సత్యలక్ష్మి కొమర్రాజు
సత్యలక్ష్మి కొమర్రాజు | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | వైద్యురాలు |
తల్లిదండ్రులు | మురళీధరరావు |
సత్యలక్ష్మి కొమర్రాజు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యురాలు. నల్లగొండ పట్టణంలో నేచర్‌క్యూర్ డాక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన సత్యలక్ష్మి, కొంతకాలం హైదరాబాదు ప్రకృతి చికిత్సాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసింది. ప్రస్తుతం పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (ఎన్‌ఐఎన్) డైరెక్టర్‌గా సేవలందిస్తున్నది.[1] 2018 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[2][3]
జననం, విద్యాభ్యాసం
[మార్చు]సత్యలక్ష్మి తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ పట్టణంలో జన్మించింది. సత్యలక్ష్మి నల్గొండలోని గీతావిజ్ఞాన్ స్కూల్లో చదువుకున్నది. సత్యలక్ష్మి తండ్రి కొమర్రాజు మురళీధరరావు అడ్వకేట్. ఆయన భూదాన్ ఉద్యమంలో పాల్గొన్నడంతోపాటు 'ప్రతిధ్వని' అనే పక్షపత్రికను కూడా నడిపేవాడు. స్కూల్లో చదువులో సగటు విద్యార్థిగా ఉన్న సత్యలక్ష్మి, ఇంటర్మీడియట్‌లో బైపీసీ కోర్సులో చేరి, మంచి మార్కులతో పాసయింది. ఆ తరువాత హైదరాబాదుకి వెళ్ళి 'నేచర్ క్యూర్' కోర్సులో చేరి, 1987లో ప్రకృతి వైద్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.[4]
హాస్పిటల్ ఏర్పాటు
[మార్చు]కోర్సు పూర్తయిన తరువాత తండ్రి సహకారంతో 1988లో నల్లగొండలోని స్వగృహంలో హాస్పిటల్ ఏర్పాటు చేసి, జిల్లా ప్రజలకు ప్రకృతి వైద్య చికిత్సను పరిచయం చేసింది. అక్కడ దాదాపు ఎనిమిది సంవత్సరాలు డాక్టర్ గా సేవలు అందించింది. 'నీలగిరి సాహిత్య వేదిక'లో క్రియాశీలకంగా పనిచేస్తూ, మహిళలను చైతన్య పరచడానికి 'సబల' అనే వేదికను ఏర్పాటు చేసింది. ఆ సమయంలోనే హైదరాబాద్‌లో ఎంఫిల్ పూర్తిచేసింది.
సామాజిక సేవ
[మార్చు]1996 నుంచి 2006 వరకు రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలోని నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేసింది. పెద్ద అడిశర్లపల్లి మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న యురేనియం ప్రాజెక్టు వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ఆ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడంలో సత్యలక్ష్మి కీలకపాత్ర పోషించింది. అమీర్‌పేట్‌లోని యోగా అద్యాన పరిషత్‌లో రీసెర్చ్ ఆఫీసర్‌గా, డైరెక్టర్‌గా పనిచేసింది.[5]
తెలంగాణ ఉద్యమం
[మార్చు]2006లో అమీర్‌పేట నేచర్‌క్యూర్‌లో రీసర్చ్ ప్రొఫెసర్‌గా అవకాశం వచ్చింది. హైదరాబాదుకి వెళ్ళిన తరువాత ఫోరమ్ ఫర్ బెటర్ హైదరాబాద్, ఫోరమ్ ఫర్ తెలంగాణ మొదలైన వాటిల్లో సభ్యురాలిగా చేరింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 'తెలంగాణ ఉమెన్ ఎంప్లాయిస్ అసోసియేషన్' అని ఏర్పాటు చేసి, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమంలో పాల్గొన్నది.
ఎన్‌ఐఎన్ డైరెక్టర్‌గా
[మార్చు]2015లో పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (ఎన్‌ఐఎన్) డైరెక్టర్‌గా పదోన్నతి పొంది, నేచర్‌క్యూర్ వైద్యంలో తన కృషిచేస్తున్నది.[6]
బహుమతులు - పురస్కారాలు
[మార్చు]- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2018 మార్చి 8[7][5]
మూలాలు
[మార్చు]- ↑ "Fight menopause with good lifestyle, eating right and exercise: Pune doctors". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-05-04. Archived from the original on 2021-09-13. Retrieved 2021-10-29.
- ↑ ఆంధ్రజ్యోతి (6 March 2018). "మహిళా దినోత్సవం సందర్భంగా.. 20 మంది మహిళలకు అవార్డులు". Retrieved 2021-10-29.[permanent dead link]
- ↑ ఈనాడు (6 March 2018). "మహిళామణులకు తెలంగాణ ప్రభుత్వ అవార్డులు". Archived from the original on 11 March 2018. Retrieved 2021-10-29.
- ↑ "ఆహారమే ఆరోగ్య రహస్యం | మానవి | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2021-10-29. Retrieved 2021-10-29.
- ↑ 5.0 5.1 India, The Hans (2018-03-07). "Satya Lakshmi selected for Women's Day Award". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-29. Retrieved 2021-10-29.
- ↑ "100 days to 7th International Day of Yoga". pib.gov.in (in ఇంగ్లీష్). Retrieved 2021-10-29.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Telangana Today (8 March 2018). "Telangana govt felicitates women achievers". Retrieved 2021-10-29.