Jump to content

హైదరాబాదు కాళీ దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 17°17′28″N 78°18′55″E / 17.291201°N 78.315181°E / 17.291201; 78.315181
వికీపీడియా నుండి
హైదరాబాదు కాళీ దేవాలయం
భౌగోళికం
భౌగోళికాంశాలు17°17′28″N 78°18′55″E / 17.291201°N 78.315181°E / 17.291201; 78.315181
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి జిల్లా
స్థలంవివేకనందపురం, నేరెడ్‌మెట్‌
సంస్కృతి
దైవంకాళికాదేవి
ముఖ్యమైన పర్వాలుకాళీపూజ, దుర్గాపూజ
వాస్తుశైలి
నిర్మాణ శైలులుబెంగాళీ నిర్మాణం
కట్టడాల సంఖ్య1

హైదరాబాదు కాళీ దేవాలయం, హైదరాబాదు నేరెడ్‌మెట్‌లోని వివేకానందపురంలో ఉన్న హిందూ దేవాలయం. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 7 కి.మీ. దూరంలో ఉంది.[1][2] కాళికాదేవి ఒక్కడి ప్రధాన దేవత కాబట్టి కాళీ దేవాలయం లేదా కాళీ నివాసం అని పేరొచ్చింది. బాడి అంటే బెంగాళీ భాషలో దేవాలయం అని అర్థం. ప్రతి సంవత్సరం అక్టోబరు/నవంబరు నెలల్లో వచ్చే దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఇక్కడ కాళీపూజ, దుర్గాపూజలు జరుగుతాయి.[3]

కాళీబారి గురించి

[మార్చు]

కాళీ భక్తుడు, మల్కాజ్‌గిరి మాజీ ఎంఎల్‌సి ఎస్. మధుసూదన్ రెడ్డి, కాళి ఆలయాన్ని నిర్మించటంకోసం హైదరాబాద్ కాళీబాడి ట్రస్ట్‌కు 1974లో ఈ స్థలాన్ని విరాళంగా ఇచ్చాడు. ఆ తరువాత లాలా చౌదరి మామన్ రామ్ అగర్వాల్ సికింద్రాబాదులోని వివేకానందపురం, నేరెడ్‌మెట్‌ వద్ద కాళీబారి దేవాలయం నిర్మాణం కోసం విరాళాలు సేకరించడంలో ముందుకు వచ్చాడు. 1974లో హైదరాబాద్ కాళీబాడి ట్రస్ట్‌ ప్రారంభమైంది. రామకృష్ణ మఠము అప్పటి అధ్యక్షుడు స్వామి రంగనాథనందజీ మహారాజ్ చేత దేవాలయ నిర్మాణానికి పునాది రాయి వేశాడు.

1976, ఆగస్టు 28న పశ్చిమ బెంగాల్ లోని "చిట్పూర్" నుండి నల్లరాతితో తయారుచేసిన కాళీమాత విగ్రహం (కోల్‌కాతా లోని దక్షిణేశ్వర్ దేవాలయంలోని కాళీమాత నమూనాలో)ను కొనుగోలు చేశారు. రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి రంగనాథనందజీ మహారాజ్, అప్పటి దేవాదాయ శాఖామంత్రి రాజా సాగి సూర్యనారాయణరాజు తదితరులు విగ్రహ ప్రతిష్ఠనలో పాల్గొన్నారు. కోల్‌కతాలోని పేరొందిన చునగళి కాళీ దేవాలయ తాంత్రిక పూజారి విద్యారత్న శ్రీ గోస్త బిహారీ భట్టాఛార్జీ వచ్చి దేవతా విగ్రహ ప్రతిష్ఠన, ప్రాణ ప్రతిష్ఠ చేశారు. హైదరాబాద్ కాళీబాడి మొదటి పూజారి శ్రీ ఎ.కె. గంగూలీ శాస్త్రపూర్వకంగా వేద, తాంత్రిక మార్గాల్లో పూజలు చేయటానికి అతనికి సహాయం చేశాడు. దేవాలయ పేరుకోసం స్వామి రంగనాథనందజీ మహారాజ్‌ను సంప్రదించగా, "హైదరాబాద్ కళీ దేవాలయం" అని పేరు పెట్టాలని ఆయన సూచించాడు.

హైదరాబాద్ కాళీ దేవాలయంలో బెంగాల్‌కు సంబంధించిన సరస్వతి పూజ, అన్నపూర్ణ పూజ వంటి అన్నిరకాల పండుగలను నిర్వహించబడుతాయి. ప్రతి అమావాస్య రోజు దేవాలయంలో కాళీని పూజించే పూజలు జరుగుతాయి. ఈ పూజలకు అధికసంఖ్యలో భక్తులు సమావేశమవుతారు. ఇక్కడ బెంగాలీ బోధనలో పిల్లలకు ఉచిత పాఠశాల కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఆదివారం నృత్యం, గానం తదితర అంశాలలో శిక్షణ తరగతులు నిర్వహించబడుతాయి. ఇక్కడ జరిగే అన్ని సామాజిక కార్యక్రమాలలో పిల్లలు కూడా పాల్గొంటారు.

మూలాలు

[మార్చు]
  1. "Hyderabad Kalibari (image)". The Times of India. 15 ఫిబ్రవరి 2011. Archived from the original on 19 ఆగస్టు 2013. Retrieved 8 డిసెంబరు 2020.
  2. "It's 'City of Joy' for this Durga puja". The Times of India. 16 October 2012. Archived from the original on 15 October 2013. Retrieved 8 December 2020.
  3. "Kumar Sanu to sing at Kali Puja festivities". The Hindu. 27 October 2008. Archived from the original on 30 October 2008. Retrieved 8 December 2020.

ఇతర లంకెలు

[మార్చు]