఆధారం చూపాలి]
వంశముIslam Shah Suri (Jalal Khan)
Adil Khan
Names
Farid khan Lodhi
HouseHouse of Sur
రాజవంశంSur Dynasty
తండ్రిHassan Khan Sur
మతంIslam

షేర్ షా సూరి (1486 - 1545 మే 22) (అసలు పేరు ఫరీద్ ఖాన్ లోడి) భారత ఉపఖండంలోని ఉత్తర భాగంలో సూరీ సామ్రాజ్య స్థాపకుడు. ఆధునిక బీహారులో ఉన్న సాసారం తన రాజధానిగా చేసుకున్నాడు. షేరు షా ఆఫ్ఘాన్ పాష్తున్ సంప్రదాయానికి చెందిన వాడు. షెర్ షా మొహల్ 1538 లో మొఘల్ సామ్రాజ్యాన్ని తన నియంత్రణను తీసుకున్నాడు. 1545 లో ఆయన మరణించిన తరువాత అతని కుమారుడు ఇస్లాం షా అతని వారసుడు అయ్యాడు.[2][3][4][5][6][7] అతను ముందుగానే ప్రైవేటుగా పనిచేసెన తరువాత బాబర్ తరువాత మొఘల్ సైన్యంలో కమాండరుగా ఎదిగాడు. 1537 లో బాబర్ కొడుకు హుమయూన్ దండయాత్రలో దేశానికి వెలుపల ఉన్నప్పుడు, షేర్ షా బెంగాల్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని సూరి రాజవంశాన్ని స్థాపించాడు.[8] అద్భుతమైన వ్యూహకర్త షేర్ షా తనని తాను ఒక అద్భుతమైన నిర్వాహకుడిగా, అలాగే సామర్ధ్యం గల జనరలుగా నిరూపించుకున్నాడు. సామ్రాజ్యం పునర్వ్యవస్థీకరణ తరువాత మొఘల్ చక్రవర్తుల సామ్రాజ్యానికి పునాదులు వేశాడు. ముఖ్యంగా అక్బర్, హుమాయున్ కుమారుడు.[8]

1538 - 1545 వరకు తన ఏడు సంవత్సరాల పాలనలో ఆయన కొత్త పౌర, సైనిక పరిపాలనను ఏర్పాటు చేశాడు. "టాకా" నుండి మొట్టమొదటి రూపియాను జారీ చేసి భారతీయ ఉపఖండంలో తపాలా వ్యవస్థను తిరిగి నిర్వహించాడు.[9] ఆయన హుమాయూన్ దిన-పనా నగరాన్ని మరింత అభివృద్ధి చేసె దానికి షెర్ఘర్ (పురానా ఖిలా) అని పేరు పెట్టాడు. క్రీ.పూ. 7 వ శతాబ్దం నుండి క్షీణదశలో చారిత్రక నగరం పాటలీపుత్రను పునరుద్ధరించాడు.[10][ఆధారం యివ్వలేదు] ఈశాన్య భారతదేశంలో బెంగాల్ రాజ్యం సరిహద్దులలోని చిటగాంగు నుండి దేశం వాయవ్య ప్రాంతంలో ఆఫ్గనిస్తానులోని కాబూలు నగరం వరకు " గ్రాండు ట్రంకు రోడ్డు విస్తరించాడు.

ఆరంభకాల జీవితం, పూర్వీకం

[మార్చు]

షేర్ షా సూరి భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో సాసారంలో జన్మించాడు. అతని ఇంటిపేరు 'సూరి' సుర్ తెగ నుండి స్వీకరించబడింది. ఆయన పేరు షేర్ పర్షియన్ భాషలో షేర్ అంటే సింహం లేక పులి. ఆయన చిన్న వయసులో బీహారు రాజు మీద అకస్మాత్తుగా పులి దాడిచేసినప్పుడు ఆ పులిని చంపినందుకు ఆయన ధైర్యసాహసాలకు మెచ్చి ఆయనకు షేర్ అని బిరుదు ఇచ్చి సత్కరించిన తరువాత ఆఅయనకు షేర్ అనే పేరు స్థిరపడింది.[7][11] అతని తాత ఇబ్రహీం ఖాన్ సూరి నార్నాల్ ప్రాంతంలోని భూస్వామి (జగిర్దార్)గా ఉన్నాడు. ఆయన ఆ కాలంలో ఢిల్లీ పాలకులకు ప్రాతినిధ్యం వహించారు. ఇబ్రహీం ఖాన్ సూరి మజర్ ఇప్పటికీ నార్నాలులో ఒక స్మారక చిహ్నంగా ఉంది. తారిఖ్-ఇ ఖాన్ జహాన్ లోడీ [1][2] నార్నాలు పరగణంలోని బహ్లూల్ ఖాన్ లోడి ప్రభుత్వంలో ప్రముఖుడైన మయాన్ హాసన్ ఖాన్ సూరి ఎనిమిది మంది కుమారులలో ఆయన ఒకడు. షేర్ షా పష్టన్ సూరి తెగకు చెందిన వాడు.[ఆధారం చూపాలి]అతని తాత, ఇబ్రహీం ఖాన్ సూరి సుప్రసిద్ధ సాహసికుడు.[12] ఢిల్లీ సుల్తాన్ బహ్లౌల్ లోడీ దీర్ఘకాలం సాగించిన పోరాటం ఆరంభకాలంలో ఇబ్రహీం ఖాను సూరిని తన ప్రతినిధిగా నియమించాడు.

It was at the time of this bounty of Sultán Bahlol, that the grandfather of Sher Sháh, by name Ibráhím Khán Súri,*[The Súr represent themselves as descendants of Muhammad Súri, one of the princes of the house of the Ghorian, who left his native country, and married a daughter of one of the Afghán chiefs of Roh.] with his son Hasan Khán, the father of Sher Sháh, came to Hindu-stán from Afghánistán, from a place which is called in the Afghán tongue "Shargarí,"* but in the Multán tongue "Rohrí." It is a ridge, a spur of the Sulaimán Mountains, about six or seven kos in length, situated on the banks of the Gumal. They entered into the service of Muhabbat Khán Súr, Dáúd Sáhú-khail, to whom Sultán Bahlol had given in jágír the parganas of Hariána and Bahkála, etc., in the Panjáb, and they settled in the pargana of Bajwára.[1]

ఆయన చిన్న వయసులో భహ్లుల్ ఖాన్ లోడి సలహాదారు న్యాయవాది ఒమర్ ఖాన్ సర్వాని ఢిల్లీ పరగణా (ప్రస్తుత బీహారు రాష్ట్రంలోని భోజ్పూరు, బుక్సరు, భాబౌవా జిల్లాలు)లోని ఫరీదు ఖానుకు ఒక గ్రామాన్ని ఇచ్చాడు. ఫరీద్ ఖాను, అతని తండ్రి బీహార్ లోని సాసారం జాగీరుదారులుగా ఉన్నారు. అనేకమంది భార్యలు ఉన్న కారణంగా కొంతకాలం పాటు ఇంటికి రాలేదు. అందువలన అతను ఇంట్లో నుండి పారిపోవాలని నిర్ణయించుకున్నాడు.

During his early age, Farid was given a village in Fargana, Delhi (comprising present day districts of Bhojpur, Buxar, Bhabhua of Bihar) by Omar Khan Sarwani, the counselor and courtier of Bahlul Khan Lodi. Farid Khan and his father, a jagirdar of Sasaram in Bihar, who had several wives, did not get along for a while so he decided to run away from home.[ఆధారం చూపాలి]

ఉత్తర ప్రదేశ్లోని జౌన్పూర్ గవర్నరు జమాల్ ఖాను వద్ద పనిచేస్తున్నాడని తెలుసుకున్న ఆయన తండ్రి జమాల్ ఖానుకు ఒక లేఖను రాశాడు:

Faríd Khán, being annoyed with me, has gone to you without sufficient cause. I trust in your kindness to appease him, and send him back; but if refusing to listen to you, he will not return, I trust you will keep him with you, for I wish him to be instructed in religious and polite learning.[13]

జమాల్ ఖాను ఫరీదును ఇంటికి తిరిగి వెళ్ళమని సలహా ఇచ్చాడు. అయినా ఆయన తిరిగి వెళ్ళాడానికి నిరాకరించాడు. ఫరీదు బదులుగా ఒక లేఖ వ్రాసాడు:

If my father wants me back to instruct me in learning, there are in this city many learned men: I will study here.[13]

బీహారు, బెంగాలు విజయం

[మార్చు]

ఫరీద్ ఖాన్ బీహార్ మొఘల్ గవర్నర్ బహార్ ఖాన్ లోహనీ వద్ద సేవతో తన పనిని ప్రారంభించాడు.[2][14] అతని శౌర్యం కారణంగా బహార్ ఖాన్ అతనికి షెర్ ఖాన్ (లయన్ లార్డ్) అనే బిరుదు బహుమతిగా ఇచ్చాడు. బహార్ ఖాను మరణించిన తరువాత షేర్ ఖాను మైనరు సుల్తాను జలాలు ఖాను రాజప్రతినిధి అయ్యాడు. తరువాత బీహార్లో షేర్ షా అధికారం అభివృద్ధి చెందిందని గ్రహించిన జలాల్ బెంగాలు సుల్తాను గైసుద్దిన్ మహముద్ షా సహాయం కోరారు. గైసుద్దీన్ జనరల్ ఇబ్రహీం ఖాను నేతృత్వంలో సైన్యాన్ని పంపాడు.[ఆధారం చూపాలి] 1534 లో ఉజ్జయినీ రాజపుత్రులు, ఇతర స్థానిక నాయకత్వాలతో కూటమి ఏర్పడిన ఫలితంగా షేర్ ఖాన్ సూరజ్గఢ్ యుద్ధంలో శత్రిసైన్యాలను ఓడించాడు.[15] ఫలితంగా ఆయన బీహారు మీద పూర్తి నియంత్రణను సాధించాడు.[14]

1538 లో షేర్ ఖాన్ బెంగాలు పై దాడి చేసి మహమూద్ షాను ఓడించాడు.[14] కానీ చక్రవర్తి హుమాయూన్ ఆకస్మిక దండయాత్ర కారణంగా ఆయన రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.[14] 1539 జూన్ 26 జూన్‌న " చౌసా యుద్ధం " షేర్ ఖాన్ హుమాయునును ఎదుర్కుని ఓడించాడు. టైటిల్ను ఫరీద్ అల్-దిన్ షెర్ షా పొందాడు. 1540 మేలో " కన్నౌజ్ యుద్ధం "లో మరొకమారు ఓడించి భారతదేశం నుంచి బయటకు పంపాడు.[2][16]

మాల్వా విజయం

[మార్చు]

1537 లో గుజరాతు బహదూరు షా మరణం తరువాత ఖాదీరు షా మాల్వా సుల్తానేటు కొత్త పాలకుడు అయ్యాడు. తరువాత ఆయన మాల్వాలోని ముస్లిం ప్రముఖులైన ఖిల్జీ రాజవంశీయులు, రాజపుత్రుల మద్దతు కోసం ప్రయత్నించాడు. రాజ సిల్హడి కుమారులు భూపత్ రాయ్, పూరాన్ మాల్ రాయ్సేన్ ప్రాంతం మీద తమ ఆధిక్యత గుర్తిస్తే మాల్వా సామంతులుగా ఉండడానికి అంగీకరించారు. 1540 నాటికి భూపత్ రాయ్ చనిపోయాడు. తూర్పు మాల్వాలో పూరాన్ మాల్ ప్రబలమైన శక్తిగా మారాడు. 1542 లో షేర్ షా మల్వాను పోరాటం లేకుండా జయించాడు. ఖాదీర్ షా గుజరాతుకు పారిపోయాడు. తరువాత అతను మాల్వా గవర్నర్రుగా షుజాత్ ఖానును నియమించాడు. ఆయన పరిపాలనను పునర్వ్యవస్థీకరించి మాల్వా ప్రభుత్వంలో సారంగ్పూరును కేంద్రంగా చేసుకుని పాలించాడు. షేర్ షా తరువాత పూరాన్ మాలును ఆయన ముందుకు తీసుకురావాలని ఆదేశించాడు. పూరాన్ మల్ అతని ప్రభువుగా అంగీకరించి షేర్ షా సేవకు తన సోదరుడు చతుర్భుజ్ ను వదిలి వెళ్ళాడు. బదులుగా పురానా మాల్ భూమిని కాపాడటానికి షేర్ షా వాగ్దానం చేసాడు.[17][18]

షేర్షా స్వాధీనం చేసుకున్న చందేరిలోని ముస్లిం మతం స్త్రీలు ఆయన దగ్గరికి వచ్చి పురాన్ మల్ తమ భర్తలను చంపి వారి కుమార్తెలను బానిసలుగా తీసుకుని వెళ్ళాడని ఆరోపించారు. అతను వారిని ప్రతీకారం తీర్చకపోతే పునరుత్థాన దినమున షేర్ షాను ఖండిస్తామని బెదిరించారు. షేర్ షా పురాన్ మల్లును కాపాడతానని తన వాగ్దానాన్ని గుర్తుచేసిన తరువాత వారు ఆయనను ఉలేమాను సంప్రదించమని చెప్పారు. పురాన్ మాల్ మరణానికి అర్హుడని ఉలేమా ఒక ఫత్వా జారీ చేసాడు. షేర్ షా తన దళాలతో పూరన్ మాల్ శిబిరాన్ని చుట్టుముట్టారు. దీనిని చూసిన తరువాత పూరణ్ మాల్ తన భార్యను హత్య చేసి, వారి కుటుంబాలను చంపమని ఇతర రాజపుత్రులను ఆదేశించాడు. నిజాముద్దీన్ అహ్మద్ 4,000 రాజపుత్రులు దీనికి ప్రాముఖ్యతనిస్తున్నారని రాశారు. `అబ్దుల్ ఖాదీర్ బదూనీ 10,000 మంది రాజపుత్రుల ఉన్నారని పేర్కొన్నాడు.[19]

చరిత్రకారుడు అబ్బాస్ సర్వానీ ఈ విధంగా వర్ణించాడు. "వారి మహిళలు, కుటుంబాలను చంపడానికి హిందువులు నియమించబడ్డారు. అన్ని వైపులా ఆఫ్ఘన్లు హిందువుల చంపడం ప్రారంభించారు. పురాన్ మాల్, అతని సహచరులు కన్ను మూసి తెరిచే లోపల అందరూ చంపబడ్డారు. " కొద్దిమంది మహిళలు, పిల్లలు మాత్రమే జీవించి ఉన్నారు. పూరణ్ మాల్ కుమార్తె తన ముగ్గురు మేనల్లుళ్ళు ఖైదు చేయబడినప్పుడు నృత్య కళాకారిణిగా అలంకరించబడింది. ముస్లిం మహిళల బానిసలుగా చేసుకున్నందుకు ఇది ప్రతీకారమని షేర్ షా వాదించాడు. షేర్ షా తీవ్రంగా అనారోగ్యానికి గురైనప్పుడు కూడా రైజెన్ రాజపుత్రులను తుడిచిపెట్టమని శపథం చేసాడు.[20]

మార్వారు విజయం

[మార్చు]

1543 లో షేర్ షా సూరి 80,000 అశ్విక దళంతో మాల్డో రాథోర్ (మార్వార్ రాజపుత్ర రాజు)కు వ్యతిరేకంగా దాడి చేసాడు. మాల్డా రాథోర్ 50,000 అశ్వికదళ సైన్యంతో షేర్ షా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు వచ్చాడు. షేర్ షా శత్రు రాజధానిని ఎదుకోవడానికి బదులుగా జోధ్పూరుకు తూర్పున 90 కి.మీ. దూరంలో ఉన్న జైతరన్ పరగణాలోని సమ్మేల్ గ్రామంలో మకాం చేసాడు. ఒక మాసం తర్వాత అతని భారీ సైన్యానికి ఆహార సరఫరా కీలకమైన సమస్యగా మారింది. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి, షెర్ షా ఒక మోసపూరిత సాహసం చేసాడు. ఒకరోజు సాయంత్రం ఆయన మాల్డో శిబిరం సమీపంలో నకిలీ లేఖలను వదిలాడు. మాల్డో సైన్యాధికారులు కొందరు షేర్ షాకు సహాయం చేయడానికి అంగీకరించినట్లు ఈ అసత్య లేఖలు సూచించాయి. ఇది మాల్డాకు చాలా అసంతృప్తిని కలిగించింది. ఆయన వెంటనే తన కమాండర్లను వారి విధికి వదిలిపెట్టాడు అతని విశ్వాసులను నమ్మకద్రోకులుగా అనుమానించి మాల్డా తన సొంత మనుషులతో జోధ్పూరుకు చేరుకున్నాడు.[21]

ఆ తరువాత మాల్డా అమాయక సైనికాధికారులు జైత, కున్పా 80,000 మంది సైనికులు, ఫిరంగుల శత్రు దళానికి వ్యతిరేకంగా కేవలం కొన్ని వేలమంది సైన్యంతో పోరాడారు. సమ్మెల్ యుద్ధం (గిరి సమ్లే యుద్ధంగా కూడా పిలువబడేది) లో షేర్ షా విజయం సాధించాడు. కాని అతని సైన్యాధ్యక్షులు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అతని సైన్యం భారీ నష్టాలను ఎదుర్కొంది. షేర్ షా వ్యాఖ్యానించాడు, "బజ్రా కొన్ని గింజల కోసం (మిల్లెట్, ఇది బంజరు మార్వార్ ప్రధాన పంటగా ఉంది) నేను దాదాపు హిందూస్థాన్ రాజ్యం మొత్తాన్ని కోల్పోయాను."

ఈ విజయం తర్వాత, షేర్ షా జనరల్ ఖవాస్ ఖాన్ మార్వాట్ జోధ్పూరఉను స్వాధీనం చేసుకున్నాడు. 1544 లో అజ్మీర్ నుండి మౌంట్ అబూ వరకు మార్వారు ప్రాంతం ఆక్రమించాడు.[21]

ప్రభుత్వం

[మార్చు]
An inspection of Sher Shah Suri's Great North Road
Rupiya released by Sher Shah Suri, 1538–1545 CE, was the first Rupee

Specially Sher Khan was not an angel (malak) but a king (malik). In six years he gave such stability to the structure (of the empire) that its foundations still survive. He had made India flourish in such a way that the king of Persia and Turan appreciate it, and have a desire to look at it. Hazrat Arsh Ashiyani (Akbar the great) followed his administrative manual (zawabit) for fifty years and did not discontinue them. In the same India due to able administration of the well wishers of the court, nothing is left except rabble and jungles...

Mirza Aziz Koka, son of Ataga Khan, in a letter to Emperor Jahangir

త్రి- లోహవిధానంగా వర్గీకరించిన ముఘల్ నాణం వ్యవస్థను షేర్ షా పరిచయం చేశాడు. రౌపి అనే పదాన్ని గతంలో వెండి నాణెం కోసం సాధారణ పదంగా ఉపయోగించినప్పటికీ షేర్ షా తన పాలనలో ర్యూపీ అనే పదం 178 గింజల ప్రామాణిక బరువు కలిగిన వెండి నాణెం పేరు ఉపయోగించాడు. ఇది ఆధునిక రూపాయి పూర్వగామి.[9] భారతదేశం, ఇండోనేషియా, మాల్దీవులు, మారిషస్, నేపాల్, పాకిస్థాన్, సీషెల్స్, శ్రీలంక ఇతర దేశాలలో నేడు రూపాయిని జాతీయ కరెన్సీగా ఉపయోగిస్తున్నారు. 169 గింజలు, పైసా అని పిలువబడే రాగి నాణేలను, మోహూర్ అని పిలిచే బంగారు నాణేలు కూడా అతని ప్రభుత్వం ముద్రించబడ్డాయి.[9]

షేర్ ఖాన్ ఫరీద్ అల్-దిన్ షేర్ షా రాయల్ బిరుదును సాధించిన తరువాత ముద్రించిన (అహెచ్ 945 (సా.శ.1538)) నాణాలని స్పష్టంగా తెలుస్తుంది. చౌసా యుద్ధానికి ముందు తన స్వంత పేరుతో నాణేలు ముద్రించబడ్డాయి.[22]

షేర్ షా రోహ్తసు ఫోర్టు (ఇప్పుడు పాకిస్తాన్లోని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్) లతో వంటి స్మారక కట్టడాలు నిర్మించాడు. పాట్నాలోని రోహతాస్ ఘర్ కోటలో అనేక నిర్మాణాలు, పాట్నాలోని షేర్ షా సూరి మసీదు, 1540-1545 లో నిర్మించాడు. అతను 1545 లో పాకిస్తానుకు చెందిన ఒక నూతన నగరం బెరాను స్థాపించాడు. ఈ నగరం లోపల చారిత్రాత్మకమైన " గ్రాండ్ షేర్ షా సూరి " మసీదు నిర్మించారు.[ఆధారం చూపాలి]

ఢిల్లీ లోని పురానా ఖిలా సమీపంలో 1541 లో షేర్ షా నిర్మించిన ఖిలా-ఐ-కుహ్న మసీదు 1533 లో పురాణ ఖిలా కాంప్లెక్స్ లోపల హుమాయున్ సిటాడెల్లో ప్రారంభించిన హుమాయున్ సిటాడెలును తరువాత ఒక అష్టభుజి భవనం షేర్ మండలం నిర్మాణంతో పాటు విస్తరించాడు. తరువాత ఇది హుమాయున్ గ్రంథాలయం వలె పనిచేసింది.[ఆధారం చూపాలి].

అబ్బాస్ ఖాన్ సర్వాని వ్రాసి రచించిన " తారిఖ్-ఇ-షేర్ షాహి " (షెర్ షా చరిత్ర), తరువాత 1580 లో మొఘల్ చక్రవర్తి అక్బరు రచించిన " వాగియా నవిస్ " షెర్ షా పరిపాలన గురించి వివరణాత్మక సమాచారం అందిస్తుంది.[ఆధారం చూపాలి]

మరణం, వారసత్వం

[మార్చు]
Sher Shah Suri Tomb at Sasaram
The Tomb ( Covered in Green )

రాజపుత్రుల కలింజరు కోట ముట్టడి.[2] ఈ కోటను ఓడించటానికి అన్ని వ్యూహాలు విఫలమైన కారణంగా షెర్ షా కోట గోడలు గన్పౌడరుతో పెళ్ళగించాలని ఆజ్ఞాపించాడు. కాని గంపౌడరు పేలుడు ఫలితంగా షేర్ షా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన కుమారుడు జలాల్ ఖాన్ అధికారపీఠం అధిరోహించాడు. అతను ఇస్లాం షా సూరి అనే బిరుదును అందుకున్నాడు. షేర్ షా సూరి సమాధి (122 అడుగుల ఎత్తు), గ్రాండ్ ట్రంక్ రోడ్డులోని ససారమ్ లోని ఒక కృత్రిమ సరస్సు మధ్యలో ఉంది.[23]

చిత్రమాలిక

[మార్చు]

Sher Shah neighbourhood and Sher Shah Bridge in Kiamari Town of Karachi, Sher Shah Road in Multan cantt and Sher Shah Park in Wah Cantt, Pakistan, are named in the honour of Sher Shah Suri.[ఆధారం చూపాలి]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Abbas Khan Sarwani (1580). "Táríkh-i Sher Sháhí; or, Tuhfat-i Akbar Sháhí, of 'Abbás Khán Sarwání. CHAPTER I. Account of the reign of Sher Sháh Súr". Sir H. M. Elliot. London: Packard Humanities Institute. p. 78. Archived from the original on 2 జూన్ 2011. Retrieved 4 September 2010.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Shēr Shah of Sūr". Encyclopædia Britannica. Retrieved 23 August 2010.
  3. Chaurasia, Radhey Shyam (2002). History of medieval India: from 1000 A.D. to 1707 A.D. Crabtree Publishing Company. p. 179. ISBN 81-269-0123-3. Retrieved 23 August 2010.
  4. Schimmel, Annemarie; Burzine K. Waghmar (2004). The empire of the great Mughals: history, art and culture. Reaktion Books. p. 28. ISBN 1-86189-185-7. Retrieved 23 August 2010.
  5. Singh, Sarina; Lindsay Brown; Paul Clammer; Rodney Cocks; John Mock (2008). Pakistan & the Karakoram Highway. Vol. 7, illustrated. Lonely Planet. p. 137. ISBN 1-74104-542-8. Retrieved 23 August 2010.
  6. Greenberger, Robert (2003). A Historical Atlas of Pakistan. The Rosen Publishing Group. p. 28. ISBN 0-8239-3866-2. Retrieved 23 August 2010.
  7. 7.0 7.1 Lane-Poole, Stanley (2007) [First published 1903]. Medieval India: under Mohammedan rule (A.D. 712-1764). Lahore, Pakistan: Sang-e-Meel Publications. p. 236. ISBN 969-35-2052-1.
  8. 8.0 8.1 "Sher Khan". Columbia Encyclopedia. 2010. Retrieved 24 August 2010.
  9. 9.0 9.1 9.2 "Mughal Coinage". Reserve Bank of India RBI Monetary Museum. Archived from the original on 5 అక్టోబరు 2002. Retrieved 25 డిసెంబరు 2018.
  10. Patna encyclopedia.com.
  11. "Sur Dynasty". Britannica. Retrieved 5 December 2015.
  12. "Ancestral village of Sher Shah Sur in medieval Afghanistan". pashtunhistory.com.
  13. 13.0 13.1 Abbas Khan Sarwani (1580). "Táríkh-i Sher Sháhí; or, Tuhfat-i Akbar Sháhí, of 'Abbás Khán Sarwání. CHAPTER I. Account of the reign of Sher Sháh Súr". Sir H. M. Elliot. London: Packard Humanities Institute. p. 79. Archived from the original on 2 జూన్ 2011. Retrieved 4 September 2010.
  14. 14.0 14.1 14.2 14.3 Ali, Muhammad Ansar (2012). "Sher Shah". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.
  15. Ahmad, Imtiaz (2008). "State Formation and Consolidation under the Ujjaniya Rajputs". In Surinder Singh; Ishawr Dayal Gaur (eds.). Popular Literature and Pre-modern Societies in South Asia. Pearson Education India. p. 80. ISBN 978-81-317-1358-7.
  16. Haig, Wolseley (1962). "Sher Shah and the Sur Dynasty". In Burn, Richard (ed.). The Cambridge History of India: The indus civilization (in ఇంగ్లీష్). Cambridge University Press. p. 51. Retrieved 16 November 2016.
  17. Kolff, Dirk H. A. (2002). Naukar, Rajput, and Sepoy: The Ethnohistory of the Military Labour Market of Hindustan, 1450-1850 (in ఇంగ్లీష్). Cambridge University Press. p. 104. ISBN 9780521523059.
  18. Middleton, John (2015). World Monarchies and Dynasties. Routledge. p. 568. ISBN 9781317451587.
  19. Kolff, Dirk H. A. (2002) [First published 1990]. Naukar, Rajput, and Sepoy: The Ethnohistory of the Military Labour Market of Hindustan, 1450-1850 (in ఇంగ్లీష్). Cambridge University Press. p. 106. ISBN 978-0-521-52305-9.
  20. Eraly, Abraham (2002) [First published 1997]. Emperors of the Peacock Throne: The Saga of the Great Mughals. Penguin Books India. pp. 91–92. ISBN 978-0-14-100143-2.
  21. 21.0 21.1 Majumdar, R.C. (ed.) (2006). The Afghan Empire, Mumbai: Bharatiya Vidya Bhavan, pp. 81-2
  22. Coins of the Indian Sultanates, Goron & Goenka, 2001
  23. Asher, Catherine B. (1977). "The Mausoleum of Sher Shāh Sūrī". Artibus Asiae. 39 (3/4): 273–298. doi:10.2307/3250169. JSTOR 3250169.