Jump to content

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్

వికీపీడియా నుండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
లోగో
సంకేతాక్షరంసిబిఎస్‌ఈ
స్థాపననవంబరు 3, 1962; 62 సంవత్సరాల క్రితం (1962-11-03)
రకంప్రభుత్వ విద్యా బోర్డు
ప్రధాన
కార్యాలయాలు
న్యూ ఢిల్లీ, భారతదేశం
కార్యస్థానం
  • "శిక్షా కేంద్ర", 2, కమ్యూనిటీ సెంటర్, ప్రీత్ విహార్, ఢిల్లీ - 110 092
అధికారిక భాషహిందీ, ఆంగ్లం
ఛైర్మన్వినీత్ జోషి
మాతృ సంస్థమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జాలగూడుwww.cbse.nic.in

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌ఈ) అనగా భారత ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల కొరకు ఏర్పడిన ఒక విద్యా మండళి.

అనుబంధాలు

[మార్చు]

సీబీఎస్ఈ అనుబంధాలుగా అన్ని కేంద్రీయ విద్యాలయాలు, అన్ని జవహర్ నవోదయ విద్యాలయాలు, ప్రైవేట్ పాఠశాలలు, భారత కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన అత్యధిక పాఠశాలలు ఉన్నాయి.

పరీక్షలు

[మార్చు]

ఈ బోర్డు 10, 12 తరగతుల ఆల్ ఇండియా సీనియర్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ (AISSCE) లకు ప్రతి సంవత్సరం సాంవత్సరిక పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ బోర్డు ఏటా దేశ వ్యాప్తంగా అనేక కళాశాలల్లో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్లలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి AIEEE పరీక్షను కూడా నిర్వహిస్తుంది. అయితే ఈ AIEEE పరీక్ష 2013 నుంచి ఐఐటి-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) తో విలీనం చేయబడింది. ఈ సాధారణ పరీక్ష ఇప్పుడు జేఈఈ (మెయిన్స్) అని పిలువబడుతుంది. సీబీఎస్ఈ భారతదేశంలో ప్రముఖ వైద్య కళాశాలల ప్రవేశ కోసం 'ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్' (AIPMT) ను కూడా నిర్వహిస్తుంది.

సెకండరీ స్కూల్ సర్టిఫికేట్

[మార్చు]

సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్‌ఎస్‌సి) ఎగ్జామినేషన్ 10వ తరగతి బోర్డు పరీక్షగా కూడా పిలవబడుతుంది, ఇది 10వ తరగతి విద్యార్థుల కొరకు సిబిఎస్‌ఈ, ఇతర రాష్ట్ర బోర్డులు సహా వివిధ విద్యా బోర్డులు నిర్వహించే ఒక పబ్లిక్ పరీక్ష.

మూలాలు

[మార్చు]