సరూర్‌నగర్ చెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరూర్‌నగర్ చెరువు
ప్రదేశంహైదరాబాద్, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు17°21′21″N 78°31′38″E / 17.35584°N 78.52714°E / 17.35584; 78.52714
రకంసహజ చెరువు
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం99 ఎకరాలు (40 హెక్టార్లు)
గరిష్ట లోతు6.1 మీటర్లు (20 అడుగులు)
ప్రాంతాలుహైదరాబాద్

సరూర్‌నగర్‌ చెరువు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్‌నగర్‌ సమీపంలోవున్న చెరువు.[1] 16వ శతాబ్దం 1626లో కులీ కుతుబ్‌షా పాలనాకాలంలో తాగునీటి అవసరాలకు, పంటపొలాలకు నీరందించేందుకు సరూర్‌నగర్‌ చెరువు కట్టించబడింది.

చరిత్ర

[మార్చు]

హైదరాబాదులోని ఐదు ప్రధాన జలాశయాలలో ఒకటైన ఈ సరూర్‌నగర్‌ చెరువు 16వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది 99 ఎకరాల విస్తీర్ణం (40 హెక్టార్లు) లో 6.1 మీటర్లు (20 అడుగులు) గరిష్ఠ లోతు కలిగివుంది.

గణేష్ నిమజ్జనం

[మార్చు]

2001 నుండి ఈ చెరువులో నిమజ్జనానికి శ్రీకారం చుట్టారు. 2004 నుండి కేన్లు అందుబాటులోకి తెవడంతో అప్పటినుండి భారీ విగ్రహాల్ని ఇక్కడే నిమజ్జనం చేయడం మొదలుపెట్టారు.[2]

బోటింగ్

[మార్చు]

తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ప్రియదర్శిని పార్కులో ఏర్పాటుచేసిన సరూర్‌ నగర్‌ చెరువు బోటింగ్ కేంద్రాన్ని 2021, డిసెంబరు 23న పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించాడు. 4 నూతన బోటులను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[3]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Retrieved 17 December 2017.
  2. ఈనాడు. "నిమజ్జన మహా గణం". Archived from the original on 11 జనవరి 2018. Retrieved 17 December 2017.
  3. Telugu, Tnews (2021-12-23). "సరూర్‌నగర్‌ చెరువులో బోటింగ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్". TNews Telugu (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2022-01-28. Retrieved 2022-01-28.