హేలీ తోకచుక్క
Halley's Comet on 8 March 1986 | |
కక్ష్యా లక్షణాలు[1] | |
---|---|
Epoch 2449400.5 (17 February 1994) | |
అపహేళి: | 35.1 AU (9 December 2023)[2] |
పరిహేళి: | 0.586 AU last perihelion: 9 February 1986 next perihelion: 28 July 2061[2] |
Semi-major axis: | 17.8 AU |
అసమకేంద్రత (Eccentricity): | 0.967 |
కక్ష్యా వ్యవధి: | 75.3 a[1] |
వాలు: | 162.3° |
హేలీ తోకచుక్క : Halley's Comet (/ˈhæli/ or /ˈheɪli/), అధికారిక నామం 1పి|హేలీ (1P/Halley),[1] ఇదొక స్వల్పకాలిక తోకచుక్క. భూమి మీద నుండి కంటికి ఏ పరికర సహాయమూ లేకుండా కనిపించే తోకచుక్క. ఇది ప్రతి 75–76 సంవత్సరాలకు ఒక సారి కనిపిస్తుంది.[1][3] ప్రతి మనిషి జీవితంలో గరిష్ఠంగా రెండు సార్లు కనిపించే తోకచుక్క. ఇది 1986 లో కనబడింది, మరలా 2061 లో కనబడుతుంది.[4]
ఇది 1910 సంవత్సరంలోను, 1986 లోను కనిపించిన తోకచుక్క. ఈ తోకచుక్క 76-77 సంవత్సరాల కొకసారి భూమికి దగ్గరగా వస్తుందని మొదటగా కనిపెట్టినవాడు ఎడ్మండ్ హేలీ అనే ఇంగ్లీషు శాస్త్రజ్ఞుడు. ఆయన పేరు మీదనే దానికి 'హేలీ తోకచుక్క' అని పేరు పెట్టారు. హేలీ 1659లో జన్మించాడు. తోకచుక్కల గురించి ఆయన పరిశోధన చేస్తూ పాత రికార్డులని తిరగ వేస్తుండగా, 1531లో కనబడిన ఒక ప్రకాశవంతమైన తోకచుక్క, 1607లో తిరిగి కనబడిందని తెలియవచ్చింది. 1682లో తాను స్వయంగా చూచిన తోకచుక్క అదేనని కూడా ఆయన కనిపెట్టాడు. అతని లెక్క ప్రకారం ఇది తిరిగి 1759లో మళ్ళి కనిపించింది. కానీ 1742 లోనే హేలీ కాలధర్మం చెందాడు.
హేలీ తర్వాత ఈ తోకచుక్క చరిత్ర తవ్వి తీయగా వరుసగా 76 సంవత్సరాల కొకసారి దాన్ని ఎవరో ఒకరు చూస్తూనే ఉన్నారని తెలిసింది. మానవులు చైనాలో మొదటిసారిగా దాన్ని క్రీస్తుపూర్వం 249 లో చూసినట్టుగా నిర్ధారణ అయింది. 1066లో ఇంగ్లండును నార్మన్ లు జయించినప్పుడు కూడా అదే తోకచుక్క కనబడినట్టు చరిత్రలో ఉంది.
ప్రాచుర్యం
[మార్చు]సాహిత్యంలో ప్రస్తావనలు
[మార్చు]- ఈ హేలీ తోకచుక్కనే 1910 లో గురజాడ అప్పారావు "సంఘ సంస్కరణ ప్రయాణ పతాక"గా వర్ణించాడు.
- ఈ తోకచుక్క గురించి అమెరికన్ రచయిత మార్క్ ట్వేన్ కథనం ప్రసిద్ధమైనది.
జనజీవితం లో
[మార్చు]- హేలీ తోకచుక్క కనిపించిన సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జన్మించిన పలువురికి ఈ విషయాన్ని స్ఫురించేలా హేలీ అన్న పేరు పెట్టుకున్నారు.
హేలీ తోకచుక్క కాలరేఖ
[మార్చు]
|
|
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;jpldata
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 2.0 2.1 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;horizons
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ G. W. Kronk. "1P/Halley". cometography.com. Retrieved 13 October 2008.
- ↑ O. Ajiki and R. Baalke. "Orbit Diagram (Java) of 1P/Halley". Jet Propulsion Laboratory Solar System Dynamics. Retrieved 1 August 2008.
ఉపయుక్త గ్రంధాలు
[మార్చు]- P. Lancaster-Brown (1985). Halley & His Comet. Blandford Press. ISBN 0-7137-1447-6.
- C. Sagan and A. Druyan (1985). Comet. Random House. ISBN 0-394-54908-2.
బయటి లింకులు
[మార్చు]- Synopsis of the Astronomy of Comets (1706 reprint of Halley's 1705 paper)
- Halley's nucleus by Giotto spacecraft (ESA link)
- Image of Halley in 1986 by Giotto spacecraft (NASA link)
- cometography.com
- seds.org
- Orbital simulation from JPL (Java) / Ephemeris
- Donald Yeomans, "Great Comets in History"
- A brief history of Halley's Comet (Ian Ridpath)
- Halley's Comet,12 BC