సహాయం:విధానాలు మార్గదర్శకాల పరిచయం/1
విధానాలు, మార్గదర్శకాలు
కంటెంటు
ప్రవర్తన
సారాంశం
|
వికీపీడియా ఐదు ప్రాథమిక సూత్రాల పై ఆధారపడి స్థాపించబడింది. ఈ మూల సూత్రాలను స్పష్టం చేయడానికి, వాటిని వర్తింపజేయడానికి, విభేదాలను పరిష్కరించడానికీ, స్వేచ్ఛగా లభించే, విశ్వసనీయమైన విజ్ఞానసర్వస్వాన్ని సృష్టించాలన్న మా లక్ష్యాన్ని ముందుకు తీసుకు పోవడానికీ వికీ సముదాయం విధానాలు, మార్గదర్శకాలను ఏర్పరచింది.
విధానాలు వికీపీడియా ప్రాథమిక సూత్రాలను మరింత వివరంగా తెలియజేస్తాయి. మార్గదర్శకాలు విధానాలను ఎలా ఉపయోగించాలో, వ్యాసాలలో సాధారణ స్థిరత్వాన్ని ఎలా అందించాలో సలహా ఇస్తాయి. అధికారిక విధానాలు, మార్గదర్శకాలకూ వాటి పేజీల్లో పైన అది ఫలానా అని తెలియజేస్తూ ఒక నోటీసు ఉంటుంది. వాటి పేజీ పేరుకు ముందు "వికీపీడియా:" అనే ఉపసర్గ ఉంటుంది.
|