సీమా ప్రకాశ్
సీమా ప్రకాశ్ | |
---|---|
జననం | సెప్టెంబర్ 9 1961 ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ |
జాతీయత | భారతీయులు |
రంగములు | బయోటెక్నాలజీ |
సీమా ప్రకాశ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త.
జీవిత విశేషాలు
[మార్చు]సీమా ప్రకాశ్ భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో సెప్టెంబర్ 9 1961 న జన్మించారు. ఆమె తల్లి గృహిణి. ఆమెకు అక్క, ఒక సోదరుడు, చెల్లెలు ఉన్నారు. ఆమెకు 7 వ సంవత్సరంలో శాస్త్రవిజ్ఞానం పై ఆసక్తి కలిగింది.ఆమె "లేడీ ఆఫ్ ద లాంప్", 'ఫ్లోరెన్స్ నైటింగేల్" ల పట్ల ఆరాధనా భావం కలిగియుండేవారు. ఆమె భవిష్యతూలో శిశు వైద్యునిగా కావాలని కోరుకున్నారు.ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సైన్స్ పట్ల ఆమె ఆసక్తికి మద్దయునిచ్చి ప్రోత్సహించారు. కానీ మెడికల్ స్కూల్ కు వెళ్ళుటకు అవరోధాలు యేర్పడిన కారణంగా ఆమె శిశువైద్యురాలు కాలేకపోయినది. కానీ ఆమె వివిధ రకాల శిశు మొక్కల సంరక్షణ ద్వారా "శిశువైద్యురాలు" అయింది. వైద్యునిగా కావాలని ఆమె కోరిక ఆమె కుమార్తె రూపంలో నెరవేరింది. ఆమె కుమార్తె వైద్య కళాశాలలో చదువుతున్నారు.
సీమా ప్రకాశ్ కాన్పూర్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పొందారు. ఆమె అద్యయన రంగంలో పది మంది ఇతర విద్యార్థులు ఉండేవారు. ఆమె కాన్పూర్ విశ్వవిద్యాలయం నుండి బోటనీ నుండి మాస్టర్స్ డిగ్రీని జన్యుశాస్త్రము, ప్లాంట్ బ్రీడింగ్ అనే ప్రత్యేకాంశములలో పూర్తిచేశారు. ఎం.యస్సీ పూర్తి చేసిన తదుపరి ఆమె జితేంద్ర ప్రకాశ్ ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారు ఇంగ్లాండ్ లో కొంతకాలం పాటు ఉన్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆమె తల్లిగా బాధ్యతలునిర్వహించే సమయంలో కొంతకాలం రీసెర్చ్ అంశాలను ఆపారు. ఇంగ్లండ్ లో నివసించేకాలంలో ఆమె ట్వైఫోర్డ్ ప్లాంట్ లాబొరేటరీస్ ( ప్రస్తుతం ఇంటర్నేషనల్ ప్లాంట్ లాబొరేటరీస్) లోనూ, బాత్ విశ్వవిద్యాలయంలోను "టిష్యూ కల్చర్ ట్రైనింగ్" పూర్తిచేశారు. ఆమె భారత దేశానికి 1995 లో తిరిగి వచ్చునప్పుడు బెంగలూరు విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పొందారు [1].
విశిష్ట సేవలు
[మార్చు]డాక్టర్ సీమగారు 1995 లో ఇన్‌విట్రో ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించారు. ప్రత్యేకంగా తయారు చేసిన గాజు డబ్బాలలో మొక్కలను పెంచి ఇతర దేశాలకు సరఫరా చేశారు. దాదాపు 150 రకాల మొక్కలను ఉత్పత్తి చేశారు. ప్రభుత్వాల సహకారం ఉంటే టిస్యూ కల్చర్ ఫలితాలను వ్యాపింపజేయవచ్చునని అభిప్రాయపడ్డారు.
2003 లో డాక్టర్ సీమ గారి సంస్థ పపంచంలో పది సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అంతేకాదు, ఈమె గ్లోబల్ విమెన్ ఇన్వెంటర్స్ నెట్‌వర్క్ అవార్డ్ నూ గెలుచుకున్నారు. విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, వినియోగం అనే అంశాలమీద 29 దేశాల నుండి నామినేషన్లు రాగా 12 మంది న్యాయమూర్తులతో కూడిన ప్యానల్ పది దేశాలను ఎన్నిక చేసింది. ఆ పది దేశాల్లో భారతీయ మహిళగా డాక్టర్ సీమ గారు ఈ గౌరవం పొందారు.
- 2002 : బయోటెక్నాలజీ రంగంలో "AWAKE" అవార్డును బెంగళూరులో అందుకున్నారు.
- 2002 : రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు
- 2002 : డీలక్స్ గ్రీన్ లేబిల్ అఛీవర్ అవార్డు
- 2003 : ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు
- 2003 : రాష్ట్రీయ రత్న అవార్డు
మూలాలు
[మార్చు]- ↑ జీవిత విశేషాలు
- ↑ "అవార్డులు". Archived from the original on 2014-05-26. Retrieved 2014-03-16.