సర్ ఆర్థర్ కాటన్ జీవితం - కృషి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సర్ ఆర్థర్ కాటన్ జీవితం - కృషి పుస్తకం సివిల్ ఇంజనీరు, గోదావరి డెల్టా రూపశిల్పి అయిన ఆర్థర్ కాటన్ జీవితచరిత్ర. కాటన్ కుమార్తె లేడీ హోప్ ఈ గ్రంథానికి ఆంగ్లమూలాన్ని రచించింది. తెలుగు రచయిత, సాహిత్య విమర్శకుడు కవనశర్మ తెలుగులోకి అనువాదం చేశాడు.
రచన నేపథ్యం
[మార్చు]గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద బారేజీ, కాలువలు నిర్మించి డెల్టా నిర్మాణం చేసి పొలాలు పండించిన సర్ ఆర్థర్ కాటన్ జీవితాన్ని కృషిని చిత్రీకరిస్తూ ఆయన కుమార్తె లేడీ హోప్ ఈ గ్రంథాన్ని ఆంగ్లంలో రచించింది. ఆ పుస్తకాన్ని కవన శర్మ తెలుగులోకి అనువదించాడు. మనసు ఫౌండేషన్ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.[1] మనసు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మన్నం రాయుడు "18, 19 శతాబ్దాలలో మనదేశంలోనూ, సమాజంలోనూ వచ్చిన పరిణామాలు వర్తమాన పరిస్థితులకి మౌలిక కారణం అన్న అవగాహన మాది. తెలుగు సమాజపు పరిస్థితులను ఎంతో కొంతైనా చెప్పే ఇతర భాషాగ్రంథాలను అనువదించి అందించాలన్న మా ‘మనసు’ పుస్తక ప్రచురణ కార్యక్రమంలో భాగంగా చెప్పులు కుడుతూ… కుడుతూ…, సర్ ఆర్థర్ కాటన జీవితచరిత్ర గ్రంథాలను ప్రచురించాం" అని ఈ పుస్తకం ప్రచురించడం వెనుక ఉద్దేశాన్ని రాశాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "సాహిత్యంపై'మనసు'నిస్వార్థ తపస్సు". www.teluguvelugu.in. Retrieved 2020-12-15.[permanent dead link]
- ↑ వెంకట రాయుడు, మన్నం. "'మనసు' లోపలి మాట (శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి సర్వలభ్య సంకలనం ఎలా తయారైందంటే..)". Pustakam.net. Retrieved 2020-12-15.
{{cite web}}
: CS1 maint: url-status (link)