సహాయం:విజువల్ ఎడిటరుతో దిద్దుబాటు చెయ్యడం పరిచయం/1
ఎడిటరును తెరవడం
పరికరాలపట్టీ ప్రాథమిక విషయాలు
లింకులు, వికీలింకులు
మార్పులను ప్రచురించడం
కొత్త వ్యాసాల సృష్టి
సారాంశం
|
మొబైల్ పరికరాల్లో ఎడిటింగ్ గురించి ఒక గమనిక: చాలా మంది వికీపీడియన్లు కంప్యూటరులో దిద్దుబాట్లు చేసేందుకు ఇష్టపడతారు. ఎందుకంటే ఎడిటింగ్ ఇంటర్ఫేస్ అక్కడ బాగా పనిచేస్తుంది. అదెలా ఉన్నా, మీరు మొబైల్ పరికరం నుండి సవరించవచ్చు. మరింత సమాచారం కోసం ఈ పేజీ చూడండి.
ఈ పాఠంలో విజువల్ ఎడిటరును వాడడాన్ని పరిచయం చేస్తాం. పూర్తి సమాచారాన్ని విజువల్ ఎడిటరు యూజర్ గైడ్లో చూడవచ్చు. అభిరుచుల్లోని దిద్దుబాట్లు ట్యాబుకు వెళ్ళి అక్కడ మీరు విజువల్ ఎడిటరును చేతనం చేసుకోవచ్చు: "విజువల్ ఎడిటర్ బీటా రూపంలో వున్నప్పుడు తాత్కాలికంగా అచేతనం చేయి." పెట్టెలో టిక్కు తీసెయ్యండి.
విజువల్ ఎడిటరును తెరవడంవిజువల్ ఎడిటరును చేతనం చేసుకున్నాక, ఏదైనా వ్యాసంలో పైన ఉన్న "మార్చు" ట్యాబును నొక్కి ఎడిటరును తెరవవచ్చు. (పెద్ద పేజీ అయితే తెరుచుకోడానికి కొంత సమయం పడుతుంది.)
|