సీతారాముల కళ్యాణం చూతము రారండి (2017 సినిమా)
సీతారాముల కళ్యాణం చూతము రారండి | |
---|---|
దర్శకత్వం | జి.ఎన్.ఎస్. ప్రసాద్ |
రచన | రాజేంద్ర భరద్వాజ్ |
నిర్మాత | ఈడుపుగంటి శేషగిరి రావు ఎం.పిచ్చిరెడ్డి |
తారాగణం | సబ్యసాచి మిశ్రా, మనీషా ఛటర్జీ, సుమన్ |
ఛాయాగ్రహణం | ప్రసాద్ ఈదర |
కూర్పు | వి నాగిరెడ్డి |
సంగీతం | కిషన్ కవాడియ |
నిర్మాణ సంస్థలు | ఎస్.వి ఆర్ట్స్ రాం ప్రియాంక మీడియా ఎంటర్ టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 31 మార్చి 2017 |
సినిమా నిడివి | 161 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సీతారాముల కళ్యాణం చూతము రారండి 2017లో విడుదలైన తెలుగు చలనచిత్రం. జి.ఎన్.ఎస్. ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సభ్యసాచి మిశ్రా, మనీషా ఛటర్జీ, సుమన్ ముఖ్యపాత్రల్లో నటించగా, కిషన్ కవాడియ సంగీతం అందించాడు. ఎస్.వి ఆర్ట్స్, రాం ప్రియాంక మీడియా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఈడుపుగంటి శేషగిరి రావు, ఎం.పిచ్చిరెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్ర భరద్వాజ్ మాటలు,ప్రసాద్ ఈదర ఛాయాగ్రహణం అందించారు.[1] ఈ చిత్రం ఏకకాలంలో ఒడియాలో సీతా రామంక బహఘర కలిజుగారేగా రూపొందించబడి, 2017 మార్చి 31 లో విడుదలయింది.[2]
కథ
[మార్చు]కృష్ణ (సుమన్),మోహన్ (బిజయ్ మొహంతి)ప్రాణ స్నేహితులు. కృష్ణ కొడుకు రామ్ (సభ్యసాచి మిశ్రా)కి మోహన్ కూతురు సిత (మనీషా ఛటర్జీ)తో పెండ్లి చేసి స్నేహాన్ని బందుత్వంగా మార్చుకోవాలని నిశ్చయించుకుంటారు.సీత,రామ్ కలిసి పెరగడంతో ఒకరంటే ఒకరికి పడదు. పెళ్లి చెడగొట్టడం కోసం యిద్దరు కలిసి పధకం ప్రకారం ప్రాణ స్నేహితులను బద్దసత్రువులుగా మారేల చేస్తారు.పర్యవసానంగా సీత,రామ్ ల పెళ్లి ఆగిపోవడంతో పాటు,రెండు కుటుంబాల మధ్య రాకపోకలు కూడా ఆగిపోతాయి. అనుకున్న ముహుర్తానికే పిల్లలకు పెళ్లి చేయాలనీ పంతం పట్టిన పెద్దలు రామ్ కు శృతి (నేహా దేశ్ పాండే)తో,సీతకు మహేష్ (తేజ కాకుమాను)తో పెళ్లి నిశ్చయిస్తారు. రోజులు గడిచే కొద్దీ రామ్ లేకుండా సీత, సీత లేకుండా రామ్ సరదాగా సంతోషంగానే కాకుండా సహజంగా కుడా ఉండలేమని తెలుసుకుంటారు. విడిపోయిన పెద్దలను కలిపి కలిసుండాలనే ప్రయత్నంలో సీత రామ్ ఎలా సఫలీకృతం అయ్యారు అనేది మిగిలిన కథ.[3]
నటీనటులు
[మార్చు]- సభ్యసాచి మిశ్రా
- మనీషా ఛటర్జీ
- సుమన్
- బిజయ్ మొహంతి
- అనితా దాస్
- నేహా దేశ్ పాండే
- ప్రభావతి
- చలాకి చంటి
- తేజ కాకుమాను
- ఉషశ్రీ
- జబర్దస్త్ అప్పారావు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎస్.వి ఆర్ట్స్, రాం ప్రియాంక మీడియా ఎంటర్ టైన్మెంట్స్
- నిర్మాతలు: ఈడుపుగంటి శేషగిరి రావు, ఎం.పిచ్చిరెడ్డి
- దర్శకత్వం: జి.ఎన్.ఎస్. ప్రసాద్
- మాటలు: రాజేంద్ర భరద్వాజ్
- సంగీతం: కిషన్ కవాడియ
- సినిమాటోగ్రఫీ :ప్రసాద్ ఈదర
- ఆర్ట్ డైరెక్టర్: జి. కె .మూర్తి
- ఎడిటింగ్: వి నాగిరెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ "Ram Priyanka Media Entertainments Prod. No. 2 Muhurat". Ragalahari. 21 April 2016. Retrieved 13 November 2023.
- ↑ "BREAKFAST ODISHA with "SITA RAMA NKA BAHAGHARA KALI JUGARE" team". Prameya News7. 29 March 2017. Retrieved 13 November 2023.
- ↑ "'Seetharamula Kalyanam Chothamu Rarandi' gets a good response on OTT". Ragalahari. Retrieved 13 November 2023.